Online Rummy : ఆన్‌లైన్‌ రమ్మీ ఆడితే మీ డబ్బు పోయినట్లే !

0

ఆన్‌లైన్‌లో రమ్మీ (Online Rummy), పోకర్‌ (Online Poker) ఆడుతున్నారా ! అయితే మీరు మాయా ప్రపంచంలో పూర్తిగా ఇరుక్కుపోయినట్లే. ఎందుకంటే రూల్స్‌ అన్నీ వాళ్ళకు అనుకూలంగా సాప్ట్‌వేర్‌ కోడిరగ్‌ (Software Codeing) చేయబడతాయి. అసలు వారు వాడే సాప్ట్‌వేర్‌కు ఎలాంటి ప్రామాణికత లేదు. ఒక్కసారి ఈ ఊబిలోకి దిగారా చిన్నచిన్నగా ప్రాణాలను (Life Troble) బలితీసుకుంటుంది. మొదట సరదాగా మెదలుపెట్టిస్తారు, డబ్బును 5 రెట్లు, 10 రెట్లు అదిస్తున్నట్లు బోనస్‌ (Bonus) గా ఇస్తున్నట్లు ప్రకటనలతో ఆకర్షిస్తారు. తరువాత అలవాటుగా మారుస్తారు. ఎక్కువసేపు ఆన్‌లైన్‌లో ( Always Online) ఉండేలా చేసి ఆటను వ్యసనంగా మారుస్తారు. ఆ తరువాత ఎలాగైనా డబ్బు తీసుకొచ్చి పెట్టేలా బాసినలా మార్చుకుంటారు. మధ్యలో ఎక్కడైతే కనిపెట్టి బయట పడితే ఒకే లేదంటే లక్షలు, కోట్లలో మీ డబ్బులు లాగేస్తూనే ఉంటారు. ఆట అంటే ఎవరో ఒకరు గెలుస్తారు. కానీ ఈ రమ్మీ గేమ్‌లో (Online Rummy) అన్నీ ప్లాట్‌ ఫ్లామ్స్‌లో 100 మందికి 100 మంది డబ్బులు పొగొట్టుకున్న వారే ఉంటారు. ఈ మోసపూరిత చర్యలతో ఎలా దోచుకుంటున్నారో మరింత లోతుగా తెలుసుకుందాం. 

బోనస్‌లతో ఆకట్టుఉంటారు. 

A23, JUNGLEE RUMMY, RUMMY CIRCLE, RUMMY CULTURE, ADDA52, KHELPLAY RUMMY ...వివిధ రకాలైన యాప్‌లు మందుగా తమ సభ్యులుగా చేర్చుకోవడానికి బోనస్‌లతో వల విసురుతాయి. రూ. 1000 /` డిపాజిట్‌ చేస్తే రూ.5000/` వరకు బోనస్‌ అంటే యువత ఇట్టే ఆకర్షణకు గురవుతుంది. తక్కువ సమయంలోనే ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆలోచన ఉన్న యువతకు డబ్బు ఊరికే ఎవరూ ఇవ్వరు అనే తెలుసుకోలేక పోవటం దురదృష్టకరం. ఆ బోనస్‌ని ఒకేసారి ( NOT ONE TIME) ఏ యాప్‌ ఇవ్వదు. గేమ్‌లో ఎక్కువ సేపు ఉండేలా చిన్నచిన్నగా 15000/` అందులో ఖర్చు పెడితే బోనస్‌ 5000/` విడుదల చేసేలా ప్లానింగ్‌ ఉంటుంది. అంటే బోనస్‌ 5000 లతో కలిపి అప్పటికే 20000 మీరు పోగొట్టుకుని ఉంటారు. డబ్బులు పోయిన బాధలో ఉన్న అప్పటికే ఆట అలవాటుగా మారి ఉంటుంది. పోయిన సొమ్ము సంపాదించుకోవాలి అన్న కసితో ఎక్కడైనా తీసుకొచ్చి మళ్ళీ ఆటలో పెట్టడం మళ్ళీ పోగొట్టుకోవటం జరుగుతూ ఉంటుంది. ఇక ఇదీ ఎక్కడికీ పోతుంది అంటే డబ్బు చేతికి దొరకనంతగా లోతుకు తీసుకెళుతుంది. అప్పు కూడా పుట్టని సందర్భం ఎదురవుతుంది. అప్పుడు జరిగే మానసిక సంఘర్షణతో జీవితంపై విరక్తి చెంది చాలా మంది ప్రాణాలను తీసుకుంటున్నారు. 

తెలుగు రాష్ట్రాల్లో బ్యాన్‌ ! కానీ ఫేక్‌ జీపీయస్‌ ద్వారా !

తెలుగు రాష్ట్రాల్లో ఆన్లైన్‌ పేకాటను నిషేధించినా (RUMMY BAN IN TELUGU STATES) తీరు మారడం లేదు. జూదం (ఆన్‌లైన్‌ రమ్మీ, పోకర్‌) లేదా పందెం (స్పోర్ట్స్‌ బెట్టింగ్స్‌) వేస్తు పోలీసులకు పట్టుబడుతున్నామని గ్రహించి ఫేక్‌ జీపీఎస్‌కు ( FAKE GPS) తెరలేపారు. ఇతర రాష్ట్రంలో ఉన్నట్టుగా జీపీఎస్‌ (GPS) క్రియేట్‌ చేసి రమ్మీ గేమ్‌ను డౌన్లోడ్‌ (DOWNLOAD) చేసుకుంటున్నారు. దీంతో ఏదో ఒక రాష్ట్రంలో ఉన్నట్టుగా చూపిస్తుంది . గుట్టుచప్పుడు కాకుండా ఆన్లైన్లో బెట్టింగ్‌ పెట్టి క్యాష్‌ గేమ్‌ ఆడుతున్నారు . ఇలా ఆడినవారు డబ్బు ఆర్జించిన సంగతి ఏమో కానీ పొగొట్టుకున్న ఎక్కువగా ఉన్నారని తెలిసింది. ఒక్కరంటే ఒక్కరూ ఈ ఆన్‌లైన్‌ రమ్మీ , ఆన్‌లైన్‌ గేమ్స్‌ ద్వారా ఒక్కరంటే ఒక్కరూ సంపాదించ వారు లేకపోవటం గమనార్హం. 

ఆన్‌లైన్‌ రమ్మీ సంస్థలో పనిచేసే ఒక ఉద్యోగి నుండి సేకరించిన సమాచారం ప్రకారం ఆయన మాటల్లోనే : 

1) ఆన్‌లైన్‌ రమ్మీ గేమ్‌ అనేది పూర్తిగా మాయా ప్రపంచంగా అభివర్ణించవచ్చు. ఉదాహరణకు : డైరెక్ట్‌గా రమ్మీ గేమ్‌ ఆడేవారికి ఆటలో ఎన్ని కార్డ్‌ ఉన్నాయో మనమే లెక్కపెట్టవచ్చు. కార్ట్స్‌ ఎలా పంచుతున్నామో గమనించవచ్చు,  ఎవరైనా ఏదైనా మోసం చేసే పరిస్థితి ఉన్నట్లుయితే ఇట్టే గుర్తు పట్టవచ్చు. కానీ ఈ ఆన్‌లైన్‌ గేమ్‌లో ఇవేవి గుర్తించడానికి వీలు ఉండదు. 

2) ఒక టేబుల్‌ మీద ఆరుగురు సభ్యులు కూర్చుంటారు. ఆ ఆరుగురు సభ్యుల్లో ఒకరిద్దరూ ఆ కంపెనీకి సంబంధించిన వర్చువల్‌ మెంబర్‌ని చేర్చే అవకాశం ఉంటుంది. ఆ సభ్యుడే ఎక్కువ సార్లు గెలుచుకునేలా సాప్ట్‌వేర్‌ రూపొందించబడి ఉంటుంది. 

3) కొత్త సభ్యులను ఆకర్షించడానికి బోనస్‌ అనేది ఒక ఆయుధం. 5 రెట్లు, 10 రెట్లు బోనస్‌తో ఆకర్షించటంతోనే ఆట మొదలవుతుంది.

4) ఆన్‌లైన్‌ రమ్మీ అనేది పూర్తిగా సాప్ట్‌వేర్‌ ఆధారంగా రూపొందించబడుతుంది. అంటే  ఆ సంస్థ తనకు నచ్చినట్టు కోడిరగ్‌ చేసుకునే వెలుసుబాటు ఉంటుంది. కొత్త సభ్యులను ఎక్కువ సేపు ఆన్‌లైన్‌లో ఉంచేందుకు మొదట్లో ఎక్కువ ఆటలు గెలిచేలా సాప్ట్‌వేర్‌ రూపొందించబడుతుంది. ఆ తర్వాత 10 గేమ్స్‌ ఒకటి, 15 గేమ్స్‌కి ఒకటి గెలుచుకునేలా పద్దతి ప్రకారం డబ్బులు దొచుకునేలా ప్లాన్‌ చేయబడుతుంది. 

5) ఆన్‌లైన్‌లో ఎక్కువ సేపు గేమ్‌ ఆడే సభ్యుడి వివరాలను ట్రాక్‌ చేయటం, ఎవరైనా ఆన్‌లైన్‌లో తక్కువగా కనిపిస్తున్నట్లయితే వారికి ఇ`మెయిల్‌, ఎస్‌యమ్‌ఎస్‌లతో బోనస్‌లు ఆఫర్‌ చేయటం జరుగుతుంది. 

6) అన్నింటి కన్నా ముఖ్యమైనది ఏమిటంటే ప్రతి ఆటకు గెలిచిన వారి నుండి 5%, కొన్ని గేమ్స్‌కు 10% కమీషన్‌ క్రింద తీసుకుంటాయి రమ్మీ ప్లాట్‌ ఫామ్స్‌. ఆరుగురు సభ్యులున్న ఒక టేబుల్‌లో 40 గేమ్స్‌ ఆడారు అనుకోండి వారిలో 400% నలుగురు సభ్యుల అసలు సొమ్ము అంతా వారి కమీషన్‌ క్రిందే పోతుంది. వీటిలో ఎవరికీ లాభం ఉండదు, రాదు. మొత్తం కమీషన్‌ రూపంలో యాప్‌కే వెళ్ళిపోతుంది. ఇంకెక్కడా గెలిచేది. లాభాలు ఆర్జించేది. ఇది ఒక పక్కా స్కిప్ట్‌తో రూపొందించిన మాయా ప్రపంచం. పొగొట్టుకోవటమే కానీ సంపాదించటం ఉందదు అనేది ఆర్థం చేసుకోవాలి.

ఇప్పటికైనా యువత మేలుకోవాలి. ఆన్‌లైన్‌ రమ్మీ, ఆన్‌లైన్‌ గేమ్స్‌, స్పోర్ట్స్‌ బెట్టింగ్‌ అనే ఉచ్చు గురించి తెలుసుకుని తెలివిగా బయటపడాలి. మీకు తెలిసిన ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేసి ఒక నిండు ప్రాణాన్ని కాపాడండి.  ఆడే వాళ్ళపై నియంత్రించటమే ఒకటే పద్ధతి కాదు, ఆన్‌లైన్‌ రమ్మీ ఫ్లాట్‌ ఫామ్స్‌ను నిషేదించాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వంపై ఉంది. డా॥బి.ఆర్‌. అంబేద్కర్‌ గారు రచించి రాజ్యాంగం ప్రకారం భారతదేశ భూభాగంపై జూదం ఆడటం నేరం అని పొందుపరచినా...భూభాగంపై ఆటడం లేదు, నీటి మీద ఆడుతున్నాం, గాలిలో ఆడుతున్నాం అని తప్పించుకుని తిరుగుతున్న వారి ఆట కట్టించాలి. భూభాగం అంటే కేవలం నేల కాదు, భారతదేశ భూభాగంలో నివసించే ప్రజలు అని అర్థం. రాజ్యాంగం ప్రతి మనిషికి హక్కులు కల్పించిన్నట్లే, వారందరికీ కొన్ని షరతులు, నియమనిబంధనలు పెట్టింది. వాటిని తప్పనిసరిగా పాటించాల్సిందే. 


Tags : how to, tutorial, instructions, rules, how to play rummy, how to play rummy, playing cards, card game, rummy rules, rummy instructions, rummy game, rummy tutorial,card games,cards,games,beginner,expert,rummy card game,how to play rum,wikihow,diy,easy,simple,tips,tricks,tips and tricks,how to play gin rummy,win gin rummy,rules of gin rummy,melds,keep score in gin rummy,how to play rummy 500,win rummy 500,rules of rummy 500

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !