తుమ్మాపూర్ పరిశ్రమ ప్రాంతంలోని రాడికో ఖైతాన్ లిమిటెడ్ సంస్థ ప్రాంగణంలో 55వ జాతీయ భద్రతా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మార్చి 4న జరగాల్సిన ఈ వేడుకలను ముందుగా మంగళవారం రోజు జరుపుకున్నారు. సంస్థ ఈ.ఎం.ఎస్.పీ. అశోక్ కుమార్ జెండా ఆవిష్కరించి, భద్రతా ప్రమాణాల ప్రాముఖ్యతను తెలియజేశారు.ఉద్యోగులు, కార్మికులు కలిసి భద్రతా ప్రమాణాలపై అవగాహన కలిగి ఉండాలని ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఫ్యాక్టరీ ప్రాంగణంలో భద్రతా జెండాలతో, నినాదాలతో భద్రతా ర్యాలీ (మార్చ్ పాస్ట్) నిర్వహించి, కార్యాలయ మరియు ఉత్పత్తి విభాగాల్లో భద్రతపై అవగాహన కల్పించారు.రక్షణే ముఖ్యం
ఈ సందర్భంగా ఎస్.పీ. అశోక్ కుమార్ మాట్లాడుతూ ఫ్యాక్టరీలో ప్రవేశించే ముందు తప్పనిసరిగా పి.పి.ఈ. కిట్లు ధరించాలని సూచించారు. యంత్రాల వద్ద పనిచేసే సమయంలో వ్యక్తిగత సంరక్షణ చర్యలతో పాటు అప్రమత్తతతో వ్యవహరించాలని తెలిపారు. గ్లాస్ బాటిల్ ఫిల్లింగ్ సమయంలో హెల్మెట్, గాగుల్స్, ఏప్రాన్ వంటి రక్షణ కవచాలు తప్పనిసరిగా ధరించాలని అన్నారు. ఎలక్ట్రికల్ పనులు చేసే సిబ్బంది వ్యక్తిగత రక్షణ పరికరాలు ధరించాలని సూచించారు. ఎత్తైన ప్రదేశాల్లో పనిచేసే కార్మికులు సేఫ్టీ బెల్ట్లు వినియోగించడంతో పాటు నిరంతరం వాటిని చెక్ చేసుకుంటూ పనిచేయాలని అన్నారు.
ఏదైనా అనుకోని ఘటన, ప్రమాద సూచనలు గమనించిన వెంటనే ఉద్యోగులు, కార్మికులను అలర్ట్ చేయడంతో పాటు సెక్యూరిటీ సిబ్బందికి మరియు యాజమాన్యానికి తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా ఉద్యోగుల్లో భద్రతపై అవగాహన పెంపొందించడంతో పాటు పరిశ్రమ ప్రదేశంలో ప్రమాదరహిత వాతావరణాన్ని సృష్టించేందుకు రాడికో ఖైతాన్ లిమిటెడ్ కట్టుబడి ఉందని యాజమాన్యం తెలిపింది. ఇంకా ఈ కార్యక్రమాన్ని హెచ్.ఆర్ మేనేజర్ పవన్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేనేజర్లు, సీనియర్ స్టాఫ్, ఇంజినీర్లు, జూనియర్ స్టాఫ్, ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు.

