AP SSC చరిత్రలోనే అత్యధిక మార్కులు సాధించిన నారాయణ విద్యార్థినీ !

0

ఆంధ్రప్రదేశ్‌ 10 వ తరగతి ఫలితాల్లో సరికొత్త చరిత్ర ఆవిషృతమైంది. SSC చరిత్రలోనే అత్యధిక మార్కులతో రికార్డును నారాయణ బద్దలు కొట్టింది. ఆంధ్రప్రదేశ్‌ విద్యాచరిత్రకు మరో మణిమకుటాన్ని కూర్చింది. నూజివీడుకి చెందిన నారాయణ విద్యార్ధిని సాయి మనస్వి 600 మార్కులకు గాను 599 మార్కులు సాధించి ఈ రికార్డును ఆవిష్కరించింది. ఈ ఘనత సాధించిన ఏకైక విద్యార్థిని సాయి మనస్వి కావటం గమనార్హం. ఈ సంవత్సరం 599 మార్కులు సాధించిన వారు ఒక్కరే ఉండగా, ఆ ఒక్కరూ నారాయణ విద్యార్థి కావటం ఎంతో గర్వకారణంగా ఉందని నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్స్‌ డా॥పి. సింధూర నారాయణ, శరణి నారాయణ పేర్కొన్నారు. వీటితో పాటుగా 598, 597, 596, 595 వంటి మార్కులను నారాయణ విద్యార్థులు సాధించారని తెలియజేశారు. మొత్తం 595 ఆపైన 28 మంది విద్యార్థులు సాధించారని చెప్పారు. ఓవరాల్‌గా యావరేజ్‌ మార్క్‌ 511 మార్కులుగా ఉందని తెలిపారు. ఓవరాల్‌ పాస్‌ పర్సంటేజ్‌ 99.1% ఉందన్నారు. ఈ చారిత్రాత్మక విజయంలో పాలుపంచుకున్న విద్యార్థులకు, తల్లిదండ్రులకు, టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌కు అభినందనలు తెలిపారు. 

నడిపించింది నారాయణే, గెలిపించింది నారాయణే - సాయి మనస్వి 

నేను నర్సరీ నుండి నూజివీడు నారాయణలోనే చదివాను. నారాయణ ఎక్స్‌పీరియన్స్‌డ్‌ టీచర్స్‌ ఫండమెంటల్స్‌పై కేర్‌ తీసుకుంటారు. వివిధ రకాలైన ఎగ్జామ్స్‌ వల్ల ఎంతో తెలుసుకోగలిగాను. నారాయణ కరిక్యులమ్‌, మైక్రోషెడ్యూల్‌, ప్రోగ్రామ్‌ను ఫాలో అయ్యాను. రాష్ట్రంలోనే అత్యధిక మార్కులు సాధించగలిగాను.  


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !