పని మీద దృష్టి పెట్టండి, పుకార్ల మీద కాదు

0

హీరోయిన్‌ శోభితా దూళిపాలతో నాగచైతన్య డేటింగ్‌లో ఉన్నారనే వార్త వైరల్‌ అవుతోంది. ఈ గాసిప్‌ వెనుక సమంత హస్తం ఉందని కొందరి నమ్మకం. కావాలనే సమంత పీఆర్‌ టీమ్‌ నాగచైతన్యపై గాసిప్పులు క్రియేట్‌ చేస్తున్నారని నాగచైతన్య అభిమానులు మండిపడుతూ పోస్టులు వైరల్‌ చేస్తున్నారు. ఆ వార్తను ట్యాగ్‌ చేసి ట్విట్టర్‌ వేదికగా సమంత స్పందించారు.

‘ఒక అమ్మాయి మీద గాసిప్‌ వస్తే... నిజమే కావచ్చు అనుకుంటారు..అదే.. అబ్బాయి మీద వదంతులు వస్తే ఒక అమ్మాయి కావాలని చేయించింది అంటారు. ఇంకెన్ని రోజులు ఇలాగే ఉంటారు గయ్స్‌... ఎదగండి...జరిగిన విషయాన్ని మర్చిపోయి ఇద్దరూ జీవితంలో ముందుకు వెళుతున్నారు. మీరు కూడా మీ పని మీద దృష్టి పెట్టండి. మీ కుటుంబం మీద దృష్టి పెట్టంచి.. ముందుకు సాగండి’ అని సమంత కాస్త ఘాటుగానే స్పందించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !