పేరుకేమో రియల్ ఎస్టేట్ కంపెనీ...కానీ చేసేదేమో మల్టీలెవల్ మార్కెటింగ్ ముసుగులో పెట్టుబడుల సేకరణ. నెలకి లక్షకి రూ. 10/- వడ్డీ నుండి మొదలుకొని వివిధ రకాల స్కీమ్‌ల పేరుతో కస్టమర్లకు కళ్ళు చెదిరే నెలవారీ గ్యారెంటీ రిటన్స్ పేరుతో చెలామణి అవుతున్న మరో మనీ సర్యులేషన్ స్కీమ్‌పై ఇప్పుడు సర్వత్రా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. మై ల్యాండ్ ఇన్‌ఫ్రా డెవలపర్స్ సంస్థ ప్రటిస్తున్న ఆఫర్లు, వారి వ్యాపార శైలిపై ఆర్థిక నిపుణులు ఖాతాదారులకు తీవ్రమైన హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సాధారణ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి, చట్టవిరుద్ధమైన ‘మనీ సర్క్యులేషన’ (పొంజీ స్కీమ్) సూత్రాలకు ముడిపెడుతూ సాగుతున్న ఈ వ్యవహారం త్వరలోనే కుప్పకూలే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
4 రకాల స్కీమ్‌లతో మోసాలు !
మొదటి స్కీమ్ : ఓ ఖాతాదారుడు10 లక్షలు పెట్టుబడి పెడితే వారికి రూ. 5 లక్షల విలువ చేసే గోల్డ్ కాయిన్స్ వెంటనే ఇస్తారు. మరో రూ. 5 లక్షలకు ల్యాండ్ అగ్రిమెంట్ ఇస్తారు. ఆ తర్వాత 20 నెలల కాలంలో నెలకు 1 లక్ష రూపాయిల చొప్పున ప్రతి నెలా తిరిగి చెల్లిస్తారు. కానీ ప్రతి నెల గోల్డ్ కాయిన్స్ తిరిగి ఇచ్చేయాల్సి ఉంటుంది.
రెండవ స్కీమ్ : ఓ కస్టమర్ రూ. 10 లక్షలు పెట్టుబడి పెడితే రూ. 5 లక్షల విలువైన గోల్డ్ ఆర్నమెంట్ ఇస్తారు. మరో 5 లక్షలకు సంబంధించి ల్యాండ్‌ను మార్టిగేజ్ చేస్తారు (ఛార్జీలు ఖాతాదారులే చెల్లించాలి). ఈ స్కీమ్‌లో 30 నెలల కాలంలో ప్రతి నెలా 50000 చొప్పున చెల్లిస్తామని మభ్యపెడతారు. (30 నెలల తర్వాత తిరిగి కంపెనీకి మార్టిగేజ్ చేయాల్సి ఉంటుంది). కాకపోతే కంపెనీ వెంచర్లలో మాత్రమే మార్టిగేజ్ చేస్తారు. ఇక్కడ విషయం ఏమిటంటే కంపెనీ కొత్తగా స్థాపించిన చోట భూమి లేదు. కొని కస్టమర్‌కు మార్టిగేజ్ చేయడానికి కొంచం సమయం అడగటం జరుగుతుంది. కావాలని జాప్యం చేయటం కంపెనీ మోసపూరిత చర్యలో ఓ భాగం.
మÖడవ స్కీమ్ : ఓ పెట్టుబడిదారుడు రూ. 10 లక్షల పెట్టుబడి పెడితే రూ. 7.5 లక్షల విలువైన బంగారు ఆభరణాలు వెంటనే ఇవ్వటం జరుగుతుంది. రూ. 2.5 లక్షలకు ల్యాండ్ అగ్రిమెంట్ ఇవ్వటం జరుగుతుంది. ఈ స్కీమ్‌లో 36 నెలల కాల వ్యవధిలో ప్రతి నెల రూ. 28000 చొప్పున చెల్లిస్తారు. ఇక్కడ అగ్రిమెంట్ అనేది ఉపయోగం ఉండదు. అగ్రిమెంట్‌లో వారికి అనుకూలమైన నిబంధనలు ఉంటాయి.
ఇక నాల్గవ స్కీమ్ : ఓ ఖాతాదారుడు రూ. 10 లక్షల విలువైన పెట్టుబడి పెడితే రూ. 2.5 లక్షల విలువైన బంగారం, మరో 2.5 లక్షలకు వెండి వెంటనే ఇవ్వటం జరుగుతుంది. మరో రూ. 5లక్షలకు 100 గజాల ల్యాండ్ రిజిస్టర్ చేయటం జరుగుతుంది. ఈ స్కీమ్‌లో 40 నెలల కాల వ్యవధిలో ప్రతి నెల రూ. 25000 చొప్పున చెల్లిస్తారు. ఎక్కువ నెలలు వ్యవధి తీసుకోవటం ద్వారా ఖాతాదారులకు కట్టే అమౌంట్ తగ్గుతుంది. అంటే కంపెనీ మీద ఒత్తిడి తగ్గుతుంది. కొన్ని నెలలు గడిస్తే కస్టమర్లలో నమ్మకం పెరుగుతుంది. తద్వారా ఎక్కువ పెట్టుబడులు ఆకర్షించి బోర్డ్ తిప్పేయటం సంస్థ ఆలోచనగా తెలుస్తోంది.
ఈ నాలుగు స్కీమ్‌లాంటి స్కామ్‌లను నిశితంగా పరిశీలిస్తే తక్కువ నెలల్లో ఎక్కువ రాబడి కావాలా ? లేక ఎక్కువ నెలల్లో తక్కువ రాబడి కావాలా ? అని ఖాతాదారులపై ప్రభావితం చేసుకుంటూ వారి పెట్టుబడిని సురక్షితం నుండి రక్షణ లేని స్కీములపైపు మళ్లించేలా చేయటం ఏజెంట్లకు అప్పగించినట్లు తెలుస్తోంది. ఉదాహరణకి ఏజెంట్ ఒక కస్టమర్‌ను తీసుకొచ్చి రూ. 10 లక్షలు పెట్టుబడి పెట్టిస్తే అందులో 5% రిఫరల్ ఇన్‌కం అందుతుంది. అదీ కూడా కస్టమర్ గోల్డ్ అడిగితే గోల్డ్‌పై తీసివేసి మిగిలిన అమౌంట్ మీద కమీషన్ అందుతుంది. అదే ఎలాంటి ష్యూరిటీ లేకుండా పెట్టుబడి పెట్టించే ఏజెంట్లకు పంట పండినట్టే. అదనంగా మరో 2 % కమీషన్ అందుతుంది. కస్టమర్ల అందుకే ఏజెంట్ల మాయాజాలంలో చిక్కుకుని మోసపోతున్న వాళ్ళే ఏక్కువ.
కంపెనీ రూ. 10/- వడ్డీ ఎలా ఇస్తుంది ?
ఇక్కడ కస్టమర్ చెల్లించిన రూ. 10 లక్షలకు సమానమైన ష్యూరిటీ ఇచ్చి నెలనెలా రూ. 10 రూపాయల వడ్డీ చెల్లించడానికి కంపెనీ యాజమాన్యం ఏమైనా అమాయకులా ? అందుకే 20 నెలల్లో రెండింతలు అయ్యే స్కీమ్‌లను ఏరగా చూపుతారు. అందుకే 2 ఆప్షన్లు అందిస్తున్నారు. 20 నెలల్లో ఎలాంటి ష్యూరిటీ లేకుండా ఒకటి, ష్యూరిటీ ఉన్న ఆప్షన్ మరోకటి. మొదటి ఆప్షన్‌లో ఎలాంటి హామీలు లేకుండా నెలకి లక్ష పొందటం, ఒకవేళ ష్యూరీటీ కావాలి అంటే భోగాపురంలోని మై ల్యాండ్ ఇన్‌ఫ్రా డెవలపర్స్ వారి సొంత వైంచర్‌లోని రూ. 100 గజాలు ప్లాట్ అదీకూడా 12 నెలల తర్వాత ఇస్తామని హామీ ఇవ్వటం. అంటే 12 నెలలు ఎలాంటి ష్యూరిటీ లేకుండా పెట్టుబడి కంపెనీ దగ్గరే ఉంటుంది. ఇదీ పక్కా ప్లాన్ ప్రకారం కస్టమర్లను మోసం చేసే ఉద్ధేశ్యమే. ఇక పోతే ఒక్క వైజాగ్, విజయనగరం వారికి మాత్రమే అదీ కూడా కొద్ది ప్లాట్స్ మాత్రమే అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. మిగిలిన చోట్ల ఒకటి లేదా రెండు ఎకరాలు కొని ష్యూరిటీ కోసం చూపించే ప్రయత్నం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక పోతే 1 లక్ష మొదలు కొని 5 లక్షల లోపు పెట్టుబడి పెట్టిన వారికి ఎలాంటి ష్యూరిటీ ఉండదు. కంపెనీ నడిచిన అన్ని రోజలు నెలనెలా డబ్బులు తీసుకోవటమే. కాకపోతే ఎప్పుడైనా కంపెనీ బోర్డ్ తిప్పేయవచ్చు.
ప్రైవేటు వ్యక్తులు/ కంపెనీలు డిపాజిట్ల సేకరణచట్ట విరుద్ధం : ఆర్బీఐ
ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేయడమే నిబంధనలకు విరుద్ధమని ఆర్బీఐ చెబుతోంది. ఒక వేళ ప్రజల నుండి డిపాజిట్లు సేకరించాలనుకుంటే ఎన్.బి.ఎస్.సి మరియు ఆర్.బి.ఐ. లైసెన్స్ తప్పని సరిగా తీసుకోవాలి. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ అయినా కూడా డిపాజిట్లు స్వీకరించడానికి వీలు లేదు. ఒక వేళ డిపాజిట్లు సేకరిస్తే, డిపాజిట్ చేసిన వారిని షేర్ హÃల్డర్లుగా చూపించాలి. నిబంధనలకు విరుద్ధంగా పెట్టుబడులు లేదా డిపాజిట్లు పేరుతో అనుమతులు లేకుండా సేకరించినట్లతే రూ. కోటి నుండి రూ. 25 కోట్లు పెనాల్టీ కట్టాలి. అలాగే పబ్లిక్ నుండి సేకరించిన మొత్తానికి రెండింతలు పెనాల్టీ కట్టాలి లేదా 5 ఏళ్ళ జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఆర్బీఐ చట్టం సెక్షన్ 45 (ఎస్)కి విరుద్ధంగా ప్రజల నుంచి అక్రమంగా డిపాజిట్లు వసూలు చేయటం నిబంధనలకు విరుద్దం. ఇది సెక్షన్ 58 బీ (5ఏ) ప్రకారం అత్యంత శిక్షార్హమైన నేరమని స్పష్టం చేసింది.
వైజాగ్‌తో పాటు మరో 12 చోట్లు దందా !
వైజాగ్ వేదికగా ఇప్పటి దాకా నెట్ వర్క్ మార్కెంటింగ్‌తో దందా సాగించిన మై లాండ్ ఇన్‌ఫ్రా నమ్మకం అనే ముసుగుతో రాష్ట్ర వ్యాప్తంగా మరో 12 చోట్లకు విస్తరించింది. వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం, ఓడిస్సా, కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరుతో పాటు మరికొన్ని చోట్లకు విస్తరించే పనిలో ఉంది. వీటిలో చాలా మందికి ప్రాంఛైజీని ఆఫర్ చేసింది. ఓనర్ చేతికి మట్టి అంటకుండా ఫ్రాంచైజీ ఓనర్ పైకి ఖాతాదారులకు ఊసి గొలిపేలా పక్కా ప్లాన్‌తో ఈ దందాని కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రాంఛైజీ ఓనర్లను నమ్మించే క్రమంలో 200 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉంది, అలాగే షేర్ మార్కెట్‌లోని బ్యాంక్ నిఫ్టీలో పెట్టుబడులు, బంగారం, వెండి బులియన్‌లో పెట్టుబడులు, రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు, యÖఎస్‌డీటీలో పెట్టుబడుల పెడుతున్నాం. వాటిల్లో వచ్చే లాభాలను కస్టమర్లకు పంచుతున్నాం అని సెలవిస్తున్నారు కంపెనీ నిర్వాహకులు వైశ్యరాజు శ్రీనివాసరాజు. సొంత డబ్బుతో చేసుకుంటే వ్యాపారం అవుతుంది, పెట్టుబడుల పేరుతో ఇతరుల డబ్బుతో వ్యాపారం చేస్తాం అంటే అది మోసంతో పాటు నేరం అవుతుంది అని తెలియదా శ్రీనివాసరాజు గారు.
రియల్ ఎస్టేట్ ముసుగులో నెట్‌వర్క్ మార్కెటింగ్ దందా!
ప్లాట్లు, అపార్ట్‌మెంట్లు అమ్మడం వరకు చట్టబద్ధమే. కానీ మై ల్యాండ్ ఇన్‌ఫ్రా సంస్థ ఏకంగా 10 లెవెల్స్ లో ‘లెవెల్ ఇన్‌కమ’ (Level Income based on ROI) మరియు ‘రెఫరల్ బోనస’ ల పేరిట చైన్ సిస్టమ్ నడుపుతోంది. 40% + 30% + 30% అంటూ కండిషన్లు పెట్టి ఏజెంట్లతో బలవంతంగా మరికొంత మంది చేత డిపాజిట్లు చేయిస్తున్నారు. భారతదేశంలో ‘ప్రైజ్ చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ (బ్యానింగ్) యాక్ట’ ప్రకారం ఇలా రియల్ ఎస్టేట్ ముసుగులో డిపాజిట్లు సేకరించడం, నెట్‌వర్క్ మార్కెటింగ్ నడపడం తీవ్రమైన నేరం. ఇకపోతే కంపెనీ చేసే అన్ని రకాల లావాదేవీలపై టీడీఎస్ పేరుతో 5%, అడ్మిన్ ఛార్జెస్ పేరుతో మరో 5% కస్టమర్ల దగ్గర నుండి కోత విధిస్తుంది.
అగ్రిమెంట్లు వేరు.. అసలు హంగులు వేరు !
సంస్థ జారీ చేస్తున్న చట్టపరమైన క్రయ అగ్రిమెంట్లను (ఉదాహరణకు 2026 మార్చిలో పార్వతీపురంలో జరిగిన అగ్రిమెంట్లు) పరిశీలిస్తే, అవి కేవలం సాధారణ ప్లాట్ల అమ్మకాలుగా కనిపిస్తాయి. కానీ సంస్థ వెబ్‌సైట్ మరియు అంతర్గత బ్రోచర్లు మాత్రం ఈ అగ్రిమెంట్లను చూపించి, నెలకు ఫిక్స్‌డ్ ఆదాయం ఇస్తామంటూ చట్టాన్ని పక్కదారి పట్టిస్తున్నాయి.
గుర్తింపే లేదు
మైలాండ్ ఇన్‌ఫ్రా డెవలపర్ అనే కంపెనీకి ప్రొప్రైటర్ అని లీగల్ డాక్యుమెంట్‌లో పేర్కొన్న వైశ్యరాజు శ్రీనివాసరాజు కానీ ప్రచారంలో కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, ఆయన భార్య వైశ్యరాజు శైలజ సీ.ఈ.ఓ. అని పేర్కొనటం గమనార్హం. వీరి కంపెనీ గురించి లోతుగా పరిశీలిస్తే కంపెనీ స్థాపించి 18 నెలలు దాటినా మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ ఆఫైర్స్‌లో కంపెనీకి సంబంధించిన వివరాలు నమోదు కాలేదు, అసలు కంపెనీనే లేదు. వీరికి వీరే డైరెక్టర్, సీ.ఈ.ఓ. అని వీరికి వీరే పిలిపించుకుంటున్నట్లు తెలుస్తోంది. కనీసం జీఎస్టీ నెంబరు కూడా కనిపించకపోవటం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. మరో ఆందోళనకరమైన విషయం ఏమిటంటే, సంస్థ వెబ్‌సైట్‌లో (ఎyశ్రీaఅdఱఅfతీa.cశీఎ) కస్టమర్లను నమ్మించడానికి పెద్ద పెద్ద అంకెలు చూపించారు. ఇప్పటి దాకా వారు చేసిన ప్రాజెక్టుల వివరాలు, చిరునామాలు ఏమి చూపించలేదు. అంతా గోప్యత పాటించటం అనుమానాలను మరింత రెట్టింపు చేస్తోంది. కాంటాక్ట్ వివరాల్లో కనీసం ఒక సరైన హెల్ప్‌లైన్ నెంబర్ కూడా లేకుండా కేవలం 9000000000 అనే డమ్మీ నంబర్లను వదిలేశారు. రేపు సంస్థ బోర్డు తిప్పేస్తే బాధితులు ఎవరిని సంప్రదించాలో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. కావున ఖాతాదారులారా పారాహుషార్.


