పెళ్ళిపీటలు ఎక్కనున్న తమన్నా ?

0



  • వ్యాపారవేత్తతో పెళ్ళికి ఓకే చెప్పిన మిల్కీబ్యూటీ.
  • తల్లిదండ్రులు నిర్ణయించిన వ్యక్తితో వివాహం.

మిల్కీ బ్యూటీ తమన్నా త్వరలో పెళ్లి పీటలెక్కబోతోందంటూ గత రెండు రోజుల నుంచి జోరుగా వార్తలు ప్రచారం అవుతున్నాయి. ముంబైకి చెందిన ఓ బడా వ్యాపారవేత్తతో తమన్నా ఏడడుగులు వేయనుందట. వివాహం చేసుకోబోతున్నందునే ఆమె కొత్త ప్రాజెక్టులకు సంతకం చేయటం లేదని సినీవర్గాలు పేర్కొంటున్నాయి. ఎవరిని పెళ్ళి చేసుకోవాలో తన తల్లిదండ్రులే నిర్ణయిస్తారని తమన్నా చాలా సార్లు తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తల్లిదండ్రులు ఫిక్స్‌ చేసిన అబ్బాయికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తమన్నా పెళ్లి టాపిక్‌ హాట్‌ టాపిక్‌ గా మారింది.

బిజినెస్‌ మ్యాన్‌

టాలీవుడ్‌లో చాలామంది హీరోయిన్లు బిజినెస్‌ మ్యాన్‌లను పెళ్లి చేసుకున్నారు, శ్రీయ, కాజల్‌, ప్రణీత, సంజనా ఇలా అనేకమంది భామలు వ్యాపారవేత్తలనే పెళ్లాడారు. మరోవైపు హన్సిక కూడా బిజినెస్‌ మ్యాన్‌తో ఏడడుగులు వేసేందుకు రెడీ అవుతుంది. ఈ క్రమంలో తమన్నా కూడా పెళ్లి చేసుకోబోయేది వ్యాపారవేత్తనే అనే వార్త వైరల్‌ అవుతోంది. ప్రస్తుతం తమన్నా వయస్సు 32 సంవత్సరాలు. అందుకే, కొన్ని రోజుల క్రితమే తమన్నా పెళ్లికి ఓకే చెప్పిందట. ముంబైకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తను తమన్నా పెళ్లి చేసుకోనున్నారని తెలుస్తోంది. ఈ మ్యారేజ్‌ అరేంజ్డ్‌ మ్యారేజ్‌ అని తమన్నా తల్లీదండ్రులకు, తమన్నాకు పెళ్లి కొడుకు బాగా నచ్చాడని సమాచారం. కోలీవుడ్‌ మీడియాలో తమన్నా పెళ్లి గురించి జోరుగా ప్రచారం జరుగుతుంది. 

వింత జబ్బు

అయతే తమన్నా పెళ్లి చేసుకోబోయే వ్యక్తి గురించి మరో ఆసక్తికర వార్త తెరపైకి వచ్చింది. సదరు అబ్బాయికి కోట్లలో ఆస్తిపాస్తులు ఉన్నాయట. ముంబైలో టాప్‌ బిజినెస్‌ మాన్‌ గా కొనసాగుతున్నాడట. అయితే తమన్నా పెళ్లాడబోయే వ్యక్తికి ఓ వింత జబ్బు ఉందట. అదేంటంటే అతని ఒంటికి పడని ఫుడ్‌ ఏదైనా తింటే వెంటనే రియాక్షన్‌ జరిగి స్కిన్‌ ర్యాషెస్‌ వచ్చేస్తాయట. ఇప్పుడు ఈ విషయం తెలిసి ఆమె అభిమానులు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. అయితే అతనికి ఉన్న ఈ సమస్యను ఆలస్యంగా గుర్తిస్తే ప్రాణాలకే ప్రమాదం అవుతుందట. ఇటువంటి వింత వ్యాధితో సదరు అబ్బాయి బాధపడుతున్నప్పటికీ.. ఆస్తి కోసం తమన్నా అతడితో పెళ్లికి సిద్ధమైందంటూ ప్రచారం జరుగుతుంది. మరి దీనిపై తమన్నా ఏమైనా స్పందిస్తుందా ? క్లారిటీ ఇస్తుందా లేదా అనేది చూడాలి.

Tags :tamannaah bhatia,tamanna bhatia movies in hindi dubbed full,tamanna bhatia looks stunning as she getting married,tamanna bhatia wedding,tamanna bhatia,tamanna bhatia marriage video,tamanna bhatia marriage life,tamanna bhatia marriage photos,bollywood,bollywood updates,bollywood news,breaking news,exclusive news,eros zooming,tamanna bhatia getting married,tamanna bhatia marriage,tamanna bhatia get married,tamanna bhatia secretly getting married

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !