NARAYANA : జేఈఈ మెయిన్‌ 2024లో నారాయణ సెన్సేషనల్‌ రికార్డ్‌ !

0

జేఈఈ మెయిన్‌ 2024 సెషన్‌ 1 ఫలితాల ప్రాథమిక ‘కీ’ ని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విడుదల చేసింది. ప్రాథమిక ‘కీ’ని అనుసరించి నలుగురు నారాయణ విద్యార్థులకు 300/300 మార్కులు సాధించనున్నట్లు నారాయణ విద్యాసంస్థల అకడమిక్‌ డైరెక్టర్‌ పి. ప్రమీల తెలిపారు. యం. సాయితేజ (240310661132), షేక్‌ సూరజ్‌ (240310038821), ఆర్యన్‌ ప్రకాష్‌ (240310099049), పి. రోహన్‌ సాయి (240310106660) 300ల మార్కులకు గాను 300 మార్కులు సాధించనున్నట్లు చెప్పారు. తెలంగాణ నుండి ఇద్దరు, ఆంధ్రప్రదేశ్‌ నుండి ఒకరు, ముంబై (మహారాష్ట్ర) నుండి ఒకరు ఈ ఘనత సాధించినట్లు చెప్పారు. అలాగే 295 మార్కుల పైన 48 మందికి పైగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఏప్రిల్‌లో జరిగే మరో విడత జెఈఈ మెయిన్‌ పరీక్షలోనూ మరింత మంది 300/300 మార్కులు సాధించనున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. సాయితేజ 8 వ తరగతి నుండి నారాయణ స్కూల్‌లో చదువుతుండగా, షేక్‌ సూరజ్‌ 5 వ తరగతి నుండి నారాయణ స్కూల్స్‌ ట్రైన్‌ అవుతున్నారని తెలిసింది. దేశవ్యాప్తంగా దాదాపు 9.50 లక్షలమంది విద్యార్థులు పరీక్షకు హాజరైయ్యారు. తుది ‘కీ’ ఫిబ్రవరి 12న వెలువడే అవకాశం ఉంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !