AP POLITRICKS : చంద్రబాబు పద్మవ్యూహాన్ని జగన్‌ చేధించగలరా ?

0

జగన్‌ వ్యతిరేక శక్తులను ఒకే వేదికపైకి చేర్చి, కూటమి కట్టడంలో చంద్రబాబు సఫలమయ్యారు. ఇక జగన్‌ శక్తులను ఒక్కొక్కటిగా నిర్విర్యం చేసే పనిలో చంద్రబాబు తన రాజకీయ చాణక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. జనగ్‌ను అన్ని వైపుల నుండి అష్టదిగ్బంధం చేస్తున్నారు. మరి ఇప్పుడు జగన్‌ ఏం చేయబోతున్నారు. చంద్రబాబు పద్మవ్యూహాంలో చిక్కుకుంటారా లేక చాకచక్యంగా బయట పడగలుతారా అన్నది చూడాలి. జగన్‌ చంద్రబాబును ఎదుర్కొనగలరా ? ఇప్పుడు ఏపీ పొలిటికల్‌ సర్కిల్లో ఈ విషయం మీదే బలమైన చర్చ నడుస్తోంది. జగన్‌ వ్యతిరేకులను ఏకతాటి పైకి తేవడంతో పాటు కేంద్ర ప్రభుత్వ అండదండలు లేకుండా చేయడంలో చంద్రబాబు సక్సెస్‌ అయ్యారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు పట్టు బిగిస్తుచారు.  గత ఎన్నికల్లో జగన్‌ విజయానికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా సానుభూతి విపరీతంగా పనిచేసింది. 2014 ఎన్నికల్లో తక్కువ మెజారిటీతో జగన్‌ అధికారాన్ని కోల్పోవడం ఒకటైతే.. వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు తీసుకోవడం కూడా ఒక కారణం. అయినా వెన్నుచూపకుండా సుదీర్ఘ పాదయాత్రతో ప్రజలకు చేరువ అయ్యారు. వై.ఎస్‌. రాజశేకర్‌ రెడ్డి మాదిరిగానే జగన్‌ కూడా మేలు చేకూర్చుతారని ప్రజలు విశ్వసించారు. అప్పటికే కేసుల రూపంలో జగన్‌ ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు చంద్రబాబు రాజకీయంగా దెబ్బతీశారు. ఈ పరిణామాల వల్ల జగన్‌ ప్రజల్లో సానుభూతి పొందగలిగారు. పైగా ఒకే ఒక్క అవకాశం అంటూ అడిగిన తీరుతో ప్రజలు మెత్తబడ్డారు. ఎన్నికల ముంగిట వివేకానంద రెడ్డి హత్య సైతం సానుభూతి తెచ్చిపెట్టింది. మరోవైపు ఎన్డీఏ నుంచి తెలుగుదేశం పార్టీ బయటకు వెళ్లడం.. బిజెపిని విభేదించడం కూడా వైసీపీకి కలిసి వచ్చింది.

సానుభూతి రివర్స్‌ కాబోతుందా

అయితే గత ఎన్నికల్లో వైసీపీకి కలిసి వచ్చిన అంశాలను ఒక్కొక్కటిగా దూరం చేయడంలో చంద్రబాబు సక్సెస్‌ అయ్యారనే చెప్పాలి. ముఖ్యంగా వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో జగన్‌ వైఖరి చంద్రబాబుకు అస్త్రం ఇచ్చినట్లు అయ్యింది. గత ఎన్నికల్లో అదే హత్య కేసును అడ్డం పెట్టుకుని జగన్‌ సానుభూతి పొందారు. ఒకానొక దశలో నారాసుర రక్త చరిత్ర అంటూ తన సాక్షిలో రాసుకొచ్చారు. ఇప్పుడు అదే కేసులో జగన్‌ వైపు అందరివేళ్ళు చూపిస్తున్నాయి. ముఖ్యంగా వైఎస్‌ కుటుంబం అనుమానం పడేలా పరిస్థితులు దాపురించాయి. ఈ పరిస్థితుల్లో సోదరి షర్మిల, వివేక కుమార్తె సునీతను.. జగన్‌ పై ప్రయోగించడంలో చంద్రబాబు సక్సెస్‌ అయ్యారు. ఈ అంశం తప్పకుండా ఎన్నికల్లో ప్రభావితం చేస్తుందని ఆశిస్తున్నారు. కడపలో వైసీపీకి ఎదురుదెబ్బ తలిగే అవకాశం ఉందని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.

రెండోసారి అంత ఈజీ కాదు. 

అన్నింటికీ మించి జగన్‌ పై పవన్‌ ను ఒక ఆయుధంలా చంద్రబాబు వాడుకుంటున్నారు. అదే సమయంలో బిజెపిని తమ వైపు తిప్పుకున్నారు. ఎన్నికల్లో గతం మాదిరిగా జగన్‌ కు ఎటువంటి సాయం అందకుండా చేసుకున్నారు. ప్రజలు మొదటిసారి అవకాశం ఇచ్చేటప్పుడు తండ్రి రాజశేకర్‌ రెడ్డిని దృష్టిలో పెట్టుకుని భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు 5 ఏళ్ళలో పరిపాలనలో జరిగిన మంచి, చెడులనే బేరీజు వేసుకుంటారు. ఎవరి పాలన మంచిగా ఉందో పోల్చుకుంటారు. ఎవరి పాలన మంచిగా ఉందో వారికే పట్టం కడతారు. జగన్‌ సంక్షేమ పథకాలను నమ్ముకుని అభివృద్ధి వైపు దృష్టి పెట్టకపోవటం కలిసొస్తే అంశంగా చంద్రబాబు పరిగణిస్తున్నారు. రోడ్లు అధ్వానంగా ఉండటం, పోలవరం ముందుకు కదలకపోవటం, ప్రత్యేక హోదా ఊసే లేకపోవటం, రాజధానుల విషయంలో గందరగోళం తలెత్తటం, మద్య నిషేధాన్ని అమలు చేయకపోగా నాణ్యత లేని మద్యాన్ని సరఫరా చేయటం వంటి అంశాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళబోతున్నారు. ఇప్పటికే విజనరీ లీడర్‌గా , అభివృద్ధికి బ్రాండ్‌గా పేరొందిన చంద్రబాబు సంక్షేమ పథకాలను కొనసాగించేందుకు జగన్‌ పథకాలకు ధీటుగా సూపర్‌ సిక్స్‌ పథకాలను ప్రకటించారు. ప్రజాకర్షణ మేనిఫెస్టోను రూపొందించే పనిలో పడ్డారు. ఇలా ఎలా తీసుకున్నా జగన్‌ చుట్టూ చంద్రబాబు పద్మవ్యూహాన్ని అల్లారు. మరీ జగన్‌ ఎలా చేధించగలరో, కాలమే నిర్ణయించాలి.  

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !