తెలంగాణ ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌తో 26 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు... త్వరలో వాళ్లంతా కాంగ్రెస్‌లో చేరతారని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తమ పార్టీలోకి భారీగా చేరికలు ఉంటాయన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కూడా సీఎం రేవంత్ అందుబాటులో ఉంటున్నారని చెప్పారు. ఇంకో నాలుగు గేట్లు తెరిస్తే బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీల్లో ఒక్కరు కూడా మిగలరన్నారు. రెండు పార్టీలు ఖాళీ అవుతాయన్నారు. గతంలో తెలంగాణలో గడీల పాలన కొనసాగిందని.. ప్రస్తుతం ప్రజా పాలన కొనసాగుతోందన్నారు. ఇప్పటికే గేట్లు తెరిచామని కాంగ్రెస్ ట్వీట్ చేసిన మరుసటి రోజే ఖైరతాబాద్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్..చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. హైదరాబాద్ లోని చాలా మంది కార్పొరేటర్లు కాంగ్రెస్‌లో జాయిన్ అయ్యారు. నిన్న కంటోన్మెంట్ బీజేపీ ఇన్ చార్జ్ శ్రీ గణేష్ కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. జిల్లాలోనూ బీఆర్‌ఎస్ కు చెందిన నేతలు కాంగ్రెస్ లో చేరుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఒక్క గేటు తెరిస్తేనే బీఆర్‌ఎస్ ఉక్కిరిబిక్కిరి అవుతుందని అన్ని గేట్లు తెరిస్తే ఆ పార్టీకి ఎంపీ అభ్యర్థులు కూడా దొరకరన్నారు.
Telangana : బీర్ల ఐలయ్య సంచలన వ్యాఖ్యలు ! ఆ పార్టీల్లో ఒక్కరూ మిగలరు !!
మార్చి 20, 2024
0
Tags