Guntur : లక్షకు నెలకి పదివేల వడ్డీ ఆశ చూపి గుంటూరులో ఘరానా మోసం !

0

  • గుంటూరులో ఘరానా మోసం ! 
  • లక్షకు నెలకి పదివేల వడ్డీ ఆశ చూపి కోట్లు వసూలు ! 
  • పుట్టి ముంచిన ట్రేడ్ దోస్త్ కంపెనీ ! 
  • కుటుంబంతో సహా పరార్ అయిన అన్నం పూర్ణచంద్రరావు ! 
  • పరారీకి తమ్ముడి సహాకారం !

ట్రేడింగ్ చేస్తా, మీ తలరాతలు మారుస్తా అంటూ గుంటూరు బ్రాడీపేట వేదికగా నిలువునా ముంచేసిన ట్రేడ్‌దోస్త్ కంపెనీ కథ. అరండల్‌పేట వీధుల్లో ఇప్పుడు ఏ నోట విన్న ఒకటే మాట ట్రేడ్‌దోస్త్ మోసం గురించే. పుస్తెల తాకట్టుపెట్టి ఇంటి అవసరాల కోసం, పిల్లల చదువు కోసం ఆశపడి పెట్టిన డబ్బును ఒక్కసారిగా మూటకట్టుకుని పరారైన నయవంచకుడు అన్నం వెంకట పూర్ణచంద్రరావు కథ ఇది. పేదవారి దగ్గర నుండి కోట్లు పెట్టిన బడాబాబుల వరకు అందర్ని టార్గెట్ చేసుకుని మోసం పోవటం ఇక్కడ కొసమెరుపు. 

అన్ని వర్గాలను టార్గెట్ చేసి....

మోసం, దగా, నయవంచనకు ప్రతిరూపం ఏదైనా ఉంది అంటే అది అన్నం వెంకట పూర్ణచంద్రరావే. షేర్ ట్రేడింగ్ వ్యాపారంలో పెట్టుబడి పెడితే అధిక వడ్డీ ఇస్తామని ఆశచూపి అమాయక ప్రజల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసింది ట్రేడ్ డోస్త్ కంపెనీ. దీనికి ఏజెంట్లను ప్రత్యేకంగా నియమించి వారికి ప్రతి నెలా ఒక లక్షకు రూ.1000/` కమీషన్ ఆశ చూపి దోరికినంత లాగేసుకోవటం అన్నం వెంకట పూర్ణచంద్రరావు ప్రత్యేకత. రూ. 10000/` కడితే నెలనెలా ఒక రైస్ బ్యాగ్ 20 నెలలు ఇస్తాం అని దగ్గర మొదలు పెట్టి కుక్కర్‌లు, స్కూటీలు, బంగారం, వెండి, డబ్బు...ఇలా ప్రతి నెలా ఏదో ఒక స్కీమ్ పేరుతో అన్ని వర్గాల వారిని వచ్చిన కాడికి దోచుకునే పథకం అమలు చేశారు. కేవలం కొద్ది రోజుల్లోనే వందలాది కోట్లు వచ్చిపడుతుండటంతో వచ్చిన డబ్బులో కొంత నమ్మకంగా తిరిగి ఇచ్చి నమ్మకాన్ని కలిగించటంలో విజయవంతం అయ్యారు. అన్నం పూర్ణచంద్రరావుకి ఒక రూ. 50 కోట్ల టార్గెట్ పూర్తికాగానే వాటితో పరారయ్యేందుకు పూర్తి స్థాయిలో మొదటి నుండే సిద్ధంగా ఉండటం గమనించదగ్గ విషయం. మోసం చేయటానినే చాలా మంది ఇలాంటి పద్ధతులు అనుసరించటం ఆందోళనకర విషయం.

అధిక వడ్డీ అంటే మోసమే !

