Odisha Black Money Case : 353 కోట్లు...60 కిలోల బంగారం...ఇంత సొమ్ము ఎలా ?

0

ఒడిశా కాంగ్రెస్‌ ఎంపీ ధీరజ్‌ ప్రసాద్‌ సాహు కుటుంబం నిర్వహిస్తున్న డిస్టిలరీ కంపెనీపె ఆదాయపు పన్ను శాఖ సోదాలు ఆరో రోజూ కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు లెక్కల్లోకి రాని రూ.353 కోట్ల సొమ్మును స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఒకే ఘటనలో ఇంత మొత్తంలో నగదు పట్టుబడటం ఇదే తొలిసారని వెల్లడిరచారు. ఐదు రోజుల పాటు లెక్కింపు ప్రక్రియ కొనసాగగా, 176 డబ్బు సంచులను బాలంగిర్‌ ఎస్‌​బీఐ బ్రాంచీలో డిపాజిట్‌ చేసినట్లు చెప్పారు. ఒడిశా రాజ్యసభ ఎంపీ ధీరజ్‌ సాహుకు సంబంధమున్న పలు మద్యం కంపెనీలు పన్ను ఎగవేతకు పాల్పడుతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. అక్రమ నగదు కౌంటింగ్‌​ ప్రక్రియ ఆదివారం రాత్రి వరకు కొనసాగింది. ఈ కౌంటింగ్‌​ ప్రక్రియలో ముగ్గురు బ్యాంక్‌ అధికారులు, 50 మంది ఐటీ శాఖ ఆఫీసర్లు పాల్గొన్నారు. 40 కరెన్సీ లెక్కింపు యంత్రాలను ఇందుకోసం వినియోగించారు. తితిలాగఢ్‌, సంబల్‌పుర్‌లోని దేశీ మద్యం తయారీ యూనిట్ల నుంచి కూడా భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు ఐటీ అధికారులు. ఈ డబ్బును రెండు వ్యాన్లలో సంబల్‌పుర్‌ ఎస్‌బీఐ బ్రాంచ్‌కు తరలించారు.

60 కిలోల బంగారం స్వాధీనం!

గత బుధవారం ఈ ఐటీ దాడులు ప్రారంభమయ్యాయి. ఒడిశాలోని పలువురు మద్యం యజమానులకు చెందిన కార్యాలయాలు, నివాసాల్లో సోదాలు నిర్వహించింది ఐటీ శాఖ. ఈ క్రమంలో పెద్ద మొత్తంలో డబ్బుతో పాటు 60 కిలోల బంగారాన్ని కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే దీనిపైనా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

బీజేపీ తీవ్ర విమర్శలు 

ఓ దర్యాప్తు సంస్థ చేపట్టిన సోదాల్లో ఇంత పెద్ద మొత్తంలో నగదు పట్టుబడటం దేశంలో ఇదే తొలిసారి. దీనిపై బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆధ్వర్యంలో పార్లమెంట్‌ బయట పార్టీ ఎంపీలు నిరసన చేపట్టారు. దీనిపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ వివరణ ఇవ్వాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. జేపీ నడ్డా మీడియాతో మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్‌, కరప్షన్‌ ఒకే నాణానికి రెండు ముఖాలు లాంటివి. ధీరజ్‌ సాహు వద్ద దొరికిన ఈ నల్లడబ్బు ఎవరిది..? దీనిపై సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ సమాధానం ఇవ్వాలి’ అని డిమాండ్‌ చేశారు. భారీ స్థాయిలో నగదు వెలుగులోకి రావడంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఒక ఎంపీ ఇంటినుంచి ఈ స్థాయిలో నగదును స్వాధీనం చేసుకున్నారు. కానీ దీనిపై ప్రతిపక్షాల ఇండియా కూటమి మాత్రం మౌనం వహిస్తోంది. కరప్షన్‌ అనేది కాంగ్రెస్‌ స్వభావం కాబట్టి ఆ పార్టీ నిశ్శబ్దంగా ఉందంటే ఓకే. జేడీయూ, ఆర్జేడీ, డీఎంకే, ఎస్పీ ఎందుకు మౌనం వహిస్తున్నాయి’ అని ఇండియా కూటమిపై విమర్శలు గుప్పించారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !