శీతాకాలంలో పెరుగు తింటున్నారా ? అయితే ఇది మీ కోసమే !

0

కథనాన్ని వినండి

చలికాలం ప్రారంభం కాగానే జలుబు, దగ్గు వంటి సీజనల్‌ వ్యాధుల ముప్పు పెరుగుతుంది. దీంతో, ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించటం ఏంతైనా అవసరం. అయితే, చలికాలంలో పెరుగు తినవచ్చా..? తింటే ఏ సమయంలో తినాలి..?అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. 

ప్రతిరోజు మన ఆహారంలో పప్పు, ఆకుకూరలు ఉండేటట్లు చూసుకోవాలి. అయితే భోజన సమయంలో చివరిగా పెరుగుతో తినే అలవాటు ఎక్కువ మందికి ఉంటుంది. ఒకవేళ పెరుగుతో తినకుంటే సంతృప్తికర భోజనం చేసిన ఫీలింగ్‌ ఉండదు. నిజానికి మన శరీరానికి పెరుగు చాలా అవసరం. ఇందులో ఉన్న అనేక రకాల పోషకాలు మన ఆరోగ్యానికి ఎంతగానో తోడ్పడతాయి.

పెరుగు ద్వారా జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. విటమిన్‌ బి6, బి12, కాల్షియం పెరుగు ద్వారా అందుతాయి. అలాగే గ్యాస్‌ సంబంధిత సమస్యలకు పెరుగు చెక్‌ పెడుతుంది. శరీరంలో PH స్థాయిలను పెరుగు కంట్రోల్‌ చేస్తుంది. దంతాలు, గోర్లు, ఎముకల ఆరోగ్యానికి పెరుగు ఉపయోగకరంగా ఉంటుంది. వేసవిలో పెరుగు తినడం చాలా మంచిది. అయితే, చలికాలంలో పెరుగు తినాలా వద్దా? దీని గురించి ప్రతి ఒక్కరికి భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఆయుర్వేదం ప్రకారం చలికాలంలో పెరుగు తినడం మంచిది కాదు. అయితే ఏడాదిలో 12 నెలలు పెరుగు తినవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఆయుర్వేదం ప్రకారం, చలికాలంలో పెరుగుకు దూరంగా ఉండాలి. శీతాకాలంలో పెరుగు తింటే కఫము వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే చలికాలంలో పెరుగు తినకపోవడం మంచిదని ఆయుద్వేరం చెబుతుంది. చలికాలం కావడంతో జలుబు, దగ్గు వచ్చే అవకాశం ఎక్కువ. కాబట్టి పెరుగుకు దూరంగా ఉండాలని ఆయుర్వేద నిపుణులు తెలిపారు. అయితే, డాక్టర్ల వాదన మరోలా ఉంది. వారి ప్రకారం పుల్లటి పెరుగు రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. పెరుగులో ఉండే విటమిన్‌ బి12, కాల్షియం, ఫాస్పరస్‌ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.

పెరుగు మన శరీరంలో గట్‌ బ్యాక్టీరియాను పెంచడానికి సహాయపడుతుంది. ఇది మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అందువల్ల, చలికాలంలో పెరుగును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జలుబు మరియు దగ్గు నయం అవుతుందని డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు. పోషకాహార నిపుణులు కూడా వైద్యులతో ఏకీభవిస్తారు. చలికాలంలో ఉష్ణోగ్రత మార్పులు, పెరుగులో ఉండే విటమిన్‌ సి ఉష్ణోగ్రతను అదుపులో ఉంచుతుంది. కానీ పెరుగును ఎప్పుడూ రిఫ్రిజిరేటర్‌లో ఉంచకూడదు. అలాగే, చల్లటి పెరుగు తినకూడదు. అయితే పెరుగు తినాలనుకునే వారు మాత్రం సాయంత్రం 5 గంటలోపే తినటం మంచిది. రాత్రి పూట పెరుగు తినడం వల్ల ఊపిరితిత్తుల్లో కఫం పేరుకుపోతుంది. దీని వల్ల జలుబు వస్తుంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !