13 ఏళ్ళకే తండ్రి కాబోతున్న బాలుడు !

0


పొరుగింటి బాలుడి (13) పై మనసు పడిన మహిళ ఇంట్లో పని ఉందంటూ సాయం కోరింది. ఒకసారి అలా మొదలు పెట్టి, పదే పదే అలా అడగటంతో కాదనలేకపోయాడు.అతడిపై ఉన్న వ్యామోహంతో పదే పదే ఇంటికి పిలిచి శారీరక సంబంధం ఏర్పర్చుకుంది. వయసు వ్యత్యాసం ఉండటంతో ఎవరూ వారిని అనుమానించ లేదు. ఈ విషయం బయట పెట్టోద్దని బాలుడిని ఆమె కోరింది. చివరకు ఆమె గర్భం దాల్చడంతో గుట్టు రట్టయింది. ఈ సంఘటన అమెరికాలోని కొలరాడో రాష్ట్రంలో వెలుగుచూసింది. ఈ ఘటనతో పోలీసులు రంగంలోకి దిగి ఆండ్రియా సెరానో (31)ను అరెస్ట్‌ చేశారు. మైనర్‌పై లైంగిక దాడి చేసినట్లు ఆరోపణలు మోపారు.

తమ మధ్య శారీరక సంబంధం ఉన్న మాట వాస్తవమేనని కోర్టులో ఆండ్రియా అంగీకరించింది. కడుపులో పెరుగుతున్న బిడ్డకు.. ఆ బాలుడే తండ్రి అని చెప్పింది. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో తోచక న్యాయమూర్తులు సైతం తలలు పట్టుకున్నారు. మహిళ ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఆమెను విడుదల చేయడానికే మొగ్గు చూపారు. 70 వేల డాలర్ల పూచీకత్తుతో విడుదలకు జడ్జి ఆదేశాలు జారీ చేశారు. ఇరు పక్షాల మధ్య రాజీ కుదిరిన నేపథ్యంలో కేసును ముగించేందుకే కోర్టు ప్రయత్నించింది. అయితే, పుట్టబోయే బిడ్డకు ఆ బాలుణ్నే తండ్రిగా పరిగణించాలని ఉత్తర్వులు జారీ చేసింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !