Nalgonda : మిర్యాలగూడలో ఘోర రోడ్డు ప్రమాదం...సాయం చేయబోయిన వ్యక్తి దుర్మరణం !

0
మిర్యాలగూడలో ఓ ట్యాంకర్ బీభత్సం సృష్టించింది. నందిపాడు బైపాస్ వద్ద అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిపై వేగంగా దూసుకొచ్చిన ట్యాంకర్.. కారు, అంబులెన్స్ సహా ఐదు వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.

ఓ గ్యాస్ లారీ భీభత్సం 

ప్రత్యక్ష సాక్షి తెలిపిన వివరాల ప్రకారం.. అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిపై రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. రక్తమోడుతూ కదలలేని స్థితిలో ఉన్నాడు. శ్వాస ఆడుతుందా లేదా అని గమనించిన సాటి కారు ప్రయాణీకులు దిగి రోడ్డుకి అడ్డంగా సిగ్నల్ బోర్డ్‌లు పెట్టి 108, హైవే పోలీసులకు తెలియజేయటం జరిగింది. స్పందించిన అంబులెన్స్ సిబ్బంది 5 నిమిషాల వ్యవధిలోని ప్రమాద స్థలికి చేరుకున్నారు. గాయపడిన వ్యక్తిని అంబులెన్స్‌లోకి ఎక్కించి ప్రాథమిక చికిత్స చేసేందుకు సిబ్బంది వివరాలు తీసుకునే లోపే మహీంద్ర కారును గుద్దుకుంటూ ఓ గ్యాస్ లారీ భీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చిన గ్యాస్ ట్యాంకర్ లారీ మహీంద్రా కారుతో పాటు మరో 5 కార్లను తీవ్రంగా ఢీ కొట్టింది. క్షణాల్లో జరిగిన ఈ సంఘటనలో ట్యాంకర్ లారీ డ్రైవర్ తప్పించుకునే వెళ్లిపోయేందకు ప్రయత్నించారు. లారీని రివర్స్ తీసుకునేందుకు ప్రయత్నించగా లారీ చక్రాల క్రింద పడిన వ్యక్తి మీదగా వెనక్కి వెళ్ళి మళ్ళీ ఆయన మీదుగా ముందుకు వచ్చింది. దీనితో ఆయన అక్కడికి అక్కడే మరణించటం జరిగింది. ప్రమాద తీవ్రత పెరిగే సరికి అంబులెన్స్‌లోని సిబ్బంది, బాధితుడికి సైతం దెబ్బలు తగిలాయి. ఆ వెంటనే ఒకదానితో ఒకటి వాహనాలు ఢీ కొని ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం జరిగింది.

గాయపడిన వ్యక్తికి సాయం చేయబోయి..

హీరోీVAండా స్పెండర్ బైక్ మీద నుండి రోడ్డు ప్రమాదానికి గురి అయ్యి తల నుండి తీవ్ర రక్త స్రావం జరుగుతున్న వ్యక్తిని కాపాడేందుకు మొదటగా కారు ఆపి, ఆ వ్యక్తి కోసం తాపత్రయ పడి సాయం అందించే క్రమంలో ఆంధ్రప్రదేశ్ పొన్నూరుకు చెందిన పోలినేని శ్రీనివాసరావు (36) గ్యాస్ లారీ చక్రాల క్రింద పడి నలిగిపోయి ప్రాణాలు కోల్పోవటం అత్యంత హృదయ విదారక సంఘటనగా ప్రత్యక్షసాక్షి తెలిపారు. ఆకస్మాత్తుగా జరిగిన ఆ సంఘటనలో ఉన్న పలువురు షాక్ గురైయ్యారు. అందరూ తమ వారు జాగ్రత్తగా ఉన్నారా లేరా వెతుక్కోవటం కనిపించింది. ఒక మహిళ తన భర్త ఆచూకీ కోసం పెట్టిన ఆర్తనాదాలు పలువురిని కదిలించాయి. 

పోలీసుల విచారణ

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మృతుడిని ఆంధ్రప్రదేశ్‌లోని పొన్నూరుకు చెందిన శ్రీనివాసరావుగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై మిర్యాలగూడ టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ట్యాంకర్ డ్రైవర్ అతివేగం, నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమా? లేదా ఇతర కారణాలు ఉన్నాయా? అనే కోణంలో విచారణ చేస్తున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !