AP Govt : పెన్షన్ల పంపిణీకి మోక్షం ! మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం !

0

ఏపీలో పింఛన్ల పంపిణీపై ఎన్నికల సంఘం విధి విధానాలు ఖరారు చేసింది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) సీఈఓ ఆదేశాలను సవరిస్తూ ఈసీ మార్గదర్శకాలు జారీ చేసింది. గత రెండు రోజులుగా పెన్షన్ల పంపిణీ విషయంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది. వలంటీర్ల ద్వారా పింఛన్లను పంపిణీ చేయొద్దని కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశించింది. అలాగే ఎన్నికల విధుల్లో కూడా వలంటీర్లు పాల్గొనవద్దని ఈసీ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పెన్షన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. దీనిలో భాగంగానే పెన్షన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వం మంగళవారం నాడు పలు మార్గదర్శకాలను జారీ చేసింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను విడుదల చేసింది. రేపటి నుంచి పెన్షన్లు పంపిణీ చేయాలని ఆదేశించింది. దివ్యాంగులు, వృద్ధులు, వికలాంగులు, రోగులకు ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యంతో బాధపడేవారు, అస్వస్థతకు గురైనవారు, వితంతువులకు ఇంటివద్దే పింఛన్‌ ఇవ్వాలని నిర్ణయించింది. గ్రామ సచివాలయాలకు చాలా దూరంగా ఉన్న గిరిజన ప్రాంతాల వారికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లను ఆదేశించింది. మిగతా వారికి గ్రామ, వార్డు సచివాలయాల్లో పంపిణీ చేసే విధంగా ఆదేశాలు జారీ చేసింది. మూడు రోజుల పాటు గ్రామ, వార్డు, సచివాలయాల్లో పంపిణీ చేయాలని సూచించింది. ఆ తర్వాత నేరుగా ఇళ్లకు వెళ్లి పంపిణీ చేయాలని ఆదేశించింది. ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.27 లక్షల సిబ్బంది ఉన్నట్టు గుర్తించిన ప్రభుత్వం.. సరిపడా ప్రభుత్వ ఉద్యోగులు లేకపోవటంతో  రెండు కేటగిరీలుగా పింఛన్లు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకూ సచివాలయాలు పనిచేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ నెల 3 తేదీ మధ్యాహ్నం నుంచి ప్రారంభించి ఏప్రిల్‌ 6 నాటికి పంపిణీ ముగించాలని ఆదేశించింది. సచివాలయాల వెల్ఫేర్‌ సెక్రటరీలు, పంచాయతీ అధికారులకు పెన్షన్లు డ్రా చేసేందుకు, పంపిణీకి ఆథరైజేషన్‌ లెటర్లు ఇవ్వాలని మున్సిపల్‌ కమిషనర్లు, మండల అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శశిభూషణ్‌ కుమార్‌ విడుదల చేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !