- సెప్టెంబర్ 6న విజయవాడ DSMCH పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
- సహచర మిత్రుల ఆచూకీ కోసం ఎడతెగని ప్రయత్నం!
విజయవాడ విద్యాధరపురం ప్రాంతంలోని దళవాయి సుబ్బరామయ్య మున్సిపల్ హైస్కూల్ (డీఎసఎంసీహెచ్) 1992--93 విద్యా సంవత్సరానికి చెందిన 10వ తరగతి పూర్వ విద్యార్థుల రెండో ఆత్మీయ సమ్మేళనం సెప్టెంబర్ 6, 2026న ఘనంగా నిర్వహించనున్నట్లు ఆహ్వాన కమిటీ సభ్యులు తెలిపారు. ఈ బ్యాచ్‌కు చెందిన విద్యార్థినీ, విద్యార్థులు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తమ చిన్ననాటి మిత్రులను కలుసుకునేందుకు తప్పక ఈ ఆత్మీయ సమ్మేళనానికి హాజరుకావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం భవానిపురం, హెచ్‌బీ కాలనీలోని వీఎంసీ ఏ/సీ ఫంక్షన్ హాల్‌లో ఉదయం 9 గంటల నుంచి ప్రారంభం కానుంది. రీయూనియన్ ఏర్పాట్లపై ఇప్పటికే సమావేశం నిర్వహించినట్లు నిర్వాహకులు దాది మహేష్, అన్నవరపు మురళి, ముజీబ్ పాషా, గంగాధర్ (USA), ఆర్‌టీసీ నాగరాజు, శ్రీను, ఖాసీం, వినోద్ పాల్, రమేష్, టి.కె.ఎన్.వి. ప్రసాద్ తదితరులు తెలిపారు.
మరికొందరి కోసం అన్వేషణ!
ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్న గునుకుల శ్రీను, దాది మహేష్ మాట్లాడుతూ, ఇప్పటివరకు 80 మందికి పైగా పూర్వ విద్యార్థుల ఆచూకీ లభించిందని తెలిపారు. ఇంకా అందుబాటులోకి రాని సహచర మిత్రుల కోసం వార్తాపత్రికలు, సోషల్ మీడియా తదితర మాధ్యమాల ద్వారా నిరంతరం ప్రయత్నిస్తున్నామని చెప్పారు. 1992--93 బ్యాచ్‌కు చెందిన ఎవరైనా మిత్రులు లేదా వారి కుటుంబ సభ్యులకు ఈ సమాచారం తెలిసినట్లయితే, వెంటనే క్రింది నంబర్లలో సంప్రదించాలని కోరారు: 99598 33139, 93474 44377
గురువులకు ఘన ఆహ్వానం
తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులైన అన్నవరపు బాబురావు గారు, శోభనా చలపతిరావు గారు, రామరాజు గారు, ఝాన్సీ గారులను ఇప్పటికే కలిసి ఈ ఆత్మీయ సమ్మేళనానికి ఆహ్వానించినట్లు నిర్వాహకులు తెలిపారు. చిన్ననాటి మిత్రులందరినీ మరోసారి కలుసుకుని ఆనందంగా గడపాలని, పాఠశాల రోజులలోని మధురమైన జ్ఞాపకాలను నెమరువేసుకోవాలని ప్రతి ఒక్కరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారని చెప్పారు. ఇంకా అందుబాటులోకి రాని మిత్రులందరూ స్పందించి, ఈ ఆత్మీయ కలయికలో భాగస్వాములు కావాలని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.
రెండోసారి... మనసుల కలయిక! ️
గత సంవత్సరం ఆగస్టు 17న, 32 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత తొలిసారిగా 1992--93 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఆ సందర్భంగా ఆర్థికంగా వెనుకబడిన మిత్రులకు తోటి మిత్రులంతా కలిసి అండగా నిలిచారు. అదే స్ఫూర్తితో కష్టకాలంలో ఉన్న మిత్రులను ఆదుకోవడంతో పాటు, సేవా కార్యక్రమాలను చేపట్టడంలోనూ ఈ పూర్వ విద్యార్థుల సంఘం ముందంజలో కొనసాగుతోంది.
చిన్ననాటి స్నేహం... జీవితాంతం అనుబంధం!️
మళ్లీ ఒక్కచోట... మళ్లీ అదే ఆప్యాయత!
సెప్టెంబర్ 6న అందరం కలుద్దాం...
జ్ఞాపకాల పండుగ చేసుకుందాం!

