Potina Mahesh : చంద్రబాబు ఆర్ధిక ప్యాకేజీకి పవన్‌ అమ్ముడుపోయారు !

0

జనసేనను వీడిన వాళ్లంతా వైఎస్సార్‌సీపీపార్టీలోనే చేరుతున్నారు. పది జిల్లాలో అస్సలు జనసేన పార్టీనే లేదు. చంద్రబాబు ఆర్ధిక ప్యాకేజీకి పవన్‌ అమ్ముడుపోయాడు. జైలు వద్ద బాబుతో ములాఖత్‌ అయ్యాక పవన్‌ చాలా ఆస్తులు కొన్నారు. ఆ వివరాలు నా దగ్గర ఉన్నాయి. మంగళగిరి లో పార్టీ కార్యాలయం కొనుగోలుకు ఏ అకౌంట్‌ నుంచి డబ్బులు వచ్చాయి. ఎలెక్ట్రోల్‌ బాండ్స్‌ పేరుతో ఎంత సేకరించారో వెబ్‌ సైట్‌లో పెట్టాలి’’ అని పోతిన మహేష్‌ అన్నారు. టీటీడీకి ఒక్కరూపాయి కూడా పవన్‌ విరాళం ఇవ్వరు. ఖాజా దగ్గర ఉన్న దశావతారం టెంపుల్‌కే విరాళాలు ఇస్తారు. ఎందుకో పవన్‌ చెప్పాలి. నాగబాబు ,రుక్మిణి ,సెక్యూరిటీ ఖర్చులు కూడా చలమలశెట్టి నరసింహారావు భరిస్తారు. పార్టీ డబ్బులు ఏమి చేస్తున్నారో పవన్‌ చెప్పాలి. పవన్‌ ప్యాకేజీ డబ్బులు బ్లాక్‌ మనీని హరిహర వీరమల్లు సినిమా ద్వారా వైట్‌ మనీగా మార్చుతున్నారన్నది నిజం కాదా?. పవన్‌పై దిల్‌ రాజు ఐటీకి ఫిర్యాదు చేసింది నిజం కాదా?. పవన్‌ ఫ్యామిలీది బ్రాండ్‌ కాదు మోసం, దగా.’’ అంటూ పోతిన మహేష్‌ నిప్పులు చెరిగారు. జనసేన అభ్యర్థులతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జనసేన ను టీడీపీ లో విలీనం చేసేసారా?. రాజకీయాలని అడ్డం పెట్టుకొని డబ్బు సంపాదించటంలో నాదెండ్ల మనోహర్‌ దిట్ట. నా ప్రశ్నలకు సమాధానం ఇస్తానంటే ఎప్పుడైనా ఎక్కడైనా చర్చకు సిద్ధం’’ అని పోతిన మహేష్‌ సవాల్‌ విసిరారు. తన డబ్బుతో పార్టీ నడుపుతున్నానని చెబుతున్న పవన్‌.. జనసేనకు వచ్చిన విరాళాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. పవన్‌ కల్యాణ్‌ ఆస్తుల వివరాలు బయటపెట్టాలన్నారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకు సహాయం చేస్తామని వసూలు చేసిన విరాళాల్లో ఎంత ఖర్చు పెట్టారని అడిగారు. ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌కు పోతిన మహేష్‌ పలు ప్రశ్నలు సంధించారు.ఏ ఎజెండాతో పవన్‌ కల్యాణ్‌ పార్టీ పెట్టారు?

 • చంద్రబాబు పల్లకీ మోయటమే పవన్‌ లక్ష్యమా?
 • కాపు యువతని టీడీపీ జెండాలు మోసే కూలీలుగా పవన్‌ భావిస్తున్నారా?
 • మంగళగిరిలో పార్టీ కార్యాలయం కొనుగోలుకు ఏ అకౌంట్‌ నుంచి డబ్బులు వచ్చాయి?
 • ఎలక్ట్రోరల్‌ బాండ్స్‌లో పవన్‌ కల్యాణ్‌కి ఎంత ముట్టింది?
 • కౌలు రైతుల పేరుతో ఎన్నారైల నుంచి వసూలు చేసిన చందాలెంత?
 • అందులో రైతులకు ఇచ్చినది ఎంత.. పవన్‌ కల్యాణ్‌ వెనకేసుకొన్నది ఎంత?
 • టీటీడీకి ఒక్కరూపాయి కూడా పవన్‌ విరాళం ఎందుకివ్వరు?
 • కాజా దగ్గర ఉన్న దశావతారం ఆలయానికే విరాళాలు ఎందుకిస్తారు ?
 • నాదేండ్ల మనోహర్‌ కి స్పోర్ట్స్‌ కారు కొనేందుకు 10 కోట్లు ఎవరిచ్చారు?
 • హరిహర వీర మల్లు సినిమా ఎందుకు పూర్తి చేయడం లేదు?
 • నల్లధనాన్ని వైట్‌గా మార్చేందుకే ఈ సినిమా తీస్తున్నారా?
 • పవన్‌ కల్యాణ్‌పై దిల్‌ రాజు ఐటీకి పిర్యాదు చేసింది నిజం కాదా?
 • మీ ఇధ్దరి మధ్య ఎందుకు విభేదాలు వచ్చాయి?
 • సినిమా ఇండస్ట్రీలో ఎంత మందిని పవన్‌ ప్రోత్సహించారు?
 • అల్లు అర్జున్‌ గురించి ఒక్క మంచి మాటైనా చెప్పారా?

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !