లోకేష్‌ పాదయాత్ర !

0

 

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ పాదయాత్ర చేపట్టనున్నారు. 2023 జనవరి 27న లోకేష్‌ పాదయాత్రను ప్రారంభించనున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు నారా లోకేష్‌ నడవనున్నారు. ఏడాది పాటు ప్రజల మధ్యే ఉండేలా లోకేష్‌ పాదయాత్ర రూట్‌ మ్యాప్‌ సిద్ధమైంది. మార్గం మధ్యలో అన్ని వర్గాల ప్రజల సమస్యలు తెలుసుకోవటంతో పాటు పలు సభల్లోనూ ఆయన ప్రసంగించే అవకాశం ఉంది. నిరుద్యోగం, యువత ఎదుర్కొంటున్న సమస్యలే ప్రధాన అంశాలుగా లోకేష్‌ యాత్ర సాగనుంది. మహిళలు, రైతుల సమస్యల పట్ల ప్రజల్లో చైతన్యం తెచ్చేలా ప్రణాళిక రూపొందించనున్నారు. యువతను పెద్దఎత్తున భాగస్వామ్యం చేసేలా లోకేష్‌ పాదయాత్ర ముందుకు సాగనుంది. లోకేష్‌ పాదయాత్ర చేపడుతారని ఎప్పటినుండో ప్రచారం జరుగుతున్నప్పటికీ ఇన్నాళ్ళు క్లారిటీ రాలేదు. తాజాగా పాదయాత్రపై ఆయనే స్పష్టత ఇవ్వటంతో తెలుగుదేశం శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !