మొదటిసారి తెర ముందుకు !
ఇప్పటికే ఒక ప్రొడక్షన్ హౌస్‌ను స్టార్ట్ చేసి నిర్మాతగా మారింది. అఖండ 2 కి తేజస్వినినే సమర్పకురాలిగా ఉండడం విశేషం. కేవలం నిర్మాతగానే కాకుండా మొట్ట మొదటిసారి నందమూరి కుటుంబం నుంచి నటిగా ఎంట్రీ ఇచ్చింది. హీరోయిన్‌గా కాకపోయినా.. ఒక జ్యూవెలరీ బ్రాండ్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా మారింది. సిద్దార్థ్ ఫైన్ జ్యూవెలరీకి తేజస్విని బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక అయ్యింది. దీంతో దానికి సంబంధించిన యాడ్ లో కూడా తేజస్వినినే నటించింది. తాజాగా ఈ యాడ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ యాడ్ చూస్తే తేజస్విని మొదటిసారి కెమెరా ముందుకు వెళ్ళింది అనుకోరు. ఎంతైనా నటన అనేది వారి రక్తంలోనే ఉంది అని అనిపిస్తుంది. తేజస్విని చూస్తే హీరోయిన్స్ ఏ మాత్రం సరిపోరు. అంత అందంగా కనిపిస్తుంది. ముఖంలో భావాలను అద్భుతంగా పలికించింది. ప్రస్తుతం ఈ యాడ్ నెట్టింట వైరల్ గా మారింది. తేజస్విని ముందు ముందు ఇండస్ట్రీలో కూడా కనిపిస్తుందేమో చూడాలి.
తెలివైన ఎంపిక !
తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రసిద్ధ ఆభరణాల బ్రాండ్లలో ఒకటైన సిద్ధార్థ ఫైన్ జ్యువెలర్స్, నందమూరి తేజస్వినిని బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక చేసుకోవటం తెలివైన నిర్ణయమే. ఒక్క దెబ్బతో బ్రాండ్ వ్యాల్యు అమాంతం పెరిగిపోయింది. అంతేకాదు ఇది నందమూరి కుటుంబానికి, తెలుగు సినిమా అభిమానులకు ఒక చిరస్మరణీయ సందర్భమని తెలియజేసింది. ఈ యాడ్ కు వై. యమునా కిషోర్ దర్శకత్వం వహించగా.. ప్రముఖ కొరియోగ్రాఫర్ బృందా మాస్టర్ అందమైన నృత్య రీతులు సమకూర్చారు. ఈ బ్రాండ్ ప్రమోషనల్ వీడియో తేజస్విని అందాన్ని, సమతుల్యతను మరింత అందంగా చిత్రీకరించింది. ఎస్‌ఎస్ థమన్ ఆహ్లాదకరమైన సంగీత సంగీతం విజువల్స్‌కు మరింత వెలుగునిచ్చింది. ఆయంక బోస్ సినిమాటోగ్రఫీ ప్రతి ఫ్రేమ్‌ను దృశ్యపరంగా మంత్రముగ్ధులను చేసింది. అవినాష్ కొల్లా అద్భుతమైన కళా దర్శకత్వం, నవీన్ నూలి స్పష్టమైన ఎడిటింగ్ తుది కూర్పును మెరుగులు దిద్దాయి. డబూ రత్నాని ప్రముఖ ఫోటోగ్రాఫర్ గా పనిచేశారు. ప్రముఖ డిజైనర్ నాగిని ప్రసాద్ వేమూరి, శ్రీమణి మతుకుమిల్లి, శ్రీదుర్గా కాట్రగడ్డ ముగ్గురు మహిళా పారిశ్రామికవేత్తలు ఈ సిద్ధార్థ్ ఫైన్ జ్యువెల్లర్స్ సంస్థను నిర్వహిస్తున్నారు. తాజాగా విలేకరుల సమావేశంలో శ్రీ వేమూరి కృష్ణ ప్రసాద్, సంస్థ తరపున మాట్లాడుతూ.. నందమూరి తేజస్వినితో బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.

