Online Gaming Bill : ఆన్‌లైన్‌ గేమింగ్‌కు కేంద్రం చెక్‌ !

0

ఆన్‌లైన్‌ గేమింగ్‌ రంగాన్ని నియంత్రించే ‘ప్రమోషన్‌ అండ్‌ రెగ్యులేషన్‌ ఆఫ్‌ ఆన్‌లైన్‌ గేమింగ్‌ బిల్లు 2025’ బుధవారం లోక్‌సభలో ఆమోదం పొందింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ప్రవేశపెట్టిన ఈ బిల్లు, ప్రతిపక్షాల నిరసనల మధ్య పాస్‌ అయింది. దేశంలో బెట్టింగ్‌ యాప్‌ మాఫియా (Betting app mafia) కారణంగా అనేక కుటుంబాలు దెబ్బతింటున్నాయి. ప్రముఖులు, సెలబ్రిటీలతో ప్రచారంతో అనేక మోసాలు చేస్తున్న ఆన్‌లైన్‌ గేమింగ్‌ను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌లను నియంత్రించడం, ఆర్థిక మోసాలకు చెక్‌ పెట్టడం ఈ బిల్లు ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి. రియల్‌ మనీ గేమింగ్‌ (పోకర్‌, ఫాంటసీ స్పోర్ట్స్‌) నిషేధించడం, ఈస్పోర్ట్స్‌, ఎడ్యుకేషనల్‌ గేమ్స్‌, సోషల్‌ గేమ్స్‌ను ప్రోత్సహించడం దీని లక్ష్యం. అలాగే భారత్‌ను గ్లోబల్‌ గేమింగ్‌ హబ్‌గా మార్చాలని కూడా టార్గెట్‌ ​పెట్టుకున్నారు. ఈ బిల్లు ప్రకారం సెంట్రల్‌ ఆన్‌లైన్‌ గేమింగ్‌ అథారిటీ ఏర్పాటు చేస్తారు. 

మరోసారి ఆలోచించండి అంటూ లేఖ !

ఇది గేమ్స్‌ను ఈస్పోర్ట్స్‌, ఎడ్యుకేషనల్‌, సోషల్‌, రియల్‌ మనీ గేమ్స్‌ అని నాలుగు రంగాలుగా వర్గీకరిస్తుంది. రియల్‌ మనీ గేమ్స్‌ను ఆఫర్‌ చేయోద్దు, వాటికి సహకారం అందివొద్దు.. అడ్వర్టైజ్‌మెంట్‌​నూ  నిషేధించారు. బ్యాంకులు కూడా వీటి లావాదేవీలు చేయకూడదు. రియల్‌ మనీ గేమ్స్‌ నిర్వహిస్తే మూడేండ్ల జైలు లేదా రూ.1 కోటి జరిమానా విధిస్తారు. రెండూ కూడా విధించవచ్చు. వీటిని అడ్వర్టైజ్‌ చేస్తే రెండేండ్ల జైలు, రూ.50 లక్షల ఫైన్‌​. మళ్లీమళ్లీ చేస్తే ఐదేండ్ల జైలు, రూ.2 కోట్ల ఫైన్‌​ విధిస్తారు. ఇవి కాగ్నిజబుల్‌, నాన్‌-బెయిలబుల్‌ నేరాలు. వీటిని ఆడేవారిని బాధితులుగా పరిగణిస్తారు. అయితే కేంద్రం తీసుకొచ్చిన ఈ బిల్లుపై ఈ-స్పోర్ట్స్‌ ప్లేయర్స్‌ అసోసియేషన్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ‘‘గేమింగ్‌ కేవలం ఆట కాదు.. అది జీవనోపాధి’’ అంటూ ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ-స్పోర్ట్స్‌ ప్లేయర్స్‌ అసోసియేషన్‌ (E-Sports Players Association) ప్రధాని మోదీకి లేఖ రాసింది. Online Gaming Bill-2025పై ప్రధాని మోడీ మరోసారి ఆలోచించాలని.. ఈ నిర్ణయం తమపై తీవ్ర ప్రభావం చూపుతుందని గేమర్స్‌ ప్రధాని మోడీకి లేఖ రాశారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !