ప్రమాదమని తెలిసినా ప్రమోషన్స్‌కు...అనారోగ్యాన్ని లెక్కచేయని సమంత.

0

ది ఫ్యామిలీ మ్యాన్‌ 2 వెబ్‌ సిరీస్‌తో పాన్‌ ఇండియా స్టార్‌గా మారిన సమంత రుత్‌ ప్రభు మరోసారి దేశవ్యాప్తంగా తన అభిమానులను, ప్రేక్షకులను ఆకట్టుకొనేందుకు యశోద సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. సరోగసి నేపథ్యంలో ఉత్కంఠభరిత కథనంతో సాగే ఈ సినిమాను శ్రీదేవీ మూవీ బ్యానర్‌లో నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్‌ నిర్మించారు. యశోద సినిమా నవంబర్‌ 11వ తేదీన విడుదలకు సిద్దమైంది. అయితే ఈ సినిమా రిలీజ్‌కు ముందు సమంత తీవ్ర అనారోగ్యానికి గురి కావడం తెలిసిందే. అయితే యశోద సినిమా కోసం తన ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా ప్రమోషన్స్‌కు రావడం సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. 

యశోద చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పాన్‌ ఇండియా మూవీగా రిలీజ్‌ అవుతోంది. అయితే ఈ సినిమా రిలీజ్‌కు సిద్దమవుతుండగా.. తనకు మయోసిటిస్‌ అనే వ్యాధితో బాధపడుతున్నట్టు సోషల్‌ మీడియా ద్వారా వెల్లడిరచారు. అయితే ఈ వ్యాధి నుంచి త్వరగా కోలుకోవాలని చిరంజీవితో సహా అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్‌ మీడియా ద్వారా ప్రార్థించారు. అయితే యశోద సినిమాను దేశవ్యాప్తంగా ప్రమోషన్‌ చేయడానికి సమంత ముందే ప్లాన్‌ చేసుకొన్నారు. ముంబై, బెంగళూరు, కొచ్చిన్‌, చెన్నై, హైదరాబాద్‌ నగరాల్లో ప్రచారానికి తన డేట్స్‌ ఫిక్స్‌ చేసుకొన్నారు. అయితే అనూహ్యంగా అనారోగ్యానికి గురి కావడంతో ప్రమోషన్స్‌కు దూరంగా ఉంటూ వచ్చారు.

అయితే సమంత ప్రమోషన్స్‌కు దూరం కావడంతో.. వరలక్ష్మీ శరత్‌ కుమార్‌, నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్‌ ప్రమోషన్‌లో భాగమయ్యారు. అయితే యశోదకు వస్తున్న స్పందన చూసి.. తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ప్రమోషన్‌ షూట్‌కు సమంత హాజరు కావాలని నిర్ణయించుకొన్నారు. అయితే ఎక్కువ మందిలో ఉంటే ఆరోగ్యానికి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందనే డాక్టర్ల సలహా, సూచనలను పక్కన పెట్టి ప్రమోషన్‌కు హాజరవుతున్నారు.

యశోద సినిమా ప్రమోషన్‌ కోసం సిద్దమవుతూ.. సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టారు. నా స్నేహితుడు, ఫ్యామిలీ మ్యాన్‌ డైరెక్టర్‌ రాజ్‌ అండ్‌ డీకేలో రాజ్‌ చెప్పిన విషయాలను నేను ఆచరిస్తున్నాను. నీకు ప్రతికూలంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నా.. నిన్ను వెనుకకు లాగాలని ఎంత ప్రయత్నించినా.. వాటన్నిటిని ఎదురించాలని చెప్పారు. ఆయన చెప్పిన మాటలను ఈ రోజు అరువుగా తెచ్చుకొని ఆచరిస్తున్నాను అని సమంత చెప్పారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !