NTR : వరద బాధితుల కోసం ఎన్టీఆర్‌ భారీ విరాళం !

0

రెండు తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తిన విషయం తెలిసిందే. గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాల్లో వరదలు సంభవించాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ముఖ్యంగా ఏపీలోని విజయవాడ, తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలు పూర్తిగా నీట మునిగాయి. రంగంలోకి దిగిన అధికారులు వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. బాధితులు ప్రభుత్వం ఇచ్చే పరిహారం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్‌ స్టార్‌ నటుడు ఎన్టీఆర్‌ మంచి మనసు చాటుకున్నారు.

రాష్ట్రానికి రూ.50 లక్షల చొప్పున కోటి !

వరదలతో అతలాకుతలమైన రెండు తెలుగు రాష్ట్రాలకు ఆర్థిక సాయం ప్రకటించారు. వరద బాధితుల సహాయార్థం భారీ విరాళం ప్రకటించారు. తన వంతు సాయంగా ఒక్కో రాష్ట్రానికి రూ.50 లక్షలు చొప్పున మొత్తం రూ.కోటి విరాళంగా ఇవ్వనున్నట్లు వెల్లడిరచారు. ఈ మేరకు మంగళవారం ఉదయం ఎక్స్‌ వేదికగా ప్రకటించారు. ‘రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవలే కురిసిన భారీ వర్షాల వల్ల జరుగుతున్న వరద బీభత్సం నన్ను ఎంతగానో కలచివేసింది. అతిత్వరగా ఈ విపత్తు నుండి తెలుగు ప్రజలు కోలుకోవాలని నేను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. వరద విపత్తు నుండి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకునే చర్యలకి సహాయపడాలని నా వంతుగా ఆంధ్ర ప్రదేశ్‌ , తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరో రూ.50 లక్షలు విరాళంగా ప్రకటిస్తున్నా’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

తెలుగు రాష్ట్రాలకు రూ.10 లక్షల సాయం: విష్వక్‌సేన్‌

 తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల కోసం విష్వక్‌సేన్‌ తనవంతు సాయం చేశారు. రూ.10 లక్షలు విరాళంగా ప్రకటించారు. ‘ఈ విపత్తు సమయంలో, రాష్ట్రంలో వరద సహాయక చర్యలకు మద్దతుగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సీఎంల సహాయనిధికి రూ.10 లక్షలు విరాళంగా ఇస్తున్నాను. వరదల వల్ల నష్టపోయిన వారి బాధలను తగ్గించే దిశగా ఈ సహకారం ఒక చిన్న అడుగు’ అని పోస్ట్‌ పెట్టారు.

ఇటీవల కురిసిన వర్షాలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో వరద బీభత్సం సృష్టిస్తోంది. దీంతో సినీప్రముఖులు బాధితులకు అండగా నిలుస్తున్నారు. తాజాగా ఏపీ సీఎం రిలీఫ్‌ ఫండ్‌ (%aజూ షఎ తీవశ్రీఱవట టబఅస%)కు రూ.25 లక్షల విరాళం ఇస్తున్నట్టు వైజయంతి మూవీస్‌ ప్రకటించింది. అలాగే, ‘ఆయ్‌’ చిత్ర బృందం సైతం వరద బాధితులకు ఆర్థికసాయం చేయాలని నిర్ణయించుకుంది. సోమవారం నుంచి వారాంతం వరకూ ఆ సినిమాకి రానున్న వసూళ్లలో నిర్మాత షేర్‌లో 25 శాతాన్ని జనసేన పార్టీ తరఫున విరాళంగా అందజేయనున్నట్లు ప్రకటించింది.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !