- నష్టాల్లో మైల్యాండ్ ఇన్‌ఫ్రా డెవలపర్స్...
- ఒడిస్సా, ఛత్తీస్‌ఘడ్‌లలో చెల్లింపులు నిలిపివేత !
రూ. 10 వడ్డీ పేరుతో రియల్ ఎస్టేట్ ముసుగులో ఖాతాదారుల నుండి పెట్టుబడుల రూపంలో డబ్బులు వసూలు చేస్తున్న సంస్థ ప్రతినిధి అయిన వైశ్యరాజు శ్రీనివాసరాజుని ఫోన్‌లో సంప్రదించగా సమాధానాలు లేక దాటవేత ధోరణి అవలంభించారు. మొదట ప్రశ్నగా మీరు చెప్పిన 200 ఎకరాలు ల్యాండ్ బ్యాంక్ ఎక్కడుంది ? నిజంగా ఉంటే దానికి సంబంధించిన వివరాలు చూపండి ! ఇక రెండో ప్రశ్నగా షేర్ మార్కెట్‌లోని బ్యాంక్ నిఫ్టీలో పెట్టుబడులు, బంగారం, వెండి బులియన్‌లో పెట్టుబడులు, రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు, USDTలో పెట్టుబడుల పెడుతున్నాం అన్నారు కదా...వాటి వివరాలు సాక్ష్యాలతో సహా చూపించండి. మÖడవ ప్రశ్న కంపెనీకి రిజిస్ట్రేషన్ లేదు (MD, CEO) అని నకిలీ హÃదాలు ఎందుకు పెట్టుకుంటున్నారు), జీఎస్టీ నెంబర్ లేదు ఉంటే చూపించగలరు. మీ బ్యాంక్ అకౌంట్ మరియు కంపెనీ బ్యాంక్ అకౌంట్ వివరాలు అందించి మీ నిజాయితీని నిరూపించుకోండి. అలాగే పబ్లిక్ నుండి డిపాజిట్లు / పెట్టుబడులు స్వీకరించడానికి ఆర్.బీ.ఐ. అనుమతి తప్పనిసరి. NBFC తరహాలో ఆర్.బీ.ఐ. ఇచ్చే అనుపత్రం చూపించగలరు అని అడగటం జరిగింది. మేము అడిగిన పేపర్స్ చూపితే మా తప్పును ఒప్పుకుని మా వైబ్‌సైట్స్‌లో పెట్టిన ఆర్టికల్స్‌ని డిలీట్ చేయగలము అని సవాల్ చేయటం జరిగింది. సవాల్‌ని స్వీకరించించిన సదరు మైల్యాండ్ ఇన్‌ఫ్రా డెవలపర్స్ సంస్థ ప్రతినిధి వెన్నుచూపి పారిపోవటం జరిగింది. అసలు అడగడానికి మీరు ఎవరు ? వాట్సప్/ మెయిల్ ద్వారా పంపలేము. డైరెక్ట్‌గా చూపుతాము అంటూ బుకాయించే ప్రయత్నం చేశారు. అనంతరం కనీసం స్పందించటం కూడా మానివేశారు సదరు ప్రతినిధి.
ఓడిస్సా, చత్తీస్‌ఘడ్‌లలో చేతులు ఎత్తేసిన మైల్యాండ్ ఇన్‌ఫ్రా !
మాకు అందిన కచ్చితమైన సమాచారం మేరకు ఇప్పటికే ఒడిస్సా, ఛత్తీస్‌ఘడ్ (రాయపూర్)లలో గత రెండు నెలల నుండి మైల్యాండ్ ఇన్‌ఫ్రా డెవలపర్స్ కంపెనీ పెట్టుబడులపై ఇస్తామని ప్రామిస్ చేసిన అమౌంట్‌ను నిలిపివేసింది. ఎందుకు నిలిపివేశారు అని అడిగితే మా ఖాతాదారులకు లాభాల్లో వాటా అందిస్తున్నాము. కొన్ని సందర్భాýలో లాభం రాకపోతే కొంతకాలం పాటు చెల్లింపులు ఆపివేస్తాం అని ప్రకటించారు. అంటే లాభాలు వస్తేనే సకాలంలో డబ్బులు చెల్లిస్తారా ? ఆ విషయం ఖాతాదారులకు చెప్పలేదు కదా. 20 నెలలు, 30 నెలలు, 40 నెలలు నిరంతరాయంగా చెల్లిస్తాం అని ప్రామిస్ చేశారు కదా అని అడిగితే గత కొన్ని రోజుల నుండి సంస్థకి నష్టం వస్తోంది, అందుకే చెల్లించలేక పోయాం అంటూ సదురు సంస్థ ప్రతినిధి శ్రీనివాసరాజు సెలవిచ్చారు. డబ్బులు ఇవ్వకపోతే ఖాతాదారులు కేసులు పెట్టుకోవచ్చు. వాటి పరిణామాల్ని ధైర్యంగా ఎదుర్కొంటాం అని ప్రకటించారు. అంటే మైల్యాండ్ ఇన్‌ఫ్రా డెవలపర్స్ ఇప్పటికే నష్టాల్లో నడుస్తుంది అని ప్రకటించేశారు. ఒడిస్సా, చత్తీస్‌ఘడ్‌లలో చెల్లించటం లేదు అని ఒప్పుకున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా చాలా చోట్ల బ్రాంచీలు ఓపెన్ చేశాం. మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. మీకు ఏమి కావాలో చెప్పండి, ప్రకటనలా ? ఇంకా ఏదైనా ఉంటే డైరెక్టుగా అడగండి అంటూ మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. దేనికి లొంగకపోవటంతో మౌనం దాల్చారు.
గుంటూరులో ఇప్పటికే కోటి వసూలు
గత నెల రోజుల వ్యవధిలో గుంటూరు బ్రాంచీలో రూ. కోటి రూపాయలు ప్రజల నుండి వసూలు చేశారు సంస్థ ప్రతినిధులు. వాటిలో సగం వరకు బంగారం, వెండి రూపంలో సగం వరకు చెల్లించినా, మిగిలిన 50% అంటే 50 లక్షల రూపాయలకు భూమికి సంబంధించి ఎలాంటి అగ్రిమెంటు కానీ, మార్టిగేజ్‌కానీ, సేల్ డీడ్ గానీ చేయలేదు. దీంతో కస్టమర్లలో తీవ్రమైన భయాందోళన నెలకొంది. ఇన్ని రోజులు గడుస్తున్నా కేవలం 2 ఎకరాలకు సంబంధించి మేడికొండూరు ప్రాంతంలో అడ్వాన్స్ మాత్రమే ఇచ్చి అగ్రిమెంట్ చేయించుకోవటం జరిగింది. అది రిజిస్ట్రేషన్ జరిగేది ఎప్పుడు ? దానిని ప్లాట్లుగా మలిచేది ఎప్పుడు ? ఖాతాదారులకు అందించేది ఎప్పుడు ? భూమి కొన్నాం అని కస్టమర్లను మభ్యపెట్టి కొన్ని రోజులు సాగదీసే ప్రయత్నం చేస్తున్నట్లు వారి మాటల్లో తెలిసింది. ఇప్పటికే నష్టాల్లో ఉంది అని ప్రకటించిన సంస్థ లాభాలు వచ్చేది ఎప్పుడు. ఖాతాదారులకు న్యాయం చేసేది ఎప్పుడు.


