Vijayawada : మరోసారి పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం !

0

విజయవాడలోని విద్యాధరపురం ఏరియాలోని దళవాయి సుబ్బరామయ్య మున్సిపల్ హైస్కూల్ (డీఎసఎంసిహెచ్)లో 1992 - 93 ఎస్.ఎస్.సి. బ్యాచ్ కు చెందిన విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. పదో తరగతి పూర్తైన 33 ఏళ్ల అనంతరం విద్యార్థులు తిరిగి అదే వేదికపై కలిశారు. ఆత్మీయ పలకరింపులు, యోగక్షేమాలతో సమావేశం ఆధ్యంతం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. 50 మందికి పైగా వివిధ రంగాల్లో ఎక్కడెక్కడో స్థిరపడి సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన అందరూ ఒక్క చోటకు చేరడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ చిన్నపిల్లల్లా అల్లరి చేశారు. పాఠశాల పూర్తైన 33 ఏళ్ల తరువాత కలిసిన సంతోషంతో ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. 

పండుగవాతావరణంలో ఆత్మీయ కలయిక ! 

ఇన్ని సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థుల కలయికతో వి.యం.సి. ఫంక్షన్ హాల్‌లో పండుగ వాతావరణం నెలకొంది. తమ చిన్ననాటి స్మృతులు, పాఠశాలలోని తమ అనుభవాలను పూర్వ విద్యార్థులు స్మరించుకున్నారు. అప్పటి తెలుగు ఉపాధ్యాయులు శర్మ, రాధాకృష్ణమÖర్తి, వై.ఎస్.ఆర్. ఆంజనేయులు బోధనా శైలి, తెలుగు తరగతి గదిలో చేసే అల్లరి, వారు దండించిన విధానం ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకుని పూర్వవిద్యార్థులందరూ ఒక్కసారి భావోధ్వేగానికి గురైయ్యారు. విద్యాభ్యాసం నాటి జ్ఞాపకాలను ఒక్కొక్కటిగా గుర్తు చేసుకున్నారు. విద్యతో పాటు మంచిచెడులు బోధించిన ఉపాధ్యాయులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యేకంగా అప్పటి స్కూల్ టాపర్ అయినటువంటి కె.దుర్గా సత్యవాణి తెలుగు వాచకంలోని పద్యభాగం, గద్యభాగంలోని వివిధ అంశాలపై క్విజ్ నిర్వహించి అందరిని 10 తరగతి రోజులకి తీసుకెళ్ళారు. ఈ కార్యక్రమం ఆధ్యంతం ఆహ్లాదంగా జరిగింది. చిన్ననాటి స్నేహితులను కలవాలని ప్రయత్నించి చివరి క్షణంలో ఫంక్షన్‌కు రాలేకపోయిన పూర్వవిద్యార్థులు వాట్సప్ ద్వారా తమ సందేశాలను చేరవేశారు. ఫంక్షన్‌లో తమ ఆత్మీయ మిత్రులతో గడిపే మధుర క్షణాలను మిస్ అయ్యామనే భావన వ్యక్తపరిచారు. భవిష్యత్తులో పాఠశాలకు మరియు తోటి స్నేహితులకు అవసరమైన సందర్భంలో తమ వంతుగా సాయం అందించేందుకు పూర్వ విద్యార్థులు నిర్ణయించారు. దాది మహేష్, ముజీబ్ పాషా, అన్నవరపు మురళి, కె. నాగరాజు, యం. వెంకట్‌రెడ్డి, రమేష్, మరియు టి.కె.ఎన్.వి. ప్రసాద్ తదితర పూర్వ విద్యార్థులు కార్యక్రమాన్ని ముందుండి నడిపించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !