- స్కూల్ విద్యలో ‘నారాయణ’ ఎందుకు బెస్ట్?
- అడ్మిషన్ల కోసం తల్లిదండ్రులు ఎందుకు క్యూ కడుతున్నారు?
పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలంటే పాఠశాల విద్య అత్యంత కీలకం. అందుకే నేటి విద్యా ప్రపంచంలో తమ పిల్లలను ఏ స్కూల్లో చేర్పించాలనే విషయంలో తల్లిదండ్రులు ఎంతో జాగ్రత్తగా ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా లక్షలాది మంది తల్లిదండ్రుల మొదటి ఎంపికగా ‘నారాయణ విద్యా సంస్థలు’ నిలుస్తున్నాయి. అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కాగానే నారాయణ క్యాంపస్‌ల వద్ద తల్లిదండ్రులు భారీగా తరలిరావడానికి కారణాలేంటి? స్కూల్ విద్యారంగంలో నారాయణను తిరుగులేని శక్తిగా నిలబెట్టిన ప్రత్యేకతలు ఏమిటి? ఒక సమగ్ర పరిశీలన.
48 వసంతాల అప్రతిహత విద్యా వారసత్వం
1979లో డాక్టర్ పి. నారాయణ గారిచే ప్రారంభమైన ఈ విద్యా ప్రస్థానం నేడు ఆసియాలోనే అతిపెద్ద విద్యా వ్యవస్థల్లో ఒకటిగా అవతరించింది. 23కి పైగా రాష్ట్రాలు, 250కి పైగా నగరాల్లో నెట్వర్క్ విస్తరించింది. 950కి పైగా స్కూల్, కాలేజీలు మరియు కోచింగ్ సెంటర్లతో విరాజిల్లుతోంది. ప్రతీ ఏటా 6 లక్షలకు పైగా విద్యార్థులకు 50,000 మందికి పైగా నిపుణులైన అధ్యాపక, సిబ్బంది విద్యాబోధనలో నిమగ్నం అయి ఉన్నారు. నాలుగున్నర దశాబ్దాల సుదీర్ఘ అనుభవం మరియు చెక్కుచెదరని విశ్వసనీయతే తల్లిదండ్రులు నారాయణను ఎంచుకోవడానికి ప్రధాన కారణం.
వయస్సుకు తగిన విద్యాప్రణాళికలు !
నారాయణ పాఠశాలల్లో పిల్లల మానసిక పరిపక్వత, నేర్చుకునే సామర్థ్యానికి అనుగుణంగా పాఠ్యాంశాలను మూడు ప్రధాన దశలుగా విభజించారు.
eKIDZ ప్రోగ్రామ్ : నర్సరీ, పీపీ`1, పీపీ`2 తరగతులు కోసం ప్రత్యేకంగా రూపుదిద్దిన ప్రోగ్రామ్. పిల్లల విద్యాప్రయాణానికి ఓ ఆనందకరమైన ఆరంభాన్ని అందిస్తుంది. ఆటపాటలతో కూడిన విద్యావిధానం. ఇక్కడ అక్షర జ్ఞానం మాత్రమే కాకుండా చిన్న వయసులోనే పిల్లల్లో భావ వ్యక్తీకరణ (Communication) సామాజిక మెళకువలు, జిజ్ఞాసను పెంపొందిస్తారు.
eChamps ప్రోగ్రామ్ : 1 వ తరగతి నుండి 5 వ తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ప్రోగ్రామ్. దీనిలో విద్యార్థుల్లో సృజనాత్మకత, జిజ్ఞాసను పెంపొందించటం, కాన్సెప్టులపై అవగాహన కల్పించటంతో పాటు జీవిత నైపుణ్యాలతో కూడిన ఓ సమగ్రమైన పునాదిని అందిస్తుంది. యాక్టివిటీ-బేస్డ్ మరియు ప్రయోగపూర్వక విద్యాభ్యాసానికి ప్రాధాన్యత ఇస్తుంది. మ్యాథ్స్, సైన్స్‌లలో సబ్జెక్టు ఫండమెండల్స్ బలంగా నాటుకుపోయేలా శిక్షణ అందిస్తారు. పోటీ ప్రపంచం విసిరే సవాళ్ళను సమర్థవంతంగా ఎదుర్కొనేలా తీర్చిదిద్దుతుంది.
eTechno ప్రోగ్రామ్ : 6 వ తరగతి నుండి 10 వ తరగతి విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంపొందిందించేందుకు రూపొందించిన ప్రోగ్రామ్. విద్యానైపుణ్యంతో పాటు సంపూర్ణ ఎదుగుదలను మేళవించి విద్యార్థుల సమగ్రవికాసానికి దోహదపడుతుంది. విమర్శనాత్మక ఆలోచన, సృజనాత్మకత, విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించటం ఈ ప్రోగ్రామ్ ýక్ష్యం. భవిష్యత్ పోటీ ప్రపంచానికి బాటలు వేసే అత్యాధునిక సిలబస్. విశ్లేషణాత్మక ఆలోచన, సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంపొందించడం ద్వారా విద్యార్థులను భావి సైంటిస్టులుగా, ఇంజనీర్లుగా, నాయకులుగా తీర్చిదిద్దటం ఈ ప్రోగ్రామ్ ఉద్ధేశ్యం.
Olympiad ప్రోగ్రామ్ : 6 వ తరగతి నుండి 12 వ తరగతుల వరకు ఉన్నల లక్ష్యాలను సాధించి తీరాలనుకునే విద్యార్థులను ఉద్ధేశించి రూపొందించిన ప్రోగ్రామ్. విద్యార్థులలో విమర్శనాత్మక ఆలోచనా విధానం, సమస్య పరిష్కార సామర్థ్యాలు మరియు పోటీతత్వాన్ని పెంపొందించడానికి జాగ్రత్తగా రూపొందించిన ఒక ప్రయాణం. క్రమబద్ధమైన మద్దతు, పాఠ్యప్రణాళికకు అనుగుణంగా మార్పులు మరియు నిరంతర అభిప్రాయ సేకరణ ద్వారా, ఇది విద్యార్థులను సవాళ్లను స్వీకరించడానికి మరియు వారి పరిమితులను అధిగమించడానికి శక్తినిస్తుంది.
మైక్రో-షెడ్యూల్ - క్రమశిక్షణతో కూడిన ప్రణాళిక
నారాయణ ప్రత్యేకతల్లో అత్యంత విశిష్టమైనది మైక్రో-షెడ్యూల్. ఏ రోజు ఏ అంశం బోధించాలి? ఏ టాపిక్‌పై విద్యార్థి ప్రాక్టీస్ చేయాలి? అనే ప్రణాళిక ఏడాది ప్రారంభంలోనే రూపొందుతుంది.దీనివల్ల పరీక్షల సమయంలో విద్యార్థులపై ఒత్తిడి పడకుండా రోజూవారీ పద్ధతిలో చదువు పూర్తవుతుంది. క్రమశిక్షణ, సమయపాలన సహజంగానే పిల్లల అలవాటుగా మారుతాయి.
స్కూల్ దశ నుంచే పటిష్ట పునాది
భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐఐటీ-జేఈఈ, నీట్ , సివిల్ సర్వీసెస్, సీఏ వంటి పరీక్షలతో పాటు ఒలింపియాడ్స్ (NTSE, Olympiads) కోసం ప్రత్యేక ఇంటిగ్రేటెడ్ శిక్షణ అందిస్తారు. కేవలం బోర్డు పరీక్షలకే పరిమితం కాకుండా, కాన్సెప్టులను లోతుగా నేర్పించడం వల్ల నారాయణ విద్యార్థులు జాతీయ స్థాయిలో అత్యున్నత ఆల్ ఇండియా ర్యాంకులు సాధిస్తున్నారు.
టెక్నాలజీ తోడుగా ఆధునిక విద్యాభ్యాసం !
డిజిటల్ యుగానికి తగినట్లుగా విద్యార్థుల కోసం అంతర్గతంగా రూపొందించిన సాంకేతిక నైపుణ్యం నారాయణ సొంతం.
nLearn యాప్: విద్యార్థులు క్లాసుల తర్వాత రివిజన్ చేసుకోవడానికి, యానిమేటెడ్ వీడియోలు, టెస్టులు, సెల్ఫ్-అసెస్మెంట్లకు ఉపయోగపడుతుంది.
AI-ఆధారిత పనితీరు విశ్లేషణ: విద్యార్థి ఏ సబ్జెక్టులో బలంగా ఉన్నాడు, ఎక్కడ వెనుకబడ్డాడు అనేది గుర్తించి, ప్రత్యేక రివిజన్ తరగతులు నిర్వహిస్తారు.
చదువుతో పాటు సమగ్ర వికాసం
కేవలం పుస్తకాలకే పరిమితం చేయకుండా పిల్లల శారీరక, మానసిక వికాసానికి సమ ప్రాధాన్యతనిస్తారు.
nSports: ప్రణాళికాబద్ధమైన క్రీడా శిక్షణ ద్వారా ఫిట్నెస్, టీమ్‌వర్క్ అలవరుస్తారు.
క్లబ్ కార్యక్రమాలు & ప్రసంగ నైపుణ్యాలు: మాస్టర్ ఒరేటర్ (Master Orator), క్విజ్ విజార్డ్స్, ఆర్ట్ మరియు కల్చరల్ ఈవెంట్ల ద్వారా నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి.
భద్రత, పర్యవేక్షణ మరియు వ్యక్తిగత శ్రద్ధ
ప్రతి తరగతిలో స్టూడెంట్ & టీచర్ నిష్పత్తిని సమతుల్యంగా ఉంచుతూ ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ వహిస్తారు. క్యాంపస్‌లలో సీసీటీవీ నిఘా, పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా చర్యలు తీసుకుంటారు. స్కూల్ బస్‌లకు జీపీఎస్ (GPS Tracking) సదుపాయం కల్పించి, విద్యార్థుల రాకపోకలను తల్లిదండ్రులు నిరంతరం ట్రాక్ చేసే భరోసా కల్పిస్తున్నారు.
రికార్డు స్థాయి ఫలితాలు
47 ఏళ్లకు పైగా విద్యాచరిత్రలో ఏటేటా తనకు తానే పోటీ అన్నట్లు తన రికార్డులను తానే తిరగరాస్తోంది నారాయణ. బోర్డు పరీక్షల్లో స్టేట్/నేషనల్ టాప్ ర్యాంకులు, ఒలింపియాడ్స్ మరియు తర్వాతి దశల్లో జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక కాలేజీల్లో సీట్లు సాధించడంలో నారాయణ సాధించిన రికార్డులే తల్లిదండ్రుల నమ్మకానికి అసలైన గ్యారెంటీ. పిల్లలకు చదువులో క్రమశిక్షణ, స్పష్టమైన లక్ష్యం, అత్యుత్తమ కెరీర్‌కు అవసరమైన పునాది ఒకే చోట లభిస్తుందనే ఏకైక నమ్మకంతోనే తల్లిదండ్రులు నారాయణ స్కూల్స్ అడ్మిషన్ల కోసం క్యూ కడుతున్నారు.



