చిరుత సరదాగా వేటకి బయలుదేరితేనే మిగతా జంతువుకు భయం పుడుతుంది. అదే ఆకలితో ఉన్న చిరుత వేటాడితే...రక్తం మరిగిన చిరుత కిరాతకంగా వెంటాడితే...ఎలా ఉంటుందో ఓజీ టీజర్ అలాగే ఉంది. పదేళ్ల క్రితం బాంబేలో వచ్చిన తుఫాన్ గుర్తుందా. అది మట్టి, చెట్లతో పాటు సగం ఊరినే మింగేసింది. కానీ వాడు నరికిన మనుషుల రక్తాన్ని మాత్రం ఇప్పటికి ఏ తుఫాన్ కడగకలేకపోయింది. ఇట్ వాస్ ఏ ఫ్రీకింగ్ బ్లడ్ బాత్. అలాంటోడు మళ్లీ తిరిగివస్తున్నాడంటే.. సాలా షైతాన్ అజాయేగా అంటూ’’ బ్యాక్ గ్రౌండ్‌లో చెబుతున్న అర్జున్ దాస్ వాయిస్ ఓవర్‌తో గ్లింప్స్ సాగింది. కాగా పవన్ పుట్టినరోజు సందర్భంగా విషెస్ చెబుతూ విడుదల చేసిన ఈ గ్లింప్స్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. అలాంటోడు మళ్ళీ వస్తే...అంటూ వపర్‌ఫుల్ డైలాగులతో టీజర్‌ని పవన్ కళ్యాణ్ భక్తుల కోసం నింపేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా మాఫియా నేపథ్యంలో రూపొందుతున్న సినిమా ‘ఓజీ’ ‘దే కాల్ హిమ్ ఓజీ అనేది ఫుల్ టైటిల్. ఓజీ అంటే ‘ఓరిజినల్ గ్యాంగ్‌స్టర్’ అని అర్థం. బహుశా... పవన్ అభిమానులు, సగటు సినిమా ప్రేక్షకుల్లో పోస్టర్లు, కాన్సెప్ట్ వీడియోలతో ఈ మధ్య కాలంలో ఈ స్థాయిలో ఆసక్తి కలిగించిన సినిమా మరొకటి లేదని చెప్పడంలో అతిశయోక్తి అవసరం లేదు.
మాఫియా నేపథ్యంలో యాక్షన్ డ్రామా
‘ఓజీ’ చిత్రానికి పవన్ కళ్యాణ్ వీరాభిమానుల్లో ఒకరైన సుజీత్ దర్శకుడు. మాఫియా నేపథ్యంలో యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. పవన్ కళ్యాణ్‌కి ఇష్టమైన జానర్ ఇది. దాంతో అంచనాలు పెరిగాయి. ఇవాళ పవన్ కళ్యాణ్ పుట్టినరోజుసందర్భంగా ‘ఓజీ’ వీడియో గ్లింప్స్ విడుదల చేశారు. హంగ్రీచీతా అంటూ ‘ఓజీ’ వీడియో గ్లింప్స్ విడుదల చేశారు. పేరుకు తగ్గట్టు చిరుత పులిలా పవన్ వేట సాగింది. ఓ ఫ్యాన్ బాయ్‌గా ఫ్యాన్స్ ఏం కోరుకుంటారో ఆ అంశాలను చూపించారు సుజీత్. పవన్ కళ్యాణ్ స్వాగ్‌కు తోడు థమన్ నేపథ్య సంగీతం, విజువల్స్, సుజీత్ డైరెక్టన్ తోడు కావడంతో ఈ గ్లింప్స్ అభిమానులకు ఫుల్ కిక్ ఇస్తుందని చెప్పవచ్చు. సాధారణ ప్రేక్షకులకు కూడా గూస్ బంప్స్ గ్యారెంటీ అని చెప్పవచ్చు.