Sidharth Luthra Babu case : చివరకు సిద్దార్థ లూథ్రా వల్ల కూడా కాలేదు.

0

స్కిల్‌ డెవలప్మెంట్‌ స్కామ్‌లో చంద్రబాబునాయుడును ఏసీబీ అరెస్టు చేయటం ఆలస్యం వెంటనే ఢల్లీి నుండి లూథ్రా విజయవాడలో దిగేశారు. తన మంది మార్బలంతో అట్టహాసంగా లూథ్రా దిగటంతో టీడీపీ నేతలు, చంద్రబాబు మద్దతుదారులంతా ఆనందంతో గంతులేశారు. ఇంకేముంది లూథ్రా దిగేశారు, బాబు బయటకు వచ్చేస్తారు అన్న ఊహాల్లోనే విహరించారు. చంద్రబాబు బెయిల్‌ పైన బయటకు వచ్చేయటం ఖాయమన్నట్లుగా మాట్లాడారు. స్కామ్‌లో సూత్రధారి, కీలక పాత్రధారి, కుట్రదారుడు చంద్రబాబే అని ఏసీబీ తరపున అడిషినల్‌ అడ్వకేజ్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి వాదించారు. చంద్రబాబు అరెస్టు అక్రమమని, ఏసీబీ పెట్టిన సెక్షన్లు వర్తించవని, చంద్రబాబు అరెస్టులో ఏసీబీ ప్రొసీజర్‌ ఫాలో అవలేదని లూథ్రా పదేపదే వాదించారు. మొత్తానికి రెండు వైపుల వాదనలు సుమారు 8 గంటలపాటు జరిగింది. మధ్యాహ్నం 2.45 గంటలకు వాదనలు ముగిస్తే సాయంత్రం 6.45 గంటలకు న్యాయమూర్తి చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్‌ విధించారు. దాంతో చంద్రబాబు మద్దతుదారులు, టీడీపీ నేతలు, లూథ్రా క్యాంపు మొత్తం షాక్‌కు గురైంది.

పసలేని వాదనలు 

ఒకానొక సమయంలో లూథ్రా విక్టరీ సింబల్‌ చూపించి తెలుగుదేశం క్యాడర్‌లో ఉత్సాహం నింపారు. బెయిల్‌ వచ్చేసినట్టే అని ఆత్మవిశ్వాసం ప్రదర్శించారు. చివరకు రిమాండ్‌ తీర్పురాగనే అవాక్కవ్వటం అందరి వంతు అయ్యింది. ఇక్కడ సమస్య ఏమిటంటే లూథ్రా వాదనల్లోని డొల్లతనం అంతా వాదనల్లో బయటపడిరది. అసలు దేశంలోనే ఎంతో పేరున్న లాయర్లలో ఒకళ్ళైన లూథ్రా లేవనెత్తిన అభ్యంతరాలు ఇవేనా అని ఆశ్చర్యమేసింది. లూథ్రా వాదించిన పాయింట్లు ఏవంటే గవర్నర్‌కు చెప్పకుండానే అరెస్టు చేశారని, అరెస్టు చేసిన 24 గంటల్లో కోర్టులో ప్రవేశపెట్టలేదని, సెక్షన్‌ 409 చంద్రబాబుకు వర్తించవని, నోటీసు ఇవ్వకుండానే అరెస్టు చేశారని, స్కామ్‌తో చంద్రబాబుకు అసలు సంబంధమే లేదని పదేపదే వాదించారు. ఇంతోటి వాదనలు వినిపించటానికి లూథ్రా ఢల్లీి నుండి రావాలా అని అనిపించింది. 

లూథ్రా లేవనెత్తిన కీలక విషయాలు ఇవే..?

స్కిల్‌ డెవలప్మెంట్‌ స్కామ్‌ రాజకీయ ప్రేరేపిత కేసుగా పేర్కొన్నారు.  2021లో నమోదైన ఈ కేసులో హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి, తీర్పు కూడా రిజర్వ్‌ అయ్యింది.. ఈ కేసు ఎప్పుడో ముగిసింది. నిందితులందరికీ బెయిల్‌ వచ్చింది. ఎన్నికలు వస్తున్నాయని, చంద్రబాబును ఇరికించాలనే తిరిగి కేసు ఓపెన్‌ చేశారు.చంద్రబాబుపై చేసినవి ఆధారాల్లేని ఆరోపణలు. ప్రభుత్వం చంద్రబాబును టార్గెట్‌ చేసింది. సెక్షన్‌-409 చంద్రబాబుకు వర్తించదు. ఏ-35 ఘంటి వెంకట సత్యభాస్కర్‌ ప్రసాద్‌ను అదుపులోనికి తీసుకున్న సమయంలో సెక్షన్‌-409 వర్తించదు. ఎఫ్‌ఐఆర్‌లో చంద్రబాబు పేరు లేదు.. కాబట్టి సీఐడీ ఎలా అరెస్ట్‌ చేస్తుంది..? రిమాండ్‌ రిపోర్టులో దర్యాప్తు అధికారి వాడిన భాషను గమనించండి.చంద్రబాబును నంద్యాల మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచే అవకాశం ఉంది, అయినా కూడా ప్రభుత్వం వాళ్లనుకున్న చోటే ప్రవేశపెట్టింది. కోర్టు ముందు ప్రవేశపెట్టకుండా 24 గంటలపాటు చంద్రబాబును ఎందుకు నిర్భందించారో అర్థం కావట్లేదు..? సీఐడీ ఆరోపణలు చేసినట్లు చంద్రబాబు లండన్‌ వెళ్లడం లేదు. చంద్రబాబును ఉదయం 6 గంటలకు అరెస్ట్‌ చేసినట్లు సీఐడీ చెబుతోంది..కానీ బాబును ముందురోజు రాత్రి 11 గంటలకే సీఐడీ పోలీసులు చుట్టుముట్టారు. ఆ సమయం నుంచే అరెస్ట్‌ చేసినట్టుగా పరిగణలోకి తీసుకోవాలి. రాత్రి 11 గంటలకు చుట్టుముట్టి కదలకుండా చేయడం వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించడమే. సీఐడీ అధికారుల కాల్‌ డేటా రికార్డులను అందించేలా కోర్టు ఆదేశాలు ఇవ్వా. అరెస్టు చేసిన పోలీసుల 48గంటల కాల్‌ డేటా కోర్టుకు సమర్పించాలి. అవినీతి నిరోధక చట్టం ప్రకారం సీఐడీ నడుచుకోలేదు. చంద్రబాబు అరెస్ట్‌కు గవర్నర్‌ అనుమతి అవసరం.. ఇది అనుబంధ పిటిషన్‌ మాత్రమే. రిమాండ్‌ రిపోర్టు వరకు మాత్రమే వాదనలు పరిమితం చేయాలి. అరెస్టు అంటే అర్థం ఏమిటో సీఐడీ లాయర్లకు వివరించిన సిద్దార్థ్‌ లూథ్రా. రిమాండ్‌ రిపోర్ట్‌ తిరస్కరించాలని పంజాబ్‌ మణిందర్‌ సింగ్‌ కేసును ప్రస్తావించిన లూథ్రా. కానీ లూథ్రా లేవనెత్తిన అభ్యంతరాలు నిలిచేవి కావని కోర్టు బయట ఇతర లాయర్లే చెప్పేశారు. లూథ్రా ఇలాగే వాదిస్తే చంద్రబాబుకు రిమాండ్‌ ఖాయమని కోర్టు బయట మిగిలిన న్యాయవాదులు ముందే చెప్పేశారు. వాళ్ళు చెప్పినట్లుగానే లూథ్రా వాదనలన్నింటినీ జడ్జి కొట్టేశారు. చంద్రబాబును అరెస్టు విషయాన్ని గవర్నర్‌కు చెప్పాల్సిన అవసరంలేదన్నారు. జరిగిన నేర తీవ్రత కారణంగా సెక్షన్‌ 409 పెట్టడం సబబే అన్నారు. అరెస్టు చేసిన 24 గంటల్లో కోర్టులో ఏసీబీ చంద్రబాబును ప్రవేశపెట్టారని న్యాయమూర్తి అంగీకరించారు. నేర తీవ్రతను బట్టి చంద్రబాబును అరెస్టు చేయటానికి ముందుగా నోటీసు ఇవ్వాల్సిన అవసరమే లేదని జడ్జి తేల్చేసి 14 రోజుల రిమాండు విధించారు. ఇదంతా చూసిన తర్వాత లూథ్రా వాదనల్లో ఎలాంటి పసలేదని అర్థమైపోయింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !