MODI POSTERS IN HYD : ఇంకెన్నాళ్ళు ట్రాఫిక్‌ తిప్పలు...మోదీకి మొర పెట్టుకుంటూ పిల్లర్లకు పోస్టర్లు !

0
హైదరాబాద్‌ నగరంలో మరోసారి పోస్టర్ల (POSTER POLITICS) రాజకీయం వెలుగుచూసింది.  ఇటీవల కాలంలో రెండు ప్రధాన పార్టీలు విమర్శల కోసం POSTER WAR కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఉప్పల్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పోస్టర్లు వెలిశాయి. UPPAL - NARAPALLI ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణంలో జాప్యంపై మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు అంటించారు గుర్తు తెలియని వ్యక్తులు. ‘మోదీ గారు..  ఈ ఫ్లై ఓవర్‌  ఇంకా ఎన్ని సంవత్సరాలు కడతారు ? అంటూ వెలిసిన పోస్టర్లు దారి పొడవునా కనిపిస్తున్నాయి. ఐదు సంవత్సరాలైనా ఉప్పల్‌ నారపల్లి FLY OVER 40 శాతం కూడా పూర్తికాలేదని పోస్టర్‌పై పేర్కొన్నారు. ఉప్పల్‌ నుండి ఘట్‌కేసర్‌ వెళ్ళే వరంగల్‌ HIGHWAYపై  కేంద్ర ప్రభుత్వం నిధులతో చేపట్టిన ఎలివేటెడ్‌ కారిడార్‌ ఫ్లై ఓవర్‌ పనులు నత్తనడకన సాగుతున్నాయి.ఆ మార్గంలో నిత్యం TRAFIC JAM సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నారు. పనులు కొనసాగుతున్న నేపథ్యంతో సాయంత్రం వేళ్ల ఉప్పల్‌, మేడిపల్లి మధ్య ప్రయాణం గంటకు పైనే పడుతోంది. హైదరాబాద్‌ నుంచి వరంగల్‌ వైపు వెళ్లేవారు ఉప్పల్‌ రింగ్‌రోడ్డు, బోడుప్పల్‌, మేడిపల్లి, చెంగిచర్ల చౌరస్తాల వద్ద తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారాంతాల్లో అయితే పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటోంది. దీంతో వాహనదారులు  అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు పోస్టర్‌ రాజకీయం (POSTER POLITICS) తెర మీదకు వచ్చింది. 

UPPAL - MEDIPALLI మధ్య ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించేందుకు BHARAT MALA పథకం కింద రూ.626.80 కోట్ల వ్యయంతో  6.2 కిలోమీటర్ల దూరంతో FLY OVER నిర్మాణం చేపట్టారు. ఉప్పల్‌ జంక్షన్‌ నుంచి మేడిపల్లి సెంట్రల్‌ పవర్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ దాకా ఈ ఫ్లైఓవర్‌ వేయాలని భావించింది కేంద్రం.  2018 మేలో  కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ఈ ఫ్లైఓవర్‌కు శంకుస్థాపన చేశారు. జూలైలో పనులు ప్రారంభం కాగా.. 2020 జూన్‌ వరకు నిర్మాణం పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ, పనులు నెమ్మదిగా (SLOW WORKS) సాగుతున్నాయి. ట్రాఫిక్‌ రద్దీని తగ్గించేందుకు చేపట్టిన.. ఈ 45 మీటర్ల ఆరులేన్ల కారిడార్‌ పనులు నెమ్మదిగా సాగుతోంది. మరోవైపు ఈ నిర్మాణ పనులతో ఉన్న రోడ్డు పూర్తిగా (ROAD DAMAGE) దెబ్బతిన్నది. కారిడార్‌ పనులు పూర్తయితేనే రోడ్డు పనులు పూర్తిచేస్తామని అధికారులు అంటున్నారు.



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !