Prasanna Vadanam Review : ప్రసన్నవదనం మూవీ రివ్వ్యూ

0

కొన్నేళ్లుగా కొత్త కథలకి కేరాఫ్‌గా నిలుస్తున్న కథానాయకుడు సుహాస్‌. ‘కలర్‌ ఫొటో’ నుంచీ ఓ కొత్త పంథాలో కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు. పక్కింటి అబ్బాయిని గుర్తు చేసే పాత్రలు... మనవైన కథలతో తెరపై సందడి చేస్తూ విజయాల్ని అందుకుంటున్నారు. ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్‌’ తర్వాత ఆయన ‘ప్రసన్న వదనం’ (Prasanna Vadanam Review) చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. సుకుమార్‌ వద్ద అసోసోయేట్‌ గా పని చేసిన అర్జున్‌ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ట్రైలర్‌ లో ఫేస్‌ బ్లైండ్‌ నెస్‌ కాన్సెప్ట్‌ సినిమా మంచి బజ్‌ క్రియేట్‌ చేసింది. అలా ఆశక్తి రేపుతున్న ఈ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకి వచ్చేసింది. మంచి ప్రచారంతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ చిత్రం ఎలా ఉంది?

కథేంటంటే: 

సూర్య (సుహాస్‌)  ఓ ఎఫ్‌ఎం స్టేషన్‌లో రేడియో జాకీగా పనిచేస్తుంటాడు. ఒక ప్రమాదం అతని జీవితాన్ని తలకిందులు చేస్తుంది. అమ్మానాన్నల్ని కోల్పోవడంతోపాటు... ఫేస్‌ బ్లైండ్‌ నెస్‌ (ప్రోసోపాగ్నోసియా) అనే సమస్య బారిన పడతాడు. ఫేస్‌ బ్లైండ్‌నెస్‌తో ఎవరి మొహాల్నీ గుర్తు పట్టలేడు, వాయిస్‌నీ గుర్తించలేడు. తన స్నేహితుడు విఘ్నేష్‌ (వైవా హర్ష)కి తప్ప తన సమస్య ఎవరికీ తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటూ కాలం గడుపుతుంటాడు. (Prasanna Vadanam Review) ఆద్య (పాయల్‌)తో ప్రేమలో కూడా పడతాడు. అలాంటి క్రమంలో ఆఫీసు నుంచి ఇంటికి వెళుతున్న సమయంలో ఓ అర్ధరాత్రి దారుణమైన హత్య చూస్తాడు. అమృత( సాయి శ్వేత)అనే అమ్మాయిని లారీ కింద తోసేస్తారు. ఈ ఘటనని ప్రత్యక్షంగా చూసినా సూర్యకి ఫేస్‌ బ్లైండ్‌ నెస్‌ ఉండడం వలన ఆ తోసిన వ్యక్తి ఎవరు అనేది గుర్తు పట్టలేడు. మరుసటి రోజు యాక్సిడెంట్‌ ని వార్తల్లో చూసి బాదితురాలికి న్యాయం జరగాలని భావించి.. పోలీస్‌ స్టేషన్‌ కి ఫోన్‌ చేసి జరిగిన అసలు సంగతి చెబుతాడు. ఆ వెంటనే అతనిపై దాడి జరుగుతుంది. అయినా వెనకడుగు వేయని సూర్య.. ఏసీపీ వైదేహి (రాశిసింగ్‌) దగ్గరికి వెళ్లి జరిగిన విషయం చెబుతాడు. తనకున్న సమస్యనీ వివరిస్తాడు. అనూహ్యంగా ఆ హత్య కేసులో సూర్యనే ఇరుక్కోవల్సి వస్తుంది. ఇంతకీ ఆ హత్య ఎవరు చేశారు? హత్యకి గురైన అమ్మాయి ఎవరు? ఆ కేసులో సూర్యని ఇరికించింది ఎవరు?అసలు నిందితులు ఎప్పుడు ఎలా బయటికొచ్చారు?సుహాస్‌ ప్రేమకథ ఏ తీరానికి చేరింది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే! (Prasanna Vadanam Review)

ఎలా ఉందంటే:

ఇప్పటికే తెలుగులో ఎన్నో సినిమాలు అనేక డిజార్డర్ల మీద సినిమాలు వచ్చాయి. ఇప్పుడు అదే కోవలో మనలో చాలా మందికి తెలియని ఫేస్‌ బ్లైండ్‌ నెస్‌ కాన్సెప్ట్‌ తో ఈ సినిమా (Prasanna Vadanam Review) తెరకెక్కించారు. ఒక కొత్త పాయింట్‌ ని ఎంచుకున్న దర్శకుడు అర్జున్‌ ఆ పాయింట్‌ ను అంతే కొత్తగా తెరపై చూపించే ప్రయత్నం చేసి దాదాపు సఫలం అయ్యాడు.  డిజార్డర్‌తో కూడిన ఈ తరహా కథలు మనకు కొత్త కాకపోయినా, సుహాస్‌ని ఇందులో చూడటం కొత్తగా అనిపిస్తుంది. ఆయనకి ఇప్పటివరకూ ఉన్న లోకల్‌ ఇమేజ్‌కి, ఆ తరహా పాత్రలకి దూరంగా వెళ్లి చేసిన సినిమా ఇది.  ఫేస్‌ బ్లైండ్‌నెస్‌ నేపథ్యం కూడా కొత్తగా, గతంలో వచ్చిన డిజార్డర్‌ సినిమాలకి భిన్నంగా అనిపిస్తుంది. మంచి మలుపులతో ప్రేక్షకులకు థ్రిల్‌ని పంచడంలోనూ దర్శకుడు విజయం సాధించాడు. కథానాయకుడి పాత్ర, దానికున్న సమస్య ప్రేక్షకులకు అర్థమయ్యేలా ఆరంభ సన్నివేశాల్ని మలిచాడు దర్శకుడు. కథానాయకుడికీ, అతని స్నేహితుడికీ మధ్య  సన్నివేశాలు, ఆద్యతో  ప్రేమాయణం ఎపిసోడ్‌తో ఆరంభ సన్నివేశాలు సరదా సరదాగా సాగిపోతాయి. కథానాయకుడు హత్య జరగడాన్ని చూడటం నుంచి కథలో ఆసక్తి మొదలవుతుంది. విరామానికి ముందు అనూహ్యంగా కథలో (Prasanna Vadanam Review) చోటు చేసుకునే మలుపు సినిమాని ఉత్కంఠభరితంగా మార్చేస్తుంది. ఇక ద్వితీయార్ధంలో కథానాయకుడి చుట్టూ ఉచ్చు బిగుసుకోవడం, ఎలాగైనా నేరస్తుడు ఎవరనేది కనిపెట్టాలని కంకణం కట్టుకోవడం, ఆ తర్వాత  పరిణామాలు, అతను సాగించే పోరాటం, నేరానికి సంబంధించిన ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌ ద్వితీయార్ధంలో కీలకం. హత్య ఎవరు చేశారనేది ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌తో ప్రేక్షకుడికి తెలిసిపోయినా, తనకున్న వ్యాధిని అధిగమించి, అసలు నిజాన్ని కథానాయకుడు ఎలా బయట పెడతాడనేది ఆసక్తికరంగా మారుతుంది. సెకండాఫ్‌ కీలక సమయాల్లో చోటు చేసుకునే మలుపులు, పతాక సన్నివేశాలు సినిమాని మరింత ఆసక్తికరంగా మార్చేస్తాయి. అక్కడక్కగా సన్నివేశాల్లో వేగం తగ్గినట్టు అనిపించినా, ఓ కొత్త రకమైన  థ్రిల్లర్‌ని చూసిన అనుభూతి ప్రేక్షకులకు కలుగుతుంది.

ఎవరెలా చేశారంటే: 

సూర్య పాత్రలో ఎప్పటిలాగే సుహాస్‌ (Prasanna Vadanam Review) ఆకట్టుకున్నాడు. ఎమోషనల్‌ సీన్స్‌ తో పాటు యాక్షన్‌ సీక్వెన్స్‌ తో కూడా అదరగొట్టాడు. క్యారెక్టర్‌కు అవసరమైన చోట హాస్యాన్ని, భావోద్వేగాల్ని పంచాడు. సుహస్‌ ప్రేయసి పాత్రలో పాయల్‌ లవ్‌ ట్రాక్‌ బాగుంది. రాశి సింగ్‌ కి కూడా మంచి పాత్ర పడిరది. నితిన్‌ ప్రసన్నకు అంబాజీ పేట అనంతరం మంచి రోల్‌ పడిరది. ఇక వైవా హర్ష కూడా ఎప్పటిలానే నవ్వించాడు. సత్య పాత్ర చిన్నదే అయినా ఆకట్టుకున్నాడు. ఇక మిగతా నటీనటులు అందరూ తమ తమ పరిధి మేరకు నటించారు. ఇక టెక్నికల్‌ టీం విషయానికి వస్తే బేబీ సినిమాతో ఒకసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన విజయ్‌ బుల్గానిన్‌ నేపధ్య సంగీతం కథని ఎలివేట్‌ చేసింది. సినిమాటోగ్రఫీ కూడా సినిమా స్థాయికి తగ్గట్టుగా సరిపోయింది ఒక రకంగా చెప్పాలంటే కొన్ని సీన్స్‌ ని ఎలివేట్‌ చేసిందని చెప్పొచ్చు. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. ఫైట్స్‌ మరింత ఆసక్తికరంగా ఉన్నాయి. సాంకేతికంగా సినిమాకి ఏ విభాగం లోటు చేయలేదు. థ్రిల్లర్‌ చిత్రాలకి భిన్నంగా కలర్‌ఫుల్‌గా సినిమా (Prasanna Vadanam Review) సాగుతుంది. చంద్రశేఖరన్‌ కెమెరా పనితనం మెప్పిస్తుంది. విజయ్‌ బుల్గానిన్‌ నేపథ్య సంగీతంతో ప్రభావం చూపించారు. ముఖ్యంగా ద్వితీయార్ధంలో అక్కడక్కడా కథాగమనంలో వేగం తగ్గినట్టు అనిపించినా,  కార్తీక  శ్రీనివాస్‌ ఎడిటింగ్‌ బాగుంది. దర్శకుడు అర్జున్‌కి ఇది తొలి చిత్రమే అయినా తన కథని ఎంతో స్పష్టంగా తెరపైకి తీసుకొచ్చారు. అర్జున్‌ రచనలో బిగి, బలం ఉంది. కాకపోతే కథని నడిపించిన విధానమే ఓ టెంప్లేట్‌లా అనిపిస్తుంది. నిర్మాణం పరంగానూ లోటేమీ లేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !