VIZAG : విశాఖలో రియల్ ఛీటర్

0

  • డబుల్ రిజిస్ట్రేషన్లతో కస్టమర్లను నయవంచన ! 
  • ఇప్పుడు ఎస్.ఎస్.సి. డెవలపర్స్ పేరుతో మనీ సర్యులేషన్ స్కామ్ !  
  • అసలు గుర్తింపే లేదు, డిపాజిట్లు సేకరించుకునేందుకు లైసెన్స్ లేదు. 
  • ఇప్పటికే 4 అడ్రస్‌లు మార్చిన పక్కా ఫ్రాడ్ కంపెనీ ! 

ఆయన చదివింది పదో తరగతి...అయినా మోసాలు చేయటంలో పీహెచ్‌డీ చేశారు. పెట్టుబడిదారుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని భారీగా రియల్ ఎస్టేట్ మోసాలకు పాల్పడ్డారు. ప్లాట్లను ఒకరికి అమ్మిన తర్వాత అదే ప్లాట్లను మళ్ళీ మరోకరికి విక్రయించి ఒకే కుటుంబంలోని 7 గురు వ్యక్తుల దగ్గర నుండి సుమారు 24.50 లక్షలను బాధితులను మోసగించాడు. కేవలం ఈ ఏడుగురితోనే సరిపెట్టలేదు అదే వెంచర్‌లో దాదాపు 70 నుండి 80 మంది బాధితులకు డబుల్ రిజిస్ట్రేషన్ చేసి కోట్లాది రూపాయలు దోచుకున్నారు. ఇలా మాయమాటలతో మభ్యపెట్టి కస్టమర్లను బురిడీ కొట్టించటంలో ఆయనకు ఆయనే సాటి. ప్రతి రెండు మÖడు సంవత్సరాలకు ఒకసారి చిరునామాను మారుస్తూ ఆయా ప్రాంతాల వాసులను ఆర్థికంగా దోచుకుంటున్న బుడారి లక్ష్మణ్ రావు గురించి ప్రత్యేక కథనం.

లక్ష్మణ్ రావు నేపథ్యం 

2014లో రియల్ ఎస్టేట్‌లోకి అడుగుపెట్టిన బుడారి లక్ష్మణ్ రావు నేపధ్యం అడుగడునా మోసాలతోనే ఎదిగారు. నమ్మిన కస్టమర్లను నిలువుదోపిడీ చేసి కోట్లు కూడబెట్టారు. రాజకీయ అండదండలతో బాధితులను బెదిరిస్తూ నాయకుడిగా చెలామణి అవుతున్నారు. విశాఖలో మధ్య తరగతి పెట్టుబడిదారుల నడ్డి విరుస్తూ ఆర్థిక దోపిడీదారుడిగా పేరుగడించారు. ఇక వివరాల్లోకి వెళితే విజయనగరం జిల్లాలోని భోగాపురం రిజిస్ట్రేషన్ పరిధిలోని పూసపాటిరేగ మండలం, గోవిందపురం గ్రామంలో సాయినగర్ అనే రియల్ ఎస్టేట్ వెంచర్ వేశారు శ్రీ సిద్ధేశ్వరి కన్‌స్ట్రక్షన్స్ Ê డెవలపర్స్ అధినేత బుడారి లక్ష్మణ్‌రావు. డబ్బు మీద వ్యామోహంతో కస్టమర్ దేవుళ్ళను ఛీట్ చేయటం మొదలు పెట్టారు. 2020 సంవత్సరంలో ఒకే కుటుంబానికి చెందిన 7 గురు వ్యక్తులు ఫ్లాట్‌లు కొనుగోలు చేశారు. కానీ మోసం ఉద్ధేశ్యతోనే వేరే వారికి అమ్మిన ఫ్లాట్లను వీరికి అంటగట్టి చేతులు దులుపుకున్నారు. తరువాత డబుల్ రిజిస్ట్రేషన్ అని తెలియటంలో బాధితులు తిరగబడటంతో మీ డబ్బులు తిరిగి ఇచ్చేస్తాను అని చెప్పి 3 నెలల గడువు విధించి రిటన్ అగ్రిమెంట్ చేశారు. దానికి సంబంధించి చెక్కులను ఇచ్చారు. కాలపరిమితి తీరకుండానే చెక్కులు బ్యాంకులో వేయగా, బౌన్స్ అయ్యాయి. ఇదేమిటనే బాధితులు అడుగగా ఏమి చేసుకుంటారో చేసుకోండి అని బెదిరింపులకు దిగటం గమనార్హం. 7 గురి వ్యక్తులలో ఒకరికి మాత్రమే కొద్ది కొద్దిగా డబ్బులు చెల్లిస్తూ వస్తున్నారు. మిగిలిన బాధితులు ఇంకా లక్ష్మణ్ రావు ఆఫీసు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. 

ఇవే కాదు, చాలా ఉన్నాయి ! 

అదే విధంగా తగరపువలసలో మÖలకుద్దు అనే సైట్ ఓనర్‌ని ఏమార్చి తన సైట్‌గా చూపించి కస్టమర్లకు అక్రమ రిజిస్ట్రేషన్లు చేశారు. అలాగే భీమునిపట్నంలోని శ్రీ సిద్ధేశ్వరి కన్‌స్ట్రక్షన్స్ & డెవలపర్స్ పేరు మీద నిర్మించిన అపార్ట్‌మెంట్‌లోని కొన్ని ప్లాట్లను సబ్ రిజిస్ట్రార్‌ను మేనేజ్ చేసి డబుల్ రిజిస్ట్రేషన్ చేసి కస్టమర్లను బురిడి కొట్టించినట్లు తెలుస్తోంది. రమణయ్య అనే బాధితులు మీడియాకి మొర పెట్టుకున్నారు. తగిన న్యాయం చేశాలని అధికారులను కోరారు. విశాఖపట్నంలోని షీలానగర్ పరిధిలో అనిల్ అనే వ్యక్తి లక్ష్మణ్ రావుకి చూపించగా, దానిని అనిల్ అనే వ్యక్తికి తెలియకుండా కస్టమర్లకు అమ్మేశారు. ఇలాంటి ఎన్నో ఛీటింగ్ పనులు చేసి రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టాలంటే భయపడే విధంగా విశాఖ వాసులను భయపెడుతున్నాడు.

ఇప్పుడు మనీ సర్కులేషన్ స్కామ్ ! 

ఈ కంపెనీ బాహాటంగా ఇస్తున్న హామీలు ఏ ఆర్థిక రంగానికి సాధ్యంకాని, అలవికాని రాబడులు అని స్పష్టం అవుతోంది. మా దగ్గర పెట్టుబడిపై వారానికోసారి 1% రాబడిని చెల్లింపులు చేస్తాం, అలాగే పెట్టుబడిని రెట్టింపు చేస్తాం అంటూ అలవికాని హామీలను గుప్పిస్తోంది ఎస్.ఎస్.సి.డెవలపర్స్. అలాగే ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే 200 రోజుల పాటు రోజుకు 0.5% రాబడి వస్తుందనే అంకెల గారడీతో మభ్యపెడుతున్నారు. ఏడాదికి బ్యాంకులు 6%-7% వడ్డీ ఇవ్వడానికే సతమతమవుతుంటే, వీరు వందల శాతంలో లాభాలు ఎలా ఇస్తారో చెప్పకపోవడం వెనుక పెద్ద కుట్ర దాగిఉందని స్పష్టమవుతోంది. ఇది పక్కాగా కొత్తగా చేరే వారి డబ్బులతో పాతవారికి చెల్లింపులు జరిపే ‘పొంజీ స్కీమ’ తరహా వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది.

పన్ను ఎగవేత 

ప్రజల నుండి కోట్లాది రూపాయలు దోచుకుంటున్నా ఆదాయపు పన్ను శాఖకు ఒక్క రూపాయి టాక్స్‌లు చెల్లించకపోవటం గమనార్హం. వ్యాపారం మీద కట్టాల్సిన అడ్వాన్స్ టాక్స్‌లు కట్టకపోగా, రిటన్స్ కూడా దాఖలు చేయకపోవటం విశేషం. పెట్టుబడిదారులను ముంచి ఇప్పటికే రూ. 20 కోట్లు వెనకేసుకున్నట్లు తెలుస్తోంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !