సముద్ర పక్షులైన ఆల్బట్రాస్‌లు ఏకాంతంగా జీవించే పక్షులని చాలామందికి తెలియదు. ఇవి తమ భాగస్వామితో జీవితాంతం సహజీవనం చేస్తాయి. 50 ఏళ్లకు పైబడి జీవించే ఈ పక్షులు సంతానోత్పత్తి కోసం రెండు సంవత్సరాలకు ఒకసారి ఒకే భాగస్వామితో మేటింగ్ చేస్తాయి. అయితే పిరికి లక్షణాలతో ఘర్షణకు దూరంగా ఉండే మేల్స్.. బ్రేకప్ చెప్పే అవకాశముందని తాజాగా పరిశోధకులు వెల్లడిరచారు. ఒక నిర్దిష్ట భాగస్వామితో సంతానోత్పత్తిలో సక్సెస్ రేటు చాలా తక్కువగా ఉన్నప్పుడు అవి మరొక పార్ట్‌నర్‌ను వెతుక్కుంట.
అంతేకాకుండా సుదీర్ఘ ప్రాంతాలకు ప్రయాణించే పక్షుల్లో విడాకుల రేటు ఎక్కువట. పక్షులు వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించడం ద్వారా ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి చేరుకుంటాయి. తిరిగి వచ్చాక భాగస్వామి నుంచి విడిపోతుందట. చైనాలోని 232 రకాల పక్షులపై జరిపిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. ఎక్కువ దూరం ప్రయాణించే పక్షులలో విరామం, విడాకుల రేటు చాలా ఎక్కువ చైనాలోని సన్ యాట్ సేన్ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. ఇవి ఆహారం, సంతానోత్పత్తి కోసం ఏడాదికి రెండుసార్లు ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వెళ్తుంటాయట. విడాకులు తీసుకుని విడిపోయిన తర్వాత కొందరు వ్యక్తులు ఆజన్మాంతం ఒంటరిగానే బతికేస్తుంటారు. మరికొందరు కొత్త భాగస్వాములతో మిగతా జీవితం కొనసాగిస్తారు. అచ్చం మనుషుల్లానే.. పక్షులు కూడా ఇలాగే ఉంటాయని పరిశోధకులు అంటున్నారు.
పాత భాగస్వాములతో విడిపోయిన పక్షులు కొత్త భాగస్వాముల కోసం వెతుకుతున్నట్లు తమ పరిశోధనల్లో వెల్లడైందని సైంటిస్టులు చెబుతున్నారు. దీనికి కూడా మనిషే కారణమట. విచక్షణా రహితంగా అడవులు నరకడం మూలంగా ప్రపంచవ్యాప్తంగా కార్బన్-డై-ఆక్సైడ్ స్థాయిలు విపరీతంగా పెరుగుతోతున్నాయి. కొత్త కొత్త నగరాలు పుట్టుకొస్తున్నాయి. ఈ విధంగా మానవ తప్పిదాలు, వాతావరణ మార్పు, గ్లోబల్ వార్మింగ్ ప్రభావం పక్షుల జీవనంపై ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా పక్షుల జీవిత విధానం, అవి తినే ప్రదేశం మారుతోంది. సాధారణంగా పక్షుల సంఖ్యలో 90 శాతం భాగస్వామితో కలిసి ఉంటాయి.