Mahesh Babu : యానిమల్‌...మరో సెన్సేషన్‌ కాబోతోంది

0

అర్జున్‌ రెడ్డి సినిమాతో ఇండస్ట్రీని షేక్‌ చేసిన డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా మరో సెన్సేషన్‌కు రెడీ అయ్యాడు.  ఆయన దర్మకత్వం వహించిన యానిమన్‌ మూవీ డిసెంబర్‌ 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ట్రైలర్‌, సాంగ్స్‌ తో హైప్‌ తెచ్చిన మేకర్స్‌ .. నేడు ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ కు గెస్ట్‌ గా మహేష్‌ బాబును పిలిచి మరింత హైప్‌ ఇచ్చారు. చాలా రేర్‌ గా మహేష్‌.. వేరే హీరోల ఫంక్షన్స్‌ కు వెళ్తూ ఉంటాడు. అందుకే మహేష్‌ ను చూడడానికి అభిమానులు మల్లారెడ్డి యూనివర్సటీ గ్రౌండ్స్‌ కు క్యూ కట్టారు. ఇక ఈ ఈవెంట్‌ లో మహేష్‌ సందడి అంతాఇంతా కాదు. ఇక ఈ వేదికపై మహేష్‌ మాట్లాడుతూ.. ’’ సందీప్‌ అంటే నాకు చాలా ఇష్టం. సందీప్‌.. ట్రైలర్‌ చూసాను.. మెంటల్‌ ఎక్కిపోయింది. సాధరణంగా ఈ మాట నేను చెప్పను. కానీ, ట్రైలర్‌ చూసాక చెప్పాలనిపించింది. సందీప్‌ .. నైట్‌ ఫోన్‌ చేసి ప్రీ రీలిజ్‌ ఈవెంట్‌ కు రావాలని చెప్పాడు. నేను నాప్రీ రిలీజ్‌ ఈవెంట్స్‌ కే వెళ్ళను. కానీ, ఈ ఈవెంట్‌ కు రావాలనిపించింది. 

సందీప్‌ మేకింగ్‌ ఎంతో యూనిక్‌

మొదటి నుంచి కూడా సందీప్‌ మేకింగ్‌ నాకు చాలా ఇష్టం. ఎంతో యూనిక్‌ గా ఉంటుంది. దేశంలోనే ఒరిజినల్‌ ఫిల్మ్‌ మేకర్‌ ..నువ్వు ఎప్పుడు ఇలానే మనసుకు నచ్చిన సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను సందీప్‌. ఉదయమే ఎవరో చెప్పారు. అడ్వాన్స్‌ బుకింగ్‌ లో యానిమల్‌ సెన్సేషన్‌ అని.. ఇది ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ లా అనిపించడం లేదు.. ఈ సినిమా వందరోజుల ఫంక్షన్‌ లా అనిపిస్తుంది. అనిల్‌ కపూర్‌ సర్‌ .. మీ బాడీ వర్క్‌ కానీ, మీ స్క్రీన్‌ ప్రజెన్స్‌ కానీ అస్సలు మ్యాచ్‌ చేయలేనివి. ట్రైలర్‌ లో కొన్ని సీన్స్‌ లో నాకు గూస్‌ బంప్స్‌ వచ్చాయి. రణబీర్‌.. నాకు నచ్చిన నటుడు. నేను చాలాసార్లు చెప్పాను. ఇండియాలోనే బెస్ట్‌ యాక్టర్‌ రణబీర్‌. యానిమల్‌ అతని కెరీర్‌ లోనే బిగ్గెస్ట్‌ హిట్‌ గా నిలుస్తుంది. ఇక ఈ సినిమాలో పనిచేసినవారందరికీ కంగ్రాట్స్‌. రష్మిక.. నిన్ను చూసి చాలా గర్వంగా ఉంది. ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషల్లో నటించావు. నీకు మంచి సక్సెస్‌ రావాలని కోరుకుంటున్నాను ’’ అంటూ ముగించాడు. 

బిజినెస్‌మాన్‌ సినిమా చూసే రాజకీయాల్లోకి వచ్చా - మల్లారెడ్డి

ఇక ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. ’’ ఈరోజు మల్లారెడ్డి యూనివర్సిటీకి యానిమల్‌ చిత్రబృందం వచ్చింది. మహేష్‌ బాబు గారు.. నేను మీ సినిమా బిజినెస్‌ మేన్‌ చూసి నేను రాజకీయాల్లోకి వచ్చాను. ఆ సినిమా పదిసార్లు చూసి ఎంపీ అయ్యాను. సేమ్‌ మోడల్‌.. సేమ్‌ సిస్టమ్‌. రణబీర్‌ నీకు నేనొక విషయం చెప్తాను. అప్పట్లోనే నేను చెప్పాను.. బాలీవుడ్‌, హాలీవుడ్‌ ను.. తెలుగు హీరోలు రూల్‌ చేస్తారు అని.. మా తెలుగువాళ్లు చాలా స్మార్ట్‌. రాజమౌళి, దిల్‌ రాజు.. ఇప్పుడు సందీప్‌ వచ్చాడు. హాలీవుడ్‌, బాలీవుడ్‌ ను హిందుస్థానీ రూల్‌ చేస్తోంది. హైదరాబాద్‌ అందులో టాప్‌ మోస్ట్‌.. మా తెలుగు ప్రజలు చాలా స్మార్ట్‌. పుష్పతో అల్లు అర్జున్‌.. దుమ్మురేపాడు.. ఇప్పుడు సందీప్‌ మరోసారి బాలీవుడ్‌ లో దుమ్మురేపుతాడు. మల్లారెడ్డి యూనివర్సిటీలో నాలుగుసార్లు అశ్వమేధ యాగం జరిగింది. ఇక్కడ ఇంజనీర్లు, డాక్టర్లు తయారవుతున్నారు. ఇక్కడ ఏ సినిమా రిలీజ్‌ అయినా కూడా 500 కోట్లు కలక్షన్స్‌ వస్తాయి .. పక్కా.. ఈ సినిమా సూపర్‌ హిట్‌’’ అంటూ ముగించారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !