ఉదయ్‌కిరణ్‌ ఆత్మహత్యకు కారణాలు నాకు తెలుసు - దర్శకుడు తేజ !

0

  • సమయం వచ్చినప్పుడు అన్నీ బయటపెడతా !
  • చనిపోయే ముందు అన్ని విషయాలు నాతో పంచుకున్నాడు.
  • తాను చనిపోయేలోపు ఈ ప్రపంచానికి చెబుతా ! 

ఎలాంటి విషయమైనా ఆయన స్పందన సూటిగా, నిర్మోహమాటంగా ఉంటుంది. అది వివాదాస్పదమైనా, చివరకు తనకు సంబంధించినదైనప్పటికీ ఆయన ఓపెన్‌గానే మాట్లాడుతారని దర్శకుడు తేజకు పేరుంది. అయితే రీసెంట్‌గా జరిగిన ఇంటర్వ్యూలో ఉదయ్‌ కిరణ్‌ డెత్‌ మిస్టరీ తనకు తెలుసంటూ డైరెక్టర్‌ తేజ చేసిన కామెంట్స్‌ వైరల్‌ అవుతున్నాయి. ఆయన సూసైడ్‌ వెనకున్న కారణాలన్నీ తనకు తెలుసని అన్నారు. చనిపోయే ముందు ఉదయ్‌ కిరణ్‌ కొన్ని విషయాలు తనతో పంచుకున్నాడని తేజ అన్నారు. సమయం వచ్చినపుడు అన్నీ బయటపెడతా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను చచ్చిపోయే లోపు ఉదయ్‌ కిరణ్‌ డెత్‌ మిస్టరీ అందరి ముందు పెడతా అంటూ గుంభనంగా వ్యవహరించారు. 

ఉదయ్‌ కిరణ్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన వ్యక్తిగా అతడి గురించి అన్నీ తెలుసు. ఉదయ్‌ కూడా తనకు చెందిన ప్రతి విషయాన్ని తేజతో పంచుకునేవారు. కెరీర్‌ డౌన్‌ ఫాలో ఉన్నప్పుడు, తను డిప్రెషన్‌ లో కూరుకుపోయినప్పుడు కూడా ఉదయ్‌ కిరణ్‌, తేజతో టచ్‌ లోనే ఉన్నాడు. అప్పట్లో ‘చిత్రం’ సినిమాతో కెరీర్‌ మొదలుపెట్టి ఆ తర్వాత ‘నువ్వు నేను’, ‘మనసంతా నువ్వే’ సినిమాలతో హ్యాట్రిక్‌ కొట్టాడు ఉదయ్‌ కిరణ్‌. దీంతో ఒక్కసారిగా ఉదయ్‌ కిరణ్‌ రేంజ్‌ పెరిగిపోయింది. స్టార్‌ డైరెక్టర్లు, హీరోలు ఉదయ్‌ కిరణ్‌తో సినిమాలు చేయడానికి పోటీపడ్డారు.

Tags:- uday kiran suicide,director teja,uday kiran suicide mystery,director teja about uday kiran's suicide,director teja direct to uday kiran biopic,director teja about uday kiran,director teja interview,director teja about uday kiran suicide,reason behind clashes between hero uday kiran and director teja,teja about star directors,director teja movies,director shares unknown behind story of chitram movie,reactions on uday kiran suicide

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !