Education : భవిష్యత్తు లేని చదువులతో వేగేదేలా ?

0
  • AI యుగంలో విద్యకు కొత్త దిశ!
  • ర్యాంకులు, సీట్లు, ప్యాకేజీలే భవిష్యత్తుకు హామీ కాదు. 
  • స్కూళ్లు, కోచింగ్ కేంద్రాలు మారాల్సిన సమయం

పిల్లలను బాగా చదివిస్తే మంచి ఉద్యోగం వస్తుంది.. మంచి ఉద్యోగం వస్తే జీవితానికి భద్రత ఉంటుంది” ఇప్పటివరకు చాలామంది తల్లిదండ్రులు అనుసరించిన సాధారణ ఆలోచన ఇది. అందుకే మంచి స్కూల్, తర్వాత IIT లేదా NEET కోచింగ్, మంచి ర్యాంక్, ప్రముఖ కాలేజీ, చివరికి మంచి ఉద్యోగం అనే విద్యా ప్రయాణాన్ని లక్షలాది కుటుంబాలు ఎంచుకుంటున్నాయి. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఉద్యోగాల స్వభావం, అవసరమైన నైపుణ్యాలు, పని చేసే విధానాలు మారుతున్నాయి. దీంతో విద్యా వ్యవస్థ ముందున్న ప్రశ్న కూడా మారుతోంది. “ఎన్ని మార్కులు సాధించాడు? ఎంత ర్యాంకు సాధించాడు ? అనే ప్రశ్నలతో పాటు “మారుతున్న ప్రపంచంలో ఈ విద్యార్థి ఎంతవరకు నిలబడగలడు? అనే ప్రశ్న ఇప్పుడు మరింత కీలకంగా మారుతోంది.

లక్షలు ఖర్చు చేసి చదివిస్తే ఉద్యోగం గ్యారెంటీనా?

ఇదే ఇప్పుడు తల్లిదండ్రుల ముందున్న అసలు సందేహం. IITలో చదివితే ఉద్యోగం ఖాయం, వీదీదీS చేస్తే కెరీర్ పదిలం, ప్రముఖ కాలేజీలో సీటు వస్తే అధిక జీతం గ్యాంరెంటీ అనే ఆలోచన గతంలో బలంగా ఉండేది. అయితే నేటి పరిస్థితుల్లో ఏ విద్యార్హత కూడా జీవితాంతం ఉద్యోగ భద్రతకు ఆటోమేటిక్ గ్యారెంటీ కాదు.

అదే సమయంలో AI యుగంలో IIT చదవడం వృథా”, “NEET కోచింగ్‌కు విలువ లేదు”, “ఇంజినీరింగ్ లేదా మెడిసిన్‌కు భవిష్యత్తు లేదు” అని చెప్పడం కూడా పూర్తిగా తప్పు. IIT, ఇంజినీరింగ్, MBBS, మెడిసిన్ వంటి విద్యకు ఇప్పటికీ విలువ ఉంటుంది. కానీ వాటితో పాటు నిరంతరం కొత్త నైపుణ్యాలు నేర్చుకునే సామర్థ్యం కూడా అవసరం. IIT, NEET వంటి ప్రవేశ పరీక్షలు కెరీర్‌కు ముఖద్వారం మాత్రమే.. అంతిమ గమ్యం కాదు అని ప్రతి ఒక్కరూ గమనించాలి.

IIT-NEET ఫౌండేషన్ విధానాన్ని పునరాలోచించాల్సిందే!

తెలుగు రాష్ట్రాల్లో స్కూల్ స్థాయి నుంచే IIT, NEET ఫౌండేషన్ పేరుతో విద్యార్థులను పోటీ పరీక్షలకు సిద్ధం చేసే విధానం బాగా విస్తరించింది. ఇది విద్యార్థులకు పోటీ పరీక్షల ప్రాథమిక సన్నద్ధతలో ఉపయోగపడవచ్చు. అయితే స్కూల్ విద్య మొత్తం మార్కులు, ర్యాంకులు, ప్రవేశ పరీక్షల చుట్టూనే తిరగడం ఎంతవరకు సమంజసం? అనే ప్రశ్నను ఇప్పుడు పరిశీలించాల్సిన అవసరం ఉంది. స్కూళ్లు కేవలం పరీక్షల కోసం విద్యార్థులను తయారు చేయడం కాకుండా భవిష్యత్ జీవితానికి సిద్ధం చేయాలి.

స్కూళ్లు తీసుకోవాల్సిన ముఖ్యమైన చర్యలు

AIపై ప్రాథమిక అవగాహన

8 వ తరగతి నుంచే AI అంటే ఏమిటి? దాని ఉపయోగాలు ఏమిటి? పరిమితులు ఏమిటి? AI ఇచ్చే సమాచారాన్ని ఎలా ధృవీకరించాలి? వంటి అంశాలపై వయస్సుకు అనుగుణంగా అవగాహన కల్పించాలి.

కంఠస్థ (బట్టి) విద్య నుంచి సమస్య పరిష్కారానికి

సమాధానాలను కంఠస్థం చేయడం కంటే ఒక సమస్యను అర్థం చేసుకుని పరిష్కారం కనుగొనే విధానానికి ప్రాధాన్యం ఇవ్వాలి.

క్రిటికల్ థింకింగ్, కమ్యూనికేషన్, క్రియేటివిటీ

విద్యార్థుల్లో ఆలోచనా సామర్థ్యం, ప్రశ్నించే స్వభావం, కమ్యూనికేషన్, సృజనాత్మకత, టీమ్‌వర్క్ వంటి నైపుణ్యాలను పెంచాలి.

ప్రాజెక్టులు, ప్రయోగాలకు ప్రాధాన్యం

పుస్తకంలోని పాఠాన్ని పరీక్ష కోసం మాత్రమే చదవకుండా, దాన్ని వాస్తవ జీవిత సమస్యలకు ఎలా అన్వయించాలో నేర్పాలి.

 AIని నిషేధించడం కాదు.. బాధ్యతగా ఉపయోగించడం నేర్పాలి

విద్యార్థులు AIపై పూర్తిగా ఆధారపడకుండా, దాన్ని ఒక సహాయక సాధనంగా ఉపయోగించుకోవడం, వచ్చిన సమాచారాన్ని పరిశీలించడం, స్వయంగా ఆలోచించడం నేర్పాలి.

కెరీర్ అవగాహన ముందుగానే కల్పించాలి

ఇంజినీరింగ్, మెడిసిన్‌తో పాటు AI, డేటా, సైబర్ సెక్యూరిటీ, డిజైన్, ఫైనాన్స్, పరిశోధన, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ప్రభుత్వ సేవలు వంటి విభిన్న రంగాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలి.

తల్లిదండ్రులతో పారదర్శకమైన కెరీర్ కౌన్సెలింగ్

మా స్కూల్ నుంచి ఇన్ని ర్యాంకులు” అనే ప్రచారంతో పాటు, విద్యార్థి ఆసక్తి, సామర్థ్యం, భవిష్యత్ అవకాశాలపై తల్లిదండ్రులతో వాస్తవికంగా చర్చించే విధానం ఉండాలి.

కోచింగ్ కేంద్రాల బాధ్యత కూడా మారాలి

IIT, NEET వంటి పోటీ పరీక్షల్లో మంచి ర్యాంక్ సాధించేందుకు కోచింగ్ సంస్థల పాత్ర ముఖ్యమే. కానీ ర్యాంక్ వచ్చిన రోజుతో కోచింగ్ సంస్థ బాధ్యత ముగిసిపోతుంది అనే ఆలోచనను కూడా బయటపడాల్సిన అవసరం ఉంది.

కోచింగ్ సంస్థలు ఏం చేయాలి?

విద్యార్థులు కేవలం ర్యాంకులకే పరిమితం కాకుండా నైపుణ్యాలపై దృష్టి పెట్టేలా చర్యలు తీసుకోవాలి. క్రిటికల్ థింకింగ్, సమస్య పరిష్కారం, కమ్యూనికేషన్, స్వీయ అభ్యాసం వంటి నైపుణ్యాలను పెంపొందించాలి. ఏఐని బాధ్యతాయుతంగా ఉపయోగించడం, దాని సమాచారాన్ని ధృవీకరించడం, స్వతంత్రంగా ఆలోచించడం వంటి అంశాల్లో విద్యార్థులకు అవగాహన కల్పించాలి. జీజుజు/చీజుజుT ర్యాంక్ ఆధారంగా మాత్రమే నిర్ణయం తీసుకోకుండా విద్యార్థి ఆసక్తి, సామర్థ్యం, లక్ష్యాలను పరిగణనలోకి తీసుకుని మార్గనిర్ధేశకత్వం ఇవ్వాలి. మా సంస్థ నుంచి ఇన్ని ర్యాంకులు”, “మా విద్యార్థికి ఇంత ప్యాకేజీ” వంటి ప్రకటనలు చేసేటప్పుడు ఫలితాల నేపథ్యం, సంవత్సరం, విద్యార్థుల సంఖ్య వంటి వివరాల్లో సాధ్యమైనంత పారదర్శకత ఉండాలి. కాలేజీ ఎంపిక, ఉన్నత విద్య, పరిశోధన, టెక్నాలజీ నైపుణ్యాలు, ఇంటర్న్‌షిప్‌లు, భవిష్యత్ కెరీర్ అవకాశాలపై కూడా మార్గదర్శకత్వం ఇవ్వాలి. ర్యాంకుల కోసం అధిక ఒత్తిడికి బదులుగా సమయ నిర్వహణ, విశ్రాంతి, ఆరోగ్యం, చదువు, నైపుణ్యాల మధ్య సమతుల్యతకు ప్రాధాన్యం ఇవ్వాలి.

కోచింగ్ రంగం తనను తాను ప్రశ్నించుకోవాల్సిన సమయం

ఇకపై కోచింగ్ సంస్థల విజయాన్ని కేవలం ‘ఎన్ని ర్యాంకులు సాధించించాం? అనే ప్రశ్నతోనే కాకుండా,మారుతున్న ప్రపంచానికి ఎంతమంది విద్యార్థులను సిద్ధం చేశాం? అనే ప్రశ్నతో కూడా అంచనా వేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రేపటి పోటీ కేవలం జీజుజు లేదా చీజుజుT పరీక్షలో ఉండకపోవచ్చు. కొత్త విషయాలను ఎంత వేగంగా నేర్చుకోగలరు? AIతో కలిసి ఎలా పనిచేయగలరు? మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా తమను తాము ఎలా మార్చుకోగలరు? అనేవి కూడా విద్యార్థుల భవిష్యత్ ప్రయాణంలో కీలకంగా మారనున్నాయి.

తల్లిదండ్రులు ఏం ఆలోచించాలి?

తెలుగు రాష్ట్రాల్లో తల్లిదండ్రులు కూడా ఇప్పుడు ఒకసారి ఆగి ఆలోచించాల్సిన సమయం వచ్చింది. పిల్లల చదువుపై లక్షలు ఖర్చు పెట్టడం తప్పు కాదు. కానీ ఏ చదువు ఎందుకు చదివిస్తున్నాం? ఆ చదువుతో పాటు ఏ నైపుణ్యాలు నేర్పిస్తున్నాం? పిల్లలకు నిజంగా ఆ రంగంపై ఆసక్తి ఉందా? భవిష్యత్‌లో కొత్త విషయాలు నేర్చుకునే సామర్థ్యం ఉందా? అనే ప్రశ్నలు కూడా అడగాలి. కేవలం ర్యాంక్, కాలేజీ పేరు, ప్రారంభ ప్యాకేజీ ఆధారంగా పిల్లల మొత్తం భవిష్యత్తును అంచనా వేయకూడదు. అలాగే AI వస్తోందని పిల్లలను సంప్రదాయ విద్య నుంచి పూర్తిగా దూరం చేయడం కూడా సరైన నిర్ణయం కాదు.

సరైన మార్గం విద్యను వదిలేయడం కాదు.. విద్యను కొత్త ప్రపంచానికి అనుగుణంగా మార్చడం.

ఇక మాటలు కాదు.. కార్యాచరణ అవసరం!

AI ప్రభావంపై చర్చలు జరగడం మాత్రమే సరిపోదు. స్కూళ్లు, కోచింగ్ సంస్థలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యావిధాన రూపకర్తలు కలిసి విద్యార్థిని పరీక్షకు మాత్రమే కాకుండా జీవితానికి సిద్ధం చేసే విధానాన్ని రూపొందిల్సిన అవసరం ఉంది. స్కూళ్లు నైపుణ్య ఆధారిత విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలి. కోచింగ్ సంస్థలు ర్యాంకులతో పాటు భవిష్యత్ నైపుణ్యాలపై దృష్టి పెట్టాలి.  తల్లిదండ్రులు ర్యాంకుల కంటే పిల్లల సామర్థ్యాన్ని అర్థం చేసుకోవాలి.  విద్యార్థులు ఒక డిగ్రీతో తమ విద్య పూర్తయిందని భావించకుండా నిరంతరం నేర్చుకోవాలి.

చివరికి ఒకే మాట...

IIT చదవడం వృథా కాదు. NEET కోచింగ్ విలువలేనిది కాదు. MBBS లేదా ఇంజినీరింగ్‌కు భవిష్యత్తు లేదనడం కూడా సరికాదు.అయితే IIT సీటు = జీవితాంతం ఉద్యోగం కాదు.  వీదీదీS = జీవితాంతం కెరీర్ భద్రత కాదు.  ర్యాంక్ = జీవిత విజయం కాదు.  డిగ్రీ = జీవితాంతం సరిపడే నైపుణ్యం కాదు. ఎంట్రన్స్ ఎగ్జామ్ ఒక ముఖద్వారం మాత్రమే.. కెరీర్ అనేది నిరంతర ప్రయాణం. AI యుగంలో అసలు విద్య అంటే మారుతున్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం, కొత్త విషయాలను నేర్చుకోవడం, టెక్నాలజీతో కలిసి పనిచేయడం, అవసరమైనప్పుడు తనను తాను మార్చుకోవడం.

ప్రపంచం మార్పు దశలో ఉంది. తల్లిదండ్రులు కూడా ఒక నిర్ణయాత్మక దశలో ఉన్నారు. అందుకే ఇక “మా పిల్లలకు ఏ ర్యాంక్ వస్తుంది?” కాదు..  ‘రేపటి ప్రపంచంలో మా పిల్లలు తమను తాము నిలబెట్టుకోగలరా?

ర్యాంక్ ఒక దశ మాత్రమే.. మారుతున్న ప్రపంచంలో నిలబడగల సామర్థ్యమే అసలు విద్య.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !