Dr. SUMAN KUMAR : సిద్ధార్థ షెల్ మాయాజాలం: డాక్టర్ సుమన్ కుమార్ డొల్ల కంపెనీల గుట్టు రట్టు!

0

  • డాక్టర్ సుమన్ కుమార్ షెల్ కంపెనీల మాయాజాలం
  • డొల్ల కంపెనీల గుట్టు రట్టు!

తెల్లకోటు వెనుక నల్లధనం సామ్రాజ్యం రాజ్యమేలుతుందా ? పేదలకు విద్య, వైద్యం అందించాల్సిన చేతులే అక్రమ ఆర్థిక లావాదేవీలకు అడ్డాగా మారాయా? సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ మరియు హాస్పిటల్స్ ముసుగులో జరుగుతున్న ‘షెల్’ కంపెనీల భాగోతం ఇప్పుడు నగరంలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రముఖ వైద్యుడు డా॥ సుమన్ కుమార్ చింతలపల్లి పేరు మీద వెలిసిన పదుల సంఖ్యలోని కంపెనీలు ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి.

ఒకే అడ్రస్.. 19 కంపెనీలు!

హైదరాబాద్‌లోని ఉప్పల్, నాచారం, కార్తికేయ నగర్ ప్లాట్ నెం. 256 అనేది కేవలం ఒక చిరునామా మాత్రమే కాదు, అదొక ‘కంపెనీల ఫ్యాక్టరీ’. ఆశ్చర్యకరంగా ఈ ఒక్క అడ్రస్ మీద ఏకంగా 19 ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు రిజిస్టర్ అయి ఉన్నాయి. 

ఏవీఐ (AVI) గ్రూప్: ఆక్వాకల్చర్ నుండి కోకోనట్ ఫార్మింగ్ వరకు, ఇన్‌ఫ్రా నుండి మెడికల్ రీసెర్చ్ వరకు ప్రతి రంగంలోనూ ఏవీఐ పేరుతో కంపెనీలు పుట్టుకొచ్చాయి. 

అమరావతి & గౌతమీ సిరీస్: అమరావతి ల్యాండ్ డెవలపర్స్, గౌతమీ డ్రీమ్స్ వంటి పేర్లతో రియల్ ఎస్టేట్ రంగంలో భారీగా డొల్ల కంపెనీలను సృష్టించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఆస్తులు లేవు.. ఆఫీసులు లేవు.. అంతా పేపర్ల మీదే!

ఈ కంపెనీల లోతుల్లోకి వెళ్తే అసలు విషయం బయటపడుతుంది. వీటిలో పని చేసే ఉద్యోగులు ఉండరు, కనీసం బోర్డులు ఉండే ఆఫీసులు కూడా ఉండవు. కానీ, కాగితాల మీద మాత్రం కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతుంటాయి. నామమాత్రపు పెయిడప్ క్యాపిటల్‌తో ప్రారంభమైన ఈ కంపెనీలను కేవలం మనీ లాండరింగ్ కోసమే వాడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

స్కూల్ ఫీజుల నుండి.. రియల్ ఎస్టేట్ సామ్రాజ్యం వరకు

సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ (గౌతమీ ఎడ్యుకేషన్ సొసైటీ) పేరుతో తల్లిదండ్రుల నుండి వసూలు చేస్తున్న భారీ ఫీజులను, సేవా సంస్థలుగా కలరింగ్ ఇస్తూ ఈ షెల్ కంపెనీలకు మళ్లిస్తున్నట్లు తెలుస్తోంది.

బ్లాక్ మనీ ఇన్వెస్ట్‌మెంట్: విద్యా సంస్థలు, ఏవీఐ క్లినిక్స్, ఫార్మా రంగా ద్వారా వచ్చే ఆదాయాన్ని నల్లధనంగా మార్చి, వాటిని అంకుర హాస్పిటల్స్ (ఉప్పల్, ఎ.ఎస్.రావు నగర్) మరియు రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులలో పెట్టుబడులుగా పెడుతున్నట్లు సమాచారం. 

బ్యాంకుల నుండి లోన్లు : ఈ డొల్ల కంపెనీల పేర్లతో బ్యాంకుల నుండి భారీగా లోన్లు పొంది, ఆ నిధులను ఇతర వ్యాపారాలకు తరలించడం ఒక పక్కా ప్లాన్ ప్రకారం జరుగుతోందని తెలుస్తోంది.

లిస్టులో ఉన్న మరికొన్ని పేర్లు

ఈ అక్రమ వ్యాపార సామ్రాజ్యంలో కేవలం సుమన్ కుమార్ మాత్రమే కాదు, కుటుంబ సభ్యులు మరియు సన్నిహితులు కూడా భాగస్వాములుగా ఉన్నారు. స్వప్న చింతలపల్లి, జగదీశ్వరరావు చింతలపల్లి, అమరావతి చింతలపల్లి వంటి వారు వివిధ కంపెనీల్లో డైరెక్టర్లుగా చలామణి అవుతున్నారు.

చర్యలు తీసుకునేది ఎవరు?

విద్య, వైద్యం వంటి పవిత్ర రంగాలను అడ్డం పెట్టుకుని, మద్యం సిండికేట్లు మరియు రియల్ ఎస్టేట్ దందాలకు పాల్పడుతున్న ఈ ‘డాక్టర’ మాయాజాలంపై MCA (MINISTRY OF CORPORATE AFFAIRS) మరియు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దృష్టి సారించాల్సిన అవసరం ఉందని బాధితులు మరియు సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !