LUCKY DRAW SCAM IN VINUKONDA : లక్కీ డ్రా పేరుతో...డబుల్ బెడ్‌రూం అంత మోసం !

0

  • వినుకొండ వేదికగా అభిమన్యు పారెళ్ళ డబుల్ బెడ్‌రూమ్ డ్రా స్కామ్ ! 
  • రూ.999/-లకే డబుల్ బెడ్‌రూమ్ మరియు 81 గిప్ట్‌లు అంటూ ఊదరగొడుతున్న వైనం ! 
  • 40 లక్షల ఫ్లాట్ డాక్యుమెంట్స్ అడిగితే దాటవేత ధోరణి ! 
  • ఇల్లీగల్ అని చెబుతున్నా చట్టానికి లోబడే ‘డ్రా’ అంటూ బుకాయింపు ! 
  • కంపెనీ డెవలప్‌మెంట్ కోసమే స్కీమ్ అంటూ తలాతోక లేని వాదన ! 
  • చర్యలు తీసుకోకపోతే మరింత మంది ఇదే దారిలో మోసగించే ఛాన్స్ ! 

ఇప్పటికే సైబర్ నేరగాళ్ళతో విసిగిపోతున్న జనం, సాంప్రదాయ మోసగాళ్ళు మరో పక్క ఆశల వల విసిరి మోసగించే పనిలో బిజిగా ఉన్నారు.  ఒకప్పుడు ఒక ప్రాంతానికి పరిమితమైన ఈ లక్కీ డ్రాలు సోషల్ మీడియా పుణ్యమా అని రాష్ట్రాలు, దేశాల సరిహద్దులు దాటి పోయింది. వాట్సప్‌లో డిటైల్ పంపితే స్కానర్ ద్వారా డబ్బులు చెల్లించవచ్చు అని మీకు టోకెన్‌ను వాట్సప్‌లో పంపుతాం అంటూ మాయ మాటలతో ఆశల వల విసిరి సొమ్ము చేసుకుంటున్నారు. నిర్వాహకులు తమ తెలివినంత ఉపయోగించి LUCKY DRAW , టోకెన్ డ్రా పబ్లిసిటీ చేస్తున్నారు. ఇలాంటివి పోలీసుల దష్టికి తీసుకరాగా గత వారం హైద్రాబాద్ సీపీ సజ్జనార్ లక్కీ డ్రా, టోకెన్ డ్రా నిర్వహకులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అయినా సరే ఎవరూ తగ్గటం లేదు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు మరింతగా చెలరేగే అవకాశం ఉంది.

DREAM HOME కంపెనీ నేపథ్యం !

నవంబర్ 1, 2025లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేబర్ డిపార్ట్‌మెంట్ నుండి ఏపీ షాప్స్ & ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్  1988 అనుసరించి డ్రీమ్ హÃమ్ పేరుతో ఒక పేరును నమోదు చేసుకుంది. నవంబర్ 10, 2025 న రిజిస్టర్ కాబడిన DREAM HOME నెల తిరగకుండానే డిసెంబర్ 7 వ తేదీ నుండి డ్రా పేరుతో ప్రచారం ప్రారంభించింది. రియల్ ఎస్టేట్‌లో మిడిల్ మ్యాన్ (మార్కెటింగ్ & ఏజెంట్ల) వ్యవస్థను బలోపేతం చేసే విధంగా చెప్పబడుతున్న ఈ కంపెనీ లక్కీ డ్రా నే నమ్ముకుంది. టోకెన్ సిస్టమ్ అంటూ టికెట్లను అమ్ముతోంది. యువత, మధ్యతరగతి ప్రజల ఆశలపై వల విసురుతోంది. ఇలాంటి లక్కీ డ్రాలు, టోకెన్ డ్రాలు  నిర్వహించటం చ{్టరిత్యా నేరం, తెలుగు రాష్ట్రాల్లో వీటిపై బ్యాన్ ఉంది. ఇలాంటి మోసాలకు పాల్పడేవారిపై ‘ది ప్రైజ్ చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ బ్యానింగ్ యాక్ట్ - 1978’ కింద కేసులు నమోదు చేసే అవకాశం ఉంది.

FLAT DREAM HOME పేరు మీద లేదు ! 

ఈ సందర్భంగా DREAM HOME రియల్ ఎస్టేట్ కంపెనీ ప్రతినిధి అభిమన్యు పారెళ్ళను సంప్రదించగా చట్టానికి లోబడి నిబంధనలకు అనుగుణంగానే పనిచేస్తున్నాము. డ్రా ను ఎట్టిపరిస్థితుల్లో నిర్వహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా మీరు బహుమతిగా ఇచ్చే డబుల్ బెడ్‌రూమ్ (40లక్షల విలువ అని చెబుతున్న) ప్లాట్ డాక్యుమెంట్‌ను చూపించండి అని అడుగగా, మాట దాట వేయటం, 4 రోజులుగా సమాధానం చెప్పకుండా మౌనం దాల్చటం వెనుక పలు అనుమానాలకు తావిస్తోంది. త్వరలోనే ప్లాట్ ఓనర్‌తో చేసుకున్న ఒప్పందాన్ని పంపుతాం అని దాటవేత ధోరణి అవలంభిస్తున్నారు. దీంతో ఆ ఫ్లాట్ DREAM HOME కంపెనీ పేరు మీద కానీ కంపెనీ ప్రతినిధిగా చెప్పుకుంటున్న అభిమన్యు పారెళ్ళ పేరు మీద లేదని అర్థం అవుతోంది. లెక్కకు మిక్కిలిగా టోకెన్‌లు అమ్మి, వాటి ద్వారా వచ్చిన సొమ్ముతోనే డబుల్ బెడ్‌రూమ్ ప్లాట్‌ను కొనుగోలు చేయాలనే ఉద్ధేశ్యంతో కంపెనీ ప్రతినిధి ఉన్నట్లు తెలుస్తోంది. 

టోకెన్ డ్రాలతో మోసపోవద్దు ! 

కంపెనీ డెవలప్‌మెంట్ కోసమే ఈ టోకెన్ డ్రా అంటూ అభిమన్యు పారెళ్ళ బుకాయించటం కొసమెరుపు. కంపెనీ అభివద్ధి కోసమైతే కంపెనీ చేసే సేవలను ఉచితంగా అందించి ఆకట్టుకోవాలి కానీ టోకెన్ డ్రా లేదా లక్కీ డ్రా పేరుతో కస్టమర్ల సంఖ్యను పెంచుకుంటున్నాం. కస్టమర్ల ద్వారా రియల్ ఎస్టేట్‌లో బూమ్ తీసుకొస్తాం. తద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లోని కస్టమర్లు తన వద్దకు వస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా రియలఎస్టేట్ ఏజెంట్ల వ్యవస్థను బలోపేతం చేయబోతున్నట్లు తెలిపారు. కంపెనీ ద్వారా వందలాది మందికి ఉపాధి కల్పిస్తామని ధీమాగా చెప్పారు. ఈ కంపెనీ ఎదుగుదలకి, లక్కీ డ్రాకి సంబంధం ఏమిటంటే సంబంధంలేని మాటలతో మోకాలికి, బోడిగుండుకి ముడివేసే ప్రయత్నాలు చేస్తున్నారు. 



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !