ప్రజల అమాయకత్వం.. అవగాహన లేమి.. వెరసి నకిలీ వైద్యుల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ముఖ్యంగా ఆయుర్వేదం, పంచకర్మ, ఆక్యూ పంచుర్, హెర్బల్ వంటి పేర్లతో జనాల జేబులు లూటీ చేస్తున్నారు. ఏమాత్రం అర్హత లేకపోయినా, అడుగడుగునా క్లినిక్‌లు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆయుర్వేద డాక్టర్లుగా చెలామణి అవుతూ మోసాలకు పాల్పడుతున్నారు. వచ్చీరాని వైద్య సేవలతో ప్రజల ప్రాణాలతో ఆటలాడుకుంటున్నారు. ఈ తతంగం అంతా ఎక్కడో మారుమూల ప్రాంతంలో జరుగుతున్నదని కాదు. సాక్షాత్తూ జిల్లా గ్రేటర్ హైద్రాబాద్‌లోని కూకట్‌పల్లిలో నిత్యం జరుగుతున్న దందా. ఎంబీబీఎస్ నుంచి మొదలుపెడితే స్పెషలిస్ట్ వైద్యుల వరకూ వీరందరికీ సమాంతరంగా నకిలీల రాజ్యం కొనసాగుతుండడం గమనార్హం. వీరిపై గతంలో అనేక ఆరోపణలు వెల్లువెత్తినప్పటికీ ప్రాంతాలు మారుస్తూ, బోర్డులు తిప్పేస్తూ యథేచ్ఛగా తప్పుడు వైద్యాన్ని అందిస్తున్నారు. ఉన్నతాధికారులు తనిఖీలకు సమాయత్తమవుతున్నారంటే చాలు.. క్షణాల్లో వీరికి సమాచారం చేరిపోతుండడం విశేషం.పదవ తరగతి క్వాలిఫికేషన్‌తో ఆయుర్వేదం డాక్టర్‌గా
ఎలాంటి అర్హతల్లేకుండా ‘వైద్యులు’గా చలామణి అవుతున్న ఎందరో.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కొందరు మరో అడుగు ముందుకేసి.. తమ వీడియోల్లో చెప్పినట్టు చేస్తే మీకు బట్టతల మీద జుట్టు తెప్పిస్తా, మోకాళ్ళ నొప్పికి ఆపరేషన్ లేకుండా తగ్గిస్తా, రక్తపోటు, మధుమేహం, ఇతర వ్యాధులు అనేవి లేకుండా పోతాయంటూ ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సప్‌ల ద్వారా ఆకర్షిస్తూ.. అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. వారు చెప్పినవి పాటించడమే కాకుండా స్టేటస్ పెట్టుకొని ప్రచారం చేయడంతో మరికొందరు ప్రజలు.. నకిలీ వైద్యుల వలలో పడుతున్నారు. రాష్ట్రంలో నగరాలు, పల్లెలనే తేడాల్లేకుండా ఇలాంటివారు కోకొల్లలుగా పుట్టుకొస్తున్నారు. వీరికి వైద్య పట్టాలు లేకున్నా ఆయుర్వేదం, హోమియో డాక్టర్లమంటూ సామాజిక మాధ్యమాల ద్వారా అమాయకులను వంచిస్తున్నారని తెలంగాణ వైద్యమండలి వైద్యులు చెబుతున్నారు. ఒకవైపు వాడవాడలా నకిలీ వైద్యులు పుట్టుకొచ్చి.. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతుండగా.. మరోవైపు సోషల్ మీడియాలో నకిలీ వైద్యులు కొత్త రకాల మందులను, డైట్లను సూచిస్తూ వైరల్ అయ్యేలా చూస్తుండటం.. వాటి బారిన ప్రజలు పడుతుండటం ఆందోళన కలిగించే అంశం. ధనార్జనే ధ్యేయంగా.. మిడిమిడి జ్ఞానంతో వీరు అందిస్తున్న ‘వైద్యానికి’ పలుచోట్ల కొందరు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. నాగరాజు అనే వ్యక్తి ఎలాంటి అర్హతలు లేకున్నా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయుర్వేదం ఎక్స్‌పర్ట్‌గా చలామణి అవుతున్నాడు. ఎవరైనా అర్హత గురించి ప్రశ్నింస్తే మీరు ఎవరు నన్ను ప్రశ్నించడానికి అంటూ మీ రే నకిలీ జర్నలిస్ట్, డబ్బులు గుంజటానికి మీరు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు అంటూ ఎదురుదాడికి దిగటం దొంగే...దొంగ, దొంగ అన్న చందంగా తయారైంది. ఇతడిపై ఇప్పటికే తెలంగాణ వైద్యమండలికి, మెడికల్ కౌన్సిల్ అధికారులకి ఫిర్యాదు చేయటం జరిగింది.
వేటు వేయాల్సిందే !
ఎస్.ఎస్.సి. చదివిన నాగరాజు ఆయుర్వేదం ఎక్స్‌పర్ట్‌గా తనను తాను ప్రమోట్ చేసుకుంటూ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్స్‌లో ప్రచారాన్ని హÃరెత్తిస్తున్నాడు. ఇతడు ఏ అర్హతతో వైద్యం చేస్తున్నాడు ? అర్హత లేని వ్యక్తులు వైద్యం చేయటం చట్ట రిత్యా నేరం. అలాంటి వ్యక్తుల వల్ల ప్రజా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇలాంటి వ్యక్తులను ప్రజలు స్వచ్ఛందంగా బ్యాన్ చేయాల్సి ఉంది. అదే సమయంలో తెలంగాణ, ఆంధ్ర ఆయుష్ అధికారులు మొద్దు నిద్ర వీడి నాగరాజుపై సుమోటాగా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవల్సినది పలువురు కోరుతున్నారు. ఇక నుండి ఎక్కడైనా నూకతోటి నాగరాజ్ వీడియోల్లో వైద్యం చేయటం, సలహాలు సంప్రదింపులు చేయటం, మందులు రాయటం, వాటిని సొంతంగా ఫలానా ఆయుర్వేద ఔషదాలను ప్రచారం చేయటం, వాటిపై చికిత్సకు గ్యారెంటీ ఇవ్వటం వంటి చర్యలకు పాల్పడితే నిరభ్యంతరంగా కేసులు వేయవచ్చు. ఆయుష్ శాఖకు ఫిర్యాదులు చేయవచ్చు. ఇప్పటికైతే కేంద్ర, మరియు రాష్ట్ర ఆయుష్ శాఖలకు ఇతడిపై చర్యలు తీసుకోవలసిదిగా కోరాము. చూడాలి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో. ఇప్పటికైనా ఇతగాడి ఆగడాలకు చెక్ పెట్టకపోతే భవిష్యత్తులో ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడనుంది.
