సిమ్స్ (SIMS GROUP OF INSTUTIONS) విద్యాసంస్థల డైరెక్టర్ భరత్ రెడ్డి పార్టీ వైసీపీకి బైబై చెప్పారు. గత కొన్ని రోజులుగా వైసీపీ ప్రభుత్వానికి దూరంగా ఉంటూ వస్తున్న భరత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. జగన్ వైఖరి నచ్చని నాయకులు ఒక్కొక్కరిగా బయటకు వచ్చేస్తున్నారు. అందులో భాగంగానే భరత్‌రెడ్డి నారా లోకేష్‌ని కలిశారు. పార్టీలో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి భరత్‌రెడ్డి అత్యంత సన్నిహితుడు కావటం గమనార్హం. రాబోయే రోజుల్లో మరింత మంది పార్టీ మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Bharath Reddy : తెలుగుదేశంలో చేరుతున్న సిమ్స్ అధినేత భరత్‌రెడ్డి
జనవరి 25, 20240 minute read
0
Tags