AP Assembly : అసెంబ్లీలో మీసం మెలేసిన బాలయ్య !

0

 

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాల్లో తొలిరోజు మొదలైన కొద్దిసేపటికో గందర గోళం నెలకొంది. సభలో చంద్రబాబు అరెస్ట్‌పై వాయిదా తీర్మానానికి టీడీపీ పట్టుబట్టింది. స్కిల్‌ స్కాం కేసుపై అధికార వైసీపీ ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష టీడీపీసభ్యులు పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు. స్పీకర్‌ పోడియం వద్దకు టీడీపీ సభ్యులు చేరుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలతో కలిసి వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పోడియం ఎక్కి ఆందోళన చేయడంతో సభలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అదే సమయంలో టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ మీసం తిప్పడంతో మంత్రి అంబటి రాంబాబు కౌంటర్‌ ఇచ్చారు. దమ్ముంటే రా అంటూ సవాల్‌ విసిరారు. మీసాలు తిప్పడాలు సినిమాల్లో చూపించుకోవాలంటూ బాలకృష్ణకు అంబటి చురకలంటించారు. రెండు పార్టీ ఎమ్మెల్యేల గందరగోళం మధ్య సభను కాసేపు వాయిదా వేశారు స్పీకర్‌.

మీసం తిప్పినందుకు స్పీకర్‌ వార్నింగ్‌...

సభ వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన సమయంలో స్పీకర్‌ బాలకృష్ణను వారించారు. మీరు మీసాలు తిప్పాలన్నా, తొడలు కొట్టాలంటే సినిమాల్లో చేసుకోండి ..ఇక్కడ కాదని హెచ్చరించారు. తొలిసారిగా వదిలేస్తున్నానని ..మరోసారి ఇలాంటివి చేయవద్దని చేస్తే సభ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని వార్నింగ్‌ ఇచ్చారు. సభ తిరిగి ప్రారంభమైనప్పటికి కూడా టీడీపీ ఎమ్మెల్యేలు వాయిదా తీర్మానం ప్రవేశపెట్టాల్సిందేనని డిమాండ్‌ చేశారు. సభలో వైసీపీ సభ్యులు మాట్లాడుతుండగా నినాదాలు చేయడం, అడ్డుపడటంతో సభ కార్యక్రమానికి అడ్డుపడుతున్నారని స్పీకర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

15మంది సభ్యుల సస్పెండ్‌ ..

టీడీపీకి చెందిన 13మంది శాసన సభ్యులతో పాటు మరో ఇద్దరు వైసీపీ బహిషృత ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిని సస్పెండ్‌ చేశారు. అనగాని సత్యప్రసాద్‌, పయ్యావుల కేశవ్‌, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని ఈ సెషన్‌ మొత్తానికి సస్పెండ్‌ చేస్తున్నట్లుగా స్పీకర్‌ చెప్పారు. సభలో అధికార పార్టీ వ్యవహరించిన తీరును తప్పుపట్టారు ఎమ్మెల్యే బాలకృష్ణ. అసెంబ్లీలో జరిగిన ఘటన బాధాకరమని.. నియంతృత్వధోరణిలో సభ జరిగిందన్నారు.

నియంతృత్వ పాలన..

రాష్ట్రంలో నియంతృత్వపాలన కొనసాగుతుందని కామెంట్‌ చేశారు. ఎన్టీఆర్‌ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారని చంద్రబాబు సీఎంగా రాష్ట్రానికి గుర్తింపు తెచ్చారని చెప్పారు. చంద్రబాబు ఓ బ్రాండ్‌ అని ఆయనపై కేసు పెట్టడం బాధకరమన్నారు. ఇది కేవలం కక్ష సాధింపు చర్యేన్నారు. తాను జైల్లో ఉండి వచ్చాను కాబట్టి చంద్రబాబు కూడా జైల్లో ఉండాలన్నట్లుగా జగన్‌ వ్యవహరిస్తున్నారని బాలకృష్ణ మండిపడ్డారు. అక్రమ కేసులకు, అరెస్ట్‌లకు భయపడేదిలేదన్నారు. ప్రజాకోర్టులోనే తేల్చుకుంటామన్నారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !