- సజ్జనార్ వార్నింగ్‌ను పక్కన పెట్టి డ్రా నిర్వహణ !
- డ్రాలను లాభసాటి వ్యాపారంగా మార్చుకున్న పారెళ్ళ అభిమన్యు !
- పూర్తిగా సహాకరించిన వినుకొండ పోలీసులు !
- డ్రా గురించి హెచ్చరించిన పట్టించుకోని పల్నాడు S.P, జాయింట్ కలెక్టర్, కలెక్టర్
- టోకెన్ డ్రాలు, లక్కీ డ్రాలు ఎవరైనా పెట్టుకోవచ్చు.
- అభిమన్యుకి వర్తించని చట్టం ఇతరులకు వర్తించదు.
అమాయక ప్రజల ఆశలను పెట్టుబడిగా మార్చుకుని కోట్లకు పడగలెత్తుతున్న కేటుగాళ్ళ సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. నిషేధంలో ఉన్నా లక్కీడ్రా, టోకెన్ డ్రా, గివ్ అవేల పేరుతో జనాన్ని పబ్లిక్‌గానే దోచేస్తున్నారు. దాదాపు 15600 మంది నుండి రూ. 1000/- సేకరించి టోకెన్ డ్రాలు తీసి కోటి వెనకేసుకున్న అభిమన్యు పారెళ్ళ ధైర్యానికి హ్యాట్యాప్ చెప్పాల్సిందే. 3 నెలలుగా సోషల్ మీడియా వేదికగా ప్రచారం హÃరెత్తిస్తున్నా అధికారులు ఎవరూ పట్టించుకోక పోవటంతో మరింత రెచ్చిపోయారు టోకెన్ డ్రా నిర్వాహకులు. వినుకొండ పోలీసులు తెర వెనుక ఉండి పూర్తిగా సహాకరించినట్లుగా తెలుస్తోంది. ఈ టెకోన్ డ్రా నిర్వాహకులపై పల్నాడు జిల్లా S.P కె. శ్రీనివాసరావు, జాయింట్ కలెక్టర్ సంజానా సిన్హా, కలెక్టర్ కతికా శుక్లాని ముందుగా హెచ్చరించినా ఏ మాత్రం చర్యలు తీసుకోకపోవటం గమనార్హం.
ఆఫర్ల పేరుతో చివరి రోజు వరకు టోకెన్ల అమ్మకం !
మార్చి 12 వ తేదీన టోకెన్లు క్లోజ్ అని చెప్పిన పారెళ్ళ అభిమన్యు మార్చి 18 వ తేదీ వరకు అమ్మకాలు కొనసాగించారు. 5 టోకెన్లు కొంటే ఒకటి, 20 టోకెన్లు కొంటే 5 టోకెన్లు ఫ్రీ అంటూ ఊదరకొట్టారు. అంటే నిర్వాహకుల ఉద్ధేశ్యం స్పష్టంగా అర్థం అవుతుంది. చివరి వరకు ఎంత సొమ్ము వస్తే అంతా లాగేసుకునే ప్రయత్నం చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. జనాన్ని దోచుకోవటమే పరమావధిగా ఈ డ్రా జరిగినట్లు పారెళ్ళ అభిమన్యు చెప్పకనే చెప్పారు. దాదాపు ఎ నుండి జెడ్ వరకు 26 సిరీస్‌లలో ఒక్కో సిరీస్‌కు 600 చొప్పున 15600000/- (ఒక కోటి 56 లక్షలు) వసూలు చేశారు. 40 లక్షల ప్లాట్, బుల్లెట్, స్కూటీ వంటి ఇతర ఖర్చులు పోయిన నిఖరంగా కోటి రూపాయలు పారెళ్ళ అభిమన్యు జేబులో వేసుకున్నట్లు తెలుస్తోంది. చాలా వరకు మధ్య తరగతి ప్రజలు మోసపోయామని తెలుసుకుని విలపిస్తున్నారు.
వార్నింగ్ బేఖాతర్ !
లక్కీ డ్రాలు, టోకెన్ డ్రాలు, గివ్ అవేల పేరుతో డ్రాలు నిర్వహించటం చ{్టరిత్యా నేరం తెలుగు రాష్ట్రాల్లో వీటిపై బ్యాన్ ఉంది. ఇలాంటి మోసాలకు పాల్పడేవారిపై ‘ది ప్రైజ్ చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ బ్యానింగ్ యాక్ట్ - 1978’ కింద కేసులు నమోదు చేస్తాం అని హైద్రాబాద్ సీపీ సజ్జనార్ స్వయంగా వార్నింగ్ ఇచ్చినా నిర్వహకులు వెనుకడుగు వేయలేదు. డ్రాను నిర్వహించటం వెనుక పోలీసులు ఇతర పెద్ద నాయకులు అండ ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.
ఆయనకు వర్తించని చట్టాలు మనకు ఎలా వర్తిస్తాయి !
పారెళ్ళ అభిమన్యు ఎట్టకేలకు మూడు నెలలు ప్రచారం అనంతరం విజయవంతంగా డ్రా ను ముగించి లాభాలు ఆర్జించాడు. అదే కోవలో మరికొంత మంది డ్రాల పేరుతో లాభాలను ఆర్జించేందుకు ఇదే దారిని ఎంచుకునే అవకాశం ఉంది. ఎందుకంటే పల్నాడు జిల్లా పోలీసులు మరియు స్థానిక పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇదే అదునుగా మరింత మంది లక్కీ డ్రాలు వివిధ స్కీముల పేరుతో రెచ్చిపోయే ప్రమాదం లేకపోలేదు. మరో వైపు పారెళ్ళ అభిమన్యుకి వర్తించని చట్టాలు మనకి వర్తించవు అనే ధోరణి యువతలో వచ్చి అందరూ చట్టాలను ఉల్లఘించే పనిలో ఉంటారు.
ఎవరీ వైఫల్యం ఇదీ !
హౌస్ డ్రా, టోకెన్ డ్రా ఒకటి జరుగుతుందని జనవరిలోనే మెయిల్ ద్వారా పల్నాడు జిల్లా S.P. కె. శ్ర్రీనివాసరావు, జాయింట్ కలెక్టర్ సంజనా సిన్హా , కలెక్టర్ కతికా శుక్లా గారికి సమాజ్‌టుడే. కామ్ తరపున వారి దష్టికి తీసుకువెళ్ళినా ఎలాంటి చర్యలు తీసుకోక పోవటం వ్యవస్థ తీరుకు అద్దం పడుతోంది. ముఖ్యంగా వినుకొండ పోలీసులు చూసి చూడనట్టు వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఇంత పెద్ద ఎత్తున మండల పరిసరాలల్లో జరుగుతున్న కనీస చర్యలు తీసుకోవటం నిర్లక్షవైఖరిని చాటుతోంది.