బాపట్లకు చెందిన అన్నం పూర్ణచంద్రరావు ట్రేడింగ్‌లో కోట్లు గడించవచ్చు అనే బిజినెస్ మోడల్‌తో గుంటూరులోని అరండల్‌పేటలోని 16/2లో 20 నెలల క్రితం ట్రేడ్ దోస్త్ పేరుతో ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించారు. తమ కంపెనీలో పెట్టుబడి పెడితే రూ.1 రూపాయికి రూ.3 రూపాయలు ఆశ చూపించారు. వారాలు, నెలలు, గోల్డ్ స్కీమ్‌లు అంటూ ఆశల వల విరిరారు. ట్రేడ్ దోస్త్‌లో పెట్టుబడి పెట్టిన వారికి రూ.లక్షకు ప్రతినెలా వడ్డీ రూ.10వేల చొప్పున పెట్టుబడి పెట్టిన వారికి 20నెలల పాటు వడ్డీతో పాటు లాటరీ పద్దతిలో ఒక నెలలో అసలు చెల్లిస్తామని నమ్మించారు.  ఇది నమ్మిన కొంతమంది ఏజెంట్లుగా మారి కుప్పులు తెప్పలుగా పెట్టుబడి పెట్టారు. పలువురు తమ వద్ద ఉన్న నగదుతో పాటు తమ స్నేహితులు, బంధువులతో దాదాపు రూ.10లక్షల నుంచి రూ.2కోట్ల వరకు పెట్టుబడులు పెట్టించారు. అలా రెండు, మూడు వందల మంది నుంచి సుమారు రూ.100 కోట్లకు పైగా వసూలు చేశారు. అందులో గుంటూరు, ఒంగోలు, కష్ణా జిల్లాలు తదితర ప్రాంతాలకు చెందిన వందలాదికి పైౖగా బాధితులు రూ.100 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టారు. అందుకు జామీనుగా చెక్కులు కూడా ఇచ్చారు. గత 20 నెలలుగా పెట్టుబడి పెట్టిన వారికి చెప్పిన ప్రకారం ప్రతినెలా వడ్డీ చెల్లిస్తూ వచ్చారు. గత 2 నెలలుగా కస్టమర్లకు వడ్డీలు చెల్లించకపోవటంతో బాధితులు మోసపోయామని గ్రహించి ఆఫీసుపై తెగబడి దాడులు చేసే వరకు వచ్చింది వ్యవహారం. దీంతో ట్రేడ్ దోస్త్ యజమాని అన్నం పూర్ణచంద్రరావు ఫోన్‌లు తీయకపోవటం, డైరెక్ట్‌గా కలిసి కస్టమర్లకు సమాధానం చెప్పకపోవటం బోర్డ్ తిప్పేసి పారిపోయినట్టు తెలుస్తోంది.

ఉడాయించే పనిలో తమ్ముడి సహాకారం !

డిసెంబర్ చివరి వారం నుండే డబ్బులు చెల్లించటం ఆపివేసిన అన్నం పూర్ణచంద్రరావు బ్యాంకులో అమౌంట్ ప్రీజ్ అయింది అని నాటకానికి తెరతీశారు. కొద్ది రోజుల్లో మళ్ళీ అందరికీ చెల్లింపులు చేస్తాను అంటూ ఏజెంట్లతో పాటు కస్టమర్లను మభ్యపెట్టారు. ఇంకా నగదు ఇస్తే మళ్ళీ ట్రేడింగ్ చేస్తా, అందరి అప్పులు తీరుస్తా అంటూ నమ్మించారు. ఈ డబ్బు అంతా బాపట్లలోని శ్రీనివాస జ్యూలయర్స్ యజమాని అన్నం శ్రీనివాస్‌కు తరలించినట్లు తెలుస్తోంది. దానిని బంగారంగా మార్చినట్లు తెలుస్తోంది. అన్న పారిపోవడానికి కారును అరేంజ్ చేయటమేకాదు, దగ్గర ఉండి తన మనుషులతో ఊరు దాటించటంలో ఎంతో చాకచక్యంగా వ్యవహరించారు. బాధితులు బాపట్ల వెళ్ళి మరీ అన్నం శ్రీనివాస్‌ను నిలదీయటంతో సహాకరించినట్లు చేసి పోలీసుల సహాయంతో తప్పించుకోవటం కొసమెరుపు.  పెట్టుబడి పెట్టి మోసపోయిన వారిలో కొందరు ప్రభుత్వ ఉద్యోగులు, పెద్ద పెద్ద వ్యాపారులు ఉండటంతో తాము బయటకు వస్తే ఎక్కడ పరువుపోతుందోనని మదనపడుతున్నారు. తమ ఆస్తులు, బంగారు ఆభరణాలు అమ్మి పెట్టుబడి పెట్టి మోసపోయిన తమకు పోలీసులు తగిన న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు.

(ముఖ్యవిషయం : అన్నం వెంకట పూర్ణచంద్రరావు భార్య షేక్ రిజ్వానా సుల్లానా మరియు కొడుకు అన్నం జోగేంద్ర వెంకట సాయికుమార్ ముగ్గురు కలిసి చెన్నై, హైద్రాబాద్ ప్రాంతాలలో దాక్కున్నట్లు తెలుస్తోంది. ఎవరూ వీరి ముగ్గురి విషయం తెలిసినా బాధితులకు తెలియజేయవలసినది కోరుతున్నారు. సమాచారం అందించవలసిన నెంబర్ : 6302852085, 9440986951, 9886065337, 9052958786, 9533755844 కు సsప్రదించగలరు.)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !