Satyavedu TDP MLA : టీడీపీ ఎమ్మేల్యే లైంగిక వేధింపుల పర్వం

0

  • ప్రైవేటు వీడియోలు రిలీజ్‌ చేసిన బాధితురాలు !
  •  సొంత పార్టీ నాయకురాలిపైనే అఘాయిత్యం !

సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై ఓ మహిళా నేత లైంగిక వేధింపులు ఆరోపణలు చేసింది. ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో కాదు తెలుగుదేశం పార్టీకే చెందిన సత్యవేడు నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు కావటం గమనార్హం. ఆమె కొన్ని ప్రైవేటు వీడియోలను సైతం బాధితురాలు రిలీజ్‌ చేసింది. హైదరాబాద్‌లోని సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియాకు బాధితురాలు తన భర్తతో కలిసి వచ్చి ఆదిమూలం లైంగిక వేధింపుల పర్వాన్ని బయటపెట్టింది. తిరుపతిలోని బీమాస్‌ హోటల్‌లో తనపై లైంగిక దాడి చేశాడని బాధితురాలు వెల్లడిరచింది. ఇప్పటికే సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్‌ కు లేఖ రాశానని తెలిపింది. ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ ఆదిమూలం తనపై బెదిరింపులకు దిగాడని బాధితురాలు చెప్పింది. తాము కూడా టీడీపీకి చెందిన వారమేనని ఆమె తెలిపింది.

బెదిరించి లైంగికదాడి ! 

ఒకే పార్టీకి చెందిన వాళ్ళము కావడంతో పలు కార్యక్రమాల్లో ఆదిమూలం కలిసేవారని వెల్లడిరచింది. అలా పరిచయమైన తరువాత తన ఫోన్‌ నెంబర్‌ తీసుకున్నాడని తెలిపింది. తన మొబైల్‌కు పదేపదే కాల్స్‌ చేసేవాడని.. తిరుపతిలోని భీమాస్‌ హోటల్‌లోని రూమ్‌ నెంబర్‌ 109 లోకి రమ్మని చెప్పాడని తెలిపింది. అక్కడ తనను బెదిరించి తనపై ఆదిమూలం లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలు వెల్లడిరచింది. ఎవరికైనా చెబితే తనతో పాటు కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించాడని తెలిపింది. అలా తనపై మూడుసార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని వెల్లడిరచింది. చివరకు ఎమ్మెల్యే ఆదిమూలం నిజరూపాన్ని బట్టబయలు చేయడానికి పెన్‌ కెమెరా పెట్టుకున్నానని తెలిపింది. లైంగికంగా తన కోరిక తీర్చకుంటే కుటుంబం మొత్తాన్ని అంతం చేస్తానని ఎమ్మెల్యే బెదిరించాడని బాధితురాలు వెల్లడిరచింది.

పెన్‌ కెమెరాతో రికార్డింగ్‌ !

ఇకపై ఎమ్మెల్యే ఆదిమూలం టీడీపీలో ఉండటానికి అర్హుడు కాడని తెలిపింది. ఆదిమూలం గురించి అందరికీ తెలియాలనే పెన్‌ కెమెరాలో రికార్డు చేశానని వెల్లడిరచింది. తన దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని ఎమ్మెల్యే 100 సార్లు కాల్‌ చేశాడని పేర్కొంది. రాత్రులు మెసేజ్‌లు చేసి వేధించేవాడని తెలిపింది. రోజుకు ఒక అమ్మాయితో ఎమ్మెల్యే ఎంజాయ్‌ చేసేవాడని పేర్కొంది. అందమైన అమ్మాయి కనబడితే చాలు తను తనతో ఉండాల్సిందేనని ఆదిమూలం ఎంతో మందిని టార్చర్‌ చేశాడని వెల్లడిరచింది. తిరుపతి భీమా ప్యారడైజ్‌ హోటల్‌ ఎమ్మెల్యే నీచ చర్యలకు అడ్డా అని తెలిపింది. ఇలాంటి వాళ్ళన్ని పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని బాధితురాలు డిమాండ్‌ చేసింది. ఆయనను ఎలాంటి కార్యక్రమాలకు పిలవొద్దని పేర్కొంది. ఆదిమూలం తమ ఇంటికి వచ్చాడని ఎవ్వరూ సంబరపడి పోవద్దని.. అలా వస్తే మీ భార్య, పిల్లలపై కన్నేస్తాడని పేర్కొంది. ఆదిమూలం కామాంధుడు, రాక్షసుడని.. అతని నుంచి సత్యవేడులోని పార్టీ మహిళా కార్యకర్తలను కాపాడాలని బాధితురాలు వేడుకొంది.

గత ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి పోటీ చేసిన కోనేటి ఆదిమూలం 

కోనేటి ఆదిమూలం వైఎస్‌ఆర్‌సీపీలో మొదటి నుంచి  పనిచేశారు. రెండు సార్లు ఆ పార్టీ తరపున పోటీ చేశారు. ఒక సారి విజయం సాధించారు. 2014లో ఓడిపోయారు. 2019లో భారీ మెజార్టీతో గెలిచారు. గత ఎన్నికల్లో వైసీపీ టిక్కెట్‌ ఆయనకు ఇవ్వలేదు. తిరుపతి ఎంపీ టిక్కెట్‌ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. అయితే తనకు ఎంపీ టిక్కెట్‌ అవసరం లేదని ఎమ్మెల్యే టిక్కెట్‌ మాత్రమే కావాలని చెప్పి ఆయన టీడీపీలో చేరిపోయారు. టీడీపీ ఆయనకు టిక్కెట్‌ ఇచ్చింది. హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి నూకతోటి రాజేష్‌ పై కోనేటి ఆదిమూలం మూడున్నర వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. అంటే..  వరుగా రెండో సారి గెలిచారు. టీడీపీ తరపున మొదటి సారి గెలిచారు. 

మార్ఫింగ్‌ వీడియో అంటున్న  సత్యవేడు ఎమ్మెల్యే 

అయితే ఈ వీడియో విషయంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కొన్ని మీడియా సంస్థల ప్రతినిధులతో మాట్లాడారు. సత్యవేడు నియోజవర్గంలో కొంత మంది టీడీపీ నాయకులు చేసినక కుట్ర పూరితంగానే ఈ వీడియోలు విడుదల చేశారని ఆయన అంటున్నారు. ఆ వీడియోలో ఉన్న మహిళ ఎవరో తనకు తెలియదని.అవి మార్ఫింగ్‌ వీడియోలని అంటున్నారు.  వైసీపీ నుంచి కోనేటి ఆదిమూలం టీడీపీలో చేరి టిక్కెట్‌ తెచ్చుకుని పోటీ చేసి గెలవడం ఇష్టం లేని టీడీపీనేతల కుట్రేనని ఆయన చెబుతున్నారు. 

చర్యలు తీసుకునేందుకు టీడీపీ హైకమాండ్‌ రెడీ 

కోనేటి ఆదిమూలం వ్యవహారం సంచలనంగా మారుతోంది. ఇటీవలి పలువురు ప్రజా ప్రతినిధులు ఇలాంటి దృశ్యాలతో  అల్లరి పాలయ్యారు. ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే వంతు అయింది. ఆయన కూడా మొన్నటిదాకా వైసీపీలోనే ఉండి వచ్చారు. ఇప్పుడీ ఎమ్మెల్యేపై టీడీపీ అధినాయకత్వం చర్యలు తీసుకోవాలన్న డిమాండ్‌ వినిపిస్తోంది. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !