రేవంత్‌రెడ్డి సంస్కరణలు అని భవిష్యత్తులో ప్రతి ఒక్కరూ చెప్పుకునే విధంగా...
హైడ్రా
తరహాలోనే విద్యావ్యవస్థను గాడిలో పెట్టేందుకు నిజాయితీగల అధికారులను
వెతికే పనిలో రేవంత్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో ఇవి
రేవంత్‌రెడ్డి సంస్కరణలు అని చెప్పుకునే విధంగా అన్ని వ్యవస్థలను సరిదిద్దే
లక్ష్యంతో ముందుకు కదులుతున్నట్లు తెలుస్తోంది. కీలకమైన శాఖల్లో
దశాబ్దాలకాలంలో తిష్టవేసిన నిర్లిప్తత, నిర్లక్ష్యాన్ని పారద్రోలి
వ్యవస్థలకు, అధికారులకు ఒక కొత్త గైడ్‌లైన్స్‌ని సెట్ చేసే పనిలో రేవంత్
రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. నిజాయితీ గల అధికారులకు ఆన్‌లిమిటెడ్
పవర్స్ ఇస్తే వ్యవస్థలో చైతన్యంతో పాటు మార్పు ఎలా ఉంటుందో రేవంత్‌రెడ్డి
చూపించబోతున్నారు. హైడ్రా మాదిరిగానే విద్యారంగాన్ని సంస్కరించేందుకు
సిద్ధం అవుతున్నారు. ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీ ఫీజలు దోపిడీ నుండి
మొదలుకొని అనుమతులు లేని స్కూల్స్, కాలేజీ యాజమాన్యాలపై కఠిన చర్యలకు
పూనుకోవాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. స్కూల్స్‌లో పనిచేసే అర్హత
కలిగిన టీచర్లకు కనీస వేతనంతో అమలు చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
అలాగే ప్రతి స్కూల్, కాలేజీలో అర్హులైన ఉపాధ్యాయులు మాత్రమే ఉండేలా
చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రతి స్కూల్‌ని ఆన్‌లైన్
చేయటంతోపాటు ఫీజలును ఆన్‌లైన్‌లోనే కట్టేలా సంస్కరణలు తీసుకోబోతున్నట్లు
తెలుస్తోంది. ఒక విద్యాసంస్థ పేరుతో ఒకే స్కూల్ / కాలేజ్ నడిచేలా
నిబంధనలు మార్చబోతున్నట్లు తెలుస్తుంది. సొసైటీలు/ ట్రస్ట్‌ల పేరుతో నడిచే
స్కూల్స్ మరియు కాలేజీలపై ప్రైవేటు లిమిటెడ్ కంపెనీల్లోకి నిధులు
మళ్ళించకుండా గట్టిచర్యలు తీసుకోబోతున్నారు. సొసైటీ / ట్రస్ట్‌ల్లోని
సభ్యులు వేరే ఇతర లాభదాయక కంపెనీల్లో భాగస్వాములు కాకుండా కఠిన నిబంధనలు
విధించనున్నట్లు విశ్వసనీయ సమాచారం.