రక్షణ దళాల్లో ఉద్యోగ నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా నిరసనలు జ్వాలలు ఎగిపడుతున్నాయి. భారత సైన్యం, ఇతర రక్షణ దళాల్లో ఉద్యోగాల కోసం ప్రత్యేకంగా శిక్షణ పొందుతూ, సిద్ధమవుతున్న అభ్యర్థులు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. డిఫెన్స్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ ప్రారంభమవడం కోసం రెండేళ్ళ నుంచి ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న వీరంతా ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీహర్, ఉత్తరప్రదేశ్‌లలో ఈ నిరసనలు భారీగానే కొనసాగుతున్నాయి. యువత రోడ్లపైకి వచ్చి నిరసనలు కొనసాగిస్తున్నారు. ఈ పథకం మంగళవారం ప్రకటించగా.. బుధవారం నుంచి నిరసనలు వెల్లువెత్తాయి.
అసలేంటి ఈ పథకం : కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథకాన్ని మంగళవారం ప్రకటించింది. ఈ పథకంలో భాగంగా పదిహేడున్నర సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల వయసుగల వారిని అగ్నివీరులుగా ఎంపిక చేస్తారు. వీరిని నాలుగేళ్ళ తర్వాత విడుదల చేస్తారు. ఆరు నెలలపాటు శిక్షణ ఇస్తారు. ఈ నాలుగేళ్ళ కాలంలో నెలకు రూ.30,000 నుంచి రూ.40,000 వరకు వేతనం చెల్లిస్తారు. జీవిత బీమా వంటి సదుపాయాలను కూడా కల్పిస్తారు. అగ్నివీరులుగా చేరేందుకు పురుషులతో పాటు మహిళలు కూడా అర్హులే. సైన్యం, నావికా దళం, వాయు సేనలలో దాదాపు 45,000 మందిని నియమిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. రిక్రూట్‌మెంట్లు 90 రోజుల్లో ప్రారంభమవుతాయని, మొదటి బ్యాచ్ 2023 జూలైనాటికి సిద్ధమవుతుందని తెలిపింది.
ఎందుకీ నిరసన : ఈ విధంగా స్వల్ప కాలంపాటు కాంట్రాక్టు ప్రాతిపదికపై సైనికులను నియమించుకోవాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని యువత తప్పుబడుతున్నారు. ఈ నూతన పథకం వల్ల తమ దీర్ఘకాలిక అవకాశాలు దెబ్బతింటాయని ఆరోపిస్తున్నారు. అగ్నివీరులుగా నియమితులైనవారిలో కేవలం 25 శాతం మంది మాత్రమే తిరిగి రెగ్యులర్ కేడర్‌లో చేరే అవకాశం ఉందని ప్రభుత్వం చెప్పడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Are these Indian Army aspirants ??
— 𝐇𝐢𝐦𝐚𝐧𝐬𝐡𝐮 𝐓𝐢𝐰𝐚𝐫𝐢 🇮🇳 (@Wakeupishere) June 16, 2022
Chapra, Bihar
Shameful 😡 https://t.co/uou41wIGeR pic.twitter.com/IGei8pbzdH