Sharmila : పులివెందుల సీటు కోసం షర్మిలతో సునీతమ్మ భేటీ ?

0


ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు రోజురోజుకీ హాట్‌ హాట్‌గా మారుతున్నాయి. ముఖ్యంగా వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి కుమార్తె వైఎస్‌ షర్మిల కాంగ్రెస్‌ పగ్గాలు చేపట్టిన దగ్గర నుంచి రాజకీయాలు మరింత వేగం పుంజుకున్నాయి. మొన్నటి వరకు వైఎస్‌ కుటుంబానికి దూరంగా ఉన్న వివేకానంద రెడ్డి కుమార్తె సునీత రెడ్డి ఈరోజు కడపలో ఇడుపులపాయలోని గెస్ట్‌ హౌస్‌ లో వైఎస్‌ షర్మిలను కలవడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌ గా మారింది..కడప జిల్లాలో వైఎస్‌ కుటుంబానికి రాజకీయంగా ఒక చరిష్మా ఉంది. అందులోనూ ఆయన బిడ్డలు జగన్‌, షర్మిల అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని రాజకీయంగా నిలదొక్కుకున్నారు. అయితే గత కొంతకాలంగా షర్మిల, సీఎం జగన్‌ మధ్య కొంత విభేదాలు వచ్చాయి. దీంతో తెలంగాణలో సొంత పార్టీ పెట్టిన షర్మిల ఈ మధ్యనే తన పార్టీని కాంగ్రెస్‌ పార్టీలో విలీనం చేశారు. అనంతరం ఏపీ కాంగ్రెస్‌ పగ్గాలు చేపట్టిన షర్మిల దూకుడుగా వ్యవహరిస్తూ కనుమరుగయిపోయింది అనుకున్న కాంగ్రెస్‌ పార్టీకి కొంత ఊపిరిని పోశారు. ఈ క్రమంలో తన సొంత జిల్లా కడప జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసిన షర్మిల రాజకీయంగా పెద్ద షాక్‌ ఇచ్చారు. వైఎస్‌ కుటుంబానికి దూరంగా ఉన్న తన సొంత బాబాయి వివేకానంద రెడ్డి కూతురిని కలవటం ఇప్పుడు హాట్‌ టాపిక్‌ గా మారింది. గెస్ట్‌ హౌస్‌లో తన సోదరి షర్మిల భేటి అయ్యారు. వారువురూ ఏం మాట్లాడుకున్నారు..? అనేది ఇప్పుడు అంతా చర్చనీయాంశంగా మారింది.హైదరాబాద్‌ నుంచి నేరుగా ఇడుపులపాయకు వచ్చిన సునీత.. షర్మిలతో భేటీ అయ్యారు. ముందుగా.. వైఎస్‌ఆర్‌ ఘాట్‌ దగ్గర వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డికి నివాళులర్పించారు. అనంతరం ఇడుపులపాయ నుంచి షర్మిలతో సునీత రెడ్డికలిసి కడపకు రానున్నారు. ఈ క్రమంలో.. షర్మిల, సునీతలు కలిసి ప్రచారం చేస్తారా..? లేదా సునీత కాంగ్రెస్‌ లో చేరుతారా..? అసలు ఏం జరుగుతుంది అనే దానిపై సర్వత్రా చర్చ నడుస్తోంది. ఏదేమైనా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైఎస్‌ కుటుంబానికి దూరంగా ఉన్న వివేకానంద రెడ్డి కుమార్తె సునీత ఇప్పుడు షర్మిల ని కలవడం రసవత్తర రాజకీయానికి తెరలేపినట్లయింది.

ధ్వజమెత్తిన షర్మిల !

నేను రాజశేఖరరెడ్డి బిడ్డను. పులి కడుపున పులే పుడుతుంది. రాజశేఖరరెడ్డి రక్తం నాలో ప్రవహిస్తోంది నా పేరు వైఎస్‌ షర్మిలా రెడ్డి. నా పేరు ఇదే, నా ఉనికి ఇదే. ఎవరు కాదన్నా, అవునన్నా.. ఎవరు గీపెట్టినా నేను వైఎస్‌ షర్మిల రెడ్డి. ఆంధ్రరాష్ట్ర ప్రజలకు మేలు చేయడానికే ఇక్కడికి వచ్చా. నా గుండెలో నిజాయితీ ఉంది. ఆంధ్రరాష్ట్ర ప్రజలకు వాళ్ల హక్కులు కల్పించడం కోసం రాజశేఖరరెడ్డి బిడ్డ ఇవాళ తన పుట్టింటిలో అడుగు పెట్టింది. ప్రత్యేక హోదా, పోలవరం వచ్చే వరకు రాజశేఖరరెడ్డి బిడ్డ ఇక్కడి నుంచి కదలదు. మన బిడ్డలను ఉద్యోగాలకు రావాలి.. అంతవరకు రాజశేఖరరెడ్డి బిడ్డ తన పుట్టింటి నుంచి కదలదు. మీ ఇష్టమొచ్చింది చేసుకోండి. ఎంత చేసుకుంటారో చేసుకోండి. ఏం పీక్కుంటారో పీక్కోండి. ఇక్కడ భయపడే వాళ్లు ఎవ్వరూ లేరు. ఇక్కడున్నది రాజశేఖరరెడ్డి బిడ్డ. ఖబద్దార్‌..’’ అంటూ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల వ్యాఖ్యానించారు. కడప జిల్లా కాంగ్రెస్‌ కార్యకర్తలతో సోమవారం వైఎస్‌ షర్మిల సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. టీడీపీ, వైసీపీ, బీజేపీతో పాటు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలకు ఓటు వేస్తే కేసిన ఆ ఓటు బీజేపీకే చెందుతుందని అన్నారు. టీడీపీ, వైసీపీకి మళ్లీ ఓటు వేస్తే భవిష్యత్తు శూన్యమవుతుందన్నారు. 

వ్యక్తిగతంగా దాడి చేస్తున్నారు !

ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అది కాంగ్రెస్‌ పార్టీతోనే సాధ్యమవుతుందన్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత జగనన్న పూర్తిగా మారిపోయారని ఆరోపించారు. జగనన్నతో మనకు ద్వేషం లేదు. కడప జిల్లా నా పుట్టినిల్లు. జమ్మలమడుగులోని హాస్పిటల్లో జగనన్న ఎక్కడ పుట్టారో నేను కూడా అదే హాస్పిటల్లోనే పుట్టాను. జగన్‌ అన్నది నాది ఒకే రక్తం. అన్న సీఎం అయ్యాక మారిపోయారు. ఈ జగనన్న నాకు తెలియదు. వైసీపీ కోసం నేను నిస్వార్థంగా 3200 కిలోమీటర్ల పాదయాత్ర చేశాను. వైసీపీకి ఉనికే లేకుండా పోతుందేమో అని భయపడుతుండగా నేను అండగా నిలిచాను. తెలంగాణలో ఓదార్పు యాత్ర చేయమంటే చేశాను. ఏ పదవిని ఆకాంక్షించకుండా నిస్వార్థంగా నేను ఇవన్నీ చేశాను. ఈరోజు వైసీపీ పార్టీకి వాళ్లు.. ఆడబిడ్డ అని కూడా చూడకుండా మూకుమ్మడిగా నాపై దాడి చేస్తున్నారు. సిగ్గు సిగ్గు లేకుండా నాపై వ్యక్తిగతంగా దాడి చేస్తున్నారు. పదవీ కాంక్షతోనే నా భర్త అనిల్‌ సోనియా గాంధీ వద్దకు వెళ్లారని దుష్ప్రచారం చేస్తున్నారు. మాకు పదవీ కాంక్ష ఉంటే మా నాన్న సీఎంగా ఉన్నప్పుడు ఒక్క పదవైనా తీసుకోకపోదుమా?’’ అని షర్మిల అన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !