పోలవరం ఎప్పటికీ పూర్తయ్యేను ?

0

ఆంధ్రప్రదేశ్ కు పోలవరం ప్రాజెక్టు ఒక జీవనాడి లాంటిది, దేశానికి ఒక ఆస్తి లాంటిది. దాని సంపూర్తిపై నేడు నీలినీడలు కమ్ముకోవడం దురదృష్టకరం. చరిత్ర చూస్తే 1941లో ₹ 6.5 కోట్లతో ప్రతిపాదించబడి 1946కల్లా ముందు 208’ (836) తరువాత 198 అడుగుల(692 tmc) ఎత్తులో డిజైన్స్ అన్ని ఆమోదించబడి, అనుమతులు పొందినా ఆగింది. మరలా 4 దశాబ్దాల క్రితమే కేవలం 150' ఎత్తుకి అన్ని రాష్ట్రాల అనుమతులు పొంది నాటి ప్రియతమ ముఖ్యమంత్రి అంజయ్య గారితో శంకుస్థాపన చేయబడిన ప్రాజెక్టు(195 TMC) అది. తరువాత ఎన్టీఆర్ గారి హయాంలో కొంత ప్రయత్నం జరిగినా ఆఖరికి డా.వైస్సార్ గారి హయాంలో మొదలైంది. యర్రా నారాయణస్వామి గారి అధ్యక్షతన, ఇతర పెద్దల నేతృత్వంలో 33 సం. క్రితం పోలవరం సాధనసమితి ఏర్పడి పోరాడింది. 2005లో ముఖ్యమంత్రికి ధన్యవాదాలు చెప్పివారి సమక్షంలో సమితిని రద్దు చేసిన సందర్భము నాకుగుర్తుంది . తరువాత కూడా అనేకమంది దాని సత్వరనిర్మాణం కోసం పోరాటం, పాదయాత్రల ద్వారా కృషిచేశారు. వాటిల్లో కూడా పాల్గొన్నాము. ఈ ప్రాజెక్టు కొత్తగా 7.2 లక్షల ఎకరాలకు కొత్తగా నీటిసాదుపాయం కల్పిస్తూ, 23 లక్షల ఎకరాలకు స్థిరీకరణ చేస్తూ, దారిలో 540 గ్రామాలకు త్రాగునీరు ఇచ్చే ప్రాజెక్టు. దీనిపై ఆధారపడి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మొదలగు వాటితో అదనంగా లక్షలాది ఎకరాలకు సాగునీరు త్రాగునీటి అందుతుంది. వైఎస్సార్ గారి హయాంలో ఆ ప్రాజెక్టు కొంతవరకు ముందడుగు వేసింది, అయితే ఎక్కువగా కాలువల నిర్మాణం మీద దృష్టి పెట్టడం జరిగింది. నాడు ఆ ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకోడానికి అనేకులు న్యాయస్థానాన్ని ఆశ్రయించి అదే సమయంలో ఇతర రాష్ట్రాలకు కూడా తెలుగునాటనుంచి సమాచారం మనుషుల్ని పంపించే ఆపు చేసే ప్రయత్నాలు చేశారు. సుప్రీంకోర్టులో ఒడిషా కేసు వేసింది. ఆ ప్రాజెక్టు నిర్మాణంపై స్థానికంగా గోదావరి జిల్లాల్లోనే నాడు అపోహలు రేకెత్తించడానికి కొంతమంది యత్నించారు. దాన్ని నివారించడానికి అనేక సమావేశాలు జరిగాయి, మావంతు కృషి చేసాము. అసలుగా తూ.గో జిల్లాకు చెందిన భద్రాచలం 8 మండలాలను తిరిగి ముందు ఆ జిల్లాకు కలపాలని 2003 నుంచే మాలాంటివారి డిమాండ్ ఉంది. అనేకమంది రాకీనాలతో నేను స్వయంగా మాట్లాడాను. ఆఖరికి విభజన సమయంలో APRA2014 బిల్లులోనే 8 మండలాలు, మొత్తం అన్ని ముంపు గ్రామాలు కలిపాలని వినతిపత్రాలు ఇచ్చాము, డిమాండ్ చేసాము. జెడి శీలంగారి కార్యాలయంలో వ్రాసినవి నాకు గుర్తున్నాయి. వాటి కోసం భాజపా పార్టీ అధ్యక్షుల సలహా ప్రకారం, అలాగే గౌ. వెంకయ్యనాయుడు గారు, ఆ పార్టీలో నిపుణులు ప్రొ శేషగిరిరావు గారిని కలిసాము. విభజన బిల్లులోనే మొత్తం అన్ని ముంపు గ్రామాలని ఏపీలో కలిపేశారు. ఇది వాస్తవం. తరువాత కేవలం అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కోసం మధ్యలో ఉండే మరికొన్ని గ్రామాలు ఏపీలో కలిపితే అప్పుడే ఏదో మొత్తం ముంపు గ్రామాలు- 7 మండలాలు కలిపేసినట్లు చెప్పుకోవడం సత్యదూరం. దుమ్ముగూడెం లాంటి మండలాల్లో కూడా పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ముందు ప్రణాళికల ప్రకారం పునరావాసం కల్పించాల్సి ఉంది. ఇంకా 4 నాటి తూ.గో జిల్లా మండలాలు ఏపీలో నేటికి కలపలేదు. అందువల్ల విభజన అనంతరం మరలా ప్రాజెక్టు R&Rలో కొన్ని మార్పులు జరిగాయి. అదే సమయంలో 2013 భూసేకరణ చట్టం 2014 నుంచి అమలులోకి వచ్చింది, అమలులో గణనీయంగా మార్పులు వచ్చాయి. కేంద్ర చట్టాన్ని తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాల్సిందే.


విభజన బిల్లులో స్పష్టంగా పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు, పూర్తిచేయాల్సిన బాధ్యత కేంద్రందే. 2014-2016వరకు కేంద్ర నిధులు రాలేదు. ముందుగా ఈ ప్రాజెక్టుకు కేంద్ర బడ్జెట్ నుంచి 100 కోట్ల చొప్పున మాత్రమే కేటాయించినప్పుడు అందరం ఉద్యమబాట పట్టాము. 2016 ఆఖరులో నీతిఅయోగ్ సలహాతో అది నాబార్డు ద్వారా లోనుగా ppaకి ఇప్పించి అక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం మొదలు పెట్టారు. మొదటగా జెట్లీ డిసెంబర్ 16లో అందజేశారు. PPAకి దానిని కేంద్ర ప్రభుత్వం తిరిగి చెల్లించే విధంగా కార్యక్రమం చేయడం జరిగింది. పాత కాంట్రాక్టర్ అసమర్ధత వల్ల క్యాన్సిల్ చేసి కొత్త టెండర్ పిలుద్దామనుకున్నా అది ఆలస్యం అవుతుందని గడ్కరీ గారి సూచన మేరకు వేరేవారికి హెడ్ వర్క్స్, పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారని నాడు ప్రభుత్వం చెప్పింది. ఆ తర్వాత 2016 నుంచి 19 వరకు కూడా ఈ ప్రాజెక్టు చంద్రబాబు గారి హయాంలో గణనీయంగా ముందుకు వెళ్ళింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రివర్స్ టెండరింగ్ విధానం, కోవిడ్19 వల్ల కొంత ఆగినా, ఆ ప్రాజెక్టు హెడ్ వర్క్స్ దగ్గర నేడు పని బాగానే నడుస్తూ ఉంది. అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన 4వేల కోట్ల రూపాయలలో ఇప్పుడు 2,234.77 కోట్లు విడుదల చేయడానికే ఇన్ని తిప్పలు కేంద్రం పెడుతూంది. ₹20,398.81 కోట్లకు ఒప్పుకుంటేనే అని నాటకాలు ఆడుతుంది. ఏ పార్టీకి చెందినా, ఏపీ అభివృద్ధి కాంక్షించే అందరూ దాన్ని వ్యతిరేకించాలి. కానీ కొందరు ఏపీ నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ వ్యతిరేకులనే కొందర్ని రంగంలోకి దింపి పోలవరం పూర్తి సామర్ధ్యం అవసరం లేదనే విష ప్రచారం చేస్తున్నారు. అనేకసార్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసినా, కేంద్ర ప్రభుత్వం పూర్తి చేస్తుందని హామీ ఇచ్చింది. ఒక గణతంత్ర రాజ్యం ఇచ్చిన సావరిన్ హామీ అది. తదుపరి కూడా పవర్ కంపోనెంట్ కాకుండా ఈ ప్రాజెక్టు పూర్తి చేయాల్సిన బాధ్యత పూర్తిగా తమదేనని కేంద్ర ప్రభుత్వమే స్పష్టం చేసింది. అంటే 5235.87 కోట్ల రూపాయలు అప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది. ప్రాజెక్టు ఖర్చులో 10% వాటా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలని భావంలో ఉండి ఉండొచ్చు. తాజాగా.. కేవలం 135/140 అడుగుల ఎత్తుకి గేట్లు ఆపరేట్ చేసే విధంగా నియంత్రిస్తూ కోర్టులకు వెళ్లే తెరవెనుక ప్రయత్నాలు సాగుతున్నట్లు, దానికి కొందరు కేంద్ర పెద్దల, కింద పెద్దల సహకారం కూడా ఉన్నట్లు అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే నేడు గోదావరి ప్రవాహం మేరకు 135' లోపు కాలువల్లోకి నీరుమళ్లింపు కొంత ఆయినా, పైన ఎగువ రాష్ట్రాలు ప్రాజెక్టులు పూర్తి చేస్తే అన్నిరోజులు నేటి స్థాయిలో ప్రవాహం ఉండదు. అప్పుడు ఇబ్బందులు మొదలౌతాయి. రెండు కాలువలలో పూర్తి సామర్థ్యంతో నీరు మళ్ళింపు జరగాలంటే 150'ఎత్తుతో నీరు ఉంటేనే సాధ్యం. డాం గోడలు ఆ ఎత్తుకు కట్టేస్తా0, ప్రాజెక్టు పూర్తైనట్లే, నీళ్లు మాత్రం పూర్తి స్థాయిలో నిలబెట్టడం మాపనికాదు అంటే ఎలా? కేవలం హెడ్ వర్క్స్ మరియు కాలువలు 2022కి అవ్వవచ్చు. నిర్వాసితులకు న్యాయం చేసి 150' పూర్తి సామర్థ్యంతో నీళ్లు నిలబెడితేనే ప్రాజెక్టు పూర్తి అయినట్లు. ఉట్టి ప్రాజెక్టు గోడలు కట్టి పూర్తిసామర్థ్యంతో నీరు నిలబెట్టకుండా పోలవరం ప్రాజెక్టు పూర్తి అయిపోయిందంటే అది హాస్యాస్పదంగా ఉంటుంది. ఆ బహుళార్ధకసాధక ప్రాజెక్టును, ఓ పెద్దబారేజ్ గా మార్చేసి తూతూ మంత్రంగా R&Rకి ఇంకో రూ.5000కోట్లు సరిపట్ట్టే కుట్రలు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇది ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశ్యానికే చాలా ప్రమాదం ఆ కాలువలద్వారా జరిగే సాగు, త్రాగు నీటి ప్రయోజనాలతో పాటు అదనంగా అ) ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి-అనుబంధ ప్రాజెక్టులు, ఆ) కుడికాలువ ద్వారా NSP కుడికాలువ ఆయకట్టుకు స్థిరత్వం, అలాగే బొల్లెపల్లి రిజర్వాయర్, ప్రకాశం జిల్లా ద్వారా సోమశిలకి నీటి తరలింపు ఇ) సాగర్ క్రింద ఆయకట్టుకు కొంత సంప్లిమెంటేషన్ ఇచ్చి ఆ నీటిని శ్రీశైలం నుంచి రాయలసీమకు వాడుకోవడం ఇలాంటి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇవన్నీ అదనపు ప్రయోజనాలు. 150'ఎత్తుతో ప్రాజెక్టులో నీళ్లు నిలబెట్టకపోతే, కంటూర్ తో నీళ్లు రాకపోతే ఇవన్నీ చాలావరకూ దెబ్బతింటాయి. ఎందుకంటే ప్రాజెక్టు 194 tmc సామర్ధ్యంలో ప్రాజెక్టు డెడ్ స్టోరేజి 119 TMC అది 135' లోపులో ఉంటుంది. అదే లైవ్ 75 TMC 135-150 మధ్యలో ఉంటుంది. డెడ్ స్టోరేజ్ నుంచి కూడా నీటి మళ్ళింపు జరిగితే గోదావరి డెల్టా ప్రయోజనాలు దెబ్బతింటాయి. ప్రాజెక్టు ఎత్తు తగ్గినా ఫర్వాలేదు అని సన్నాయినొక్కులు నొక్కే ఇతరులు తెలివిగా కోస్తాజిల్లాల మధ్యనే ఉత్తరోత్తరా విద్వేషాలు రెచ్చగొట్టేటానికి పన్నే మరో కుట్ర ఇది కాదా? అలా జరిగితే 960 MW విద్యుత్ స్థాపిత సామర్ధ్యం కూడా బాగా దెబ్బతింటుంది. ఇక ఎత్తిపోతలకు ఎదురు విద్యుత్ బిల్లులు కట్టాల్సి ఉంటుంది. ఎందుకనో ఆంధ్రులకు పోరాడకుండా ఏమీ రాలేదు. 40 సం. పోరాటం, అమరజీవి ఆత్మ త్యాగం, అనేకమంది బలిదానం వల్ల ఆంధ్రరాష్ట్రము వచ్చింది. విశాఖ ఉక్కుకోసం కూడా పోరాటాలు తప్పలేదు. అలాగే ప్రత్యేకఆంధ్ర కావాలని వందలాదిమంది 1971-72లో బలిదానం చేస్తే ఉమ్మడి రాజధానిపై కొన్ని హక్కులు వచ్చాయి. సమైక్యాంధ్ర కోసం ఉద్యమిస్తే, అలాగే విభజన జరిగితే ఏమి కావాలో జస్టిస్ శ్రీకృష్ణ కమిటీనుంచి GOMల వరకూ డిమాండ్ చేస్తే కొన్ని హక్కులు వచ్చాయి, విభజన హామీల కోసం ఉద్యమిస్తే ఆ వచ్చిన 15% అన్నా అమలు అవుతున్నాయి. కోవిడ్19 వల్ల విభజన హామీల సాధనా ఉద్యమం కుంటుపడింది తప్ప ఉద్యమం ఆగే సమస్యే లేదు. కోవిడ్ ముందు కూడా ఈ ప్రాజెక్టు నిధులు, విభజన హామీలకోసం నిర్మలా సీతారామన్ గారిని ఇతర మంత్రులను కలిసి డిమాండ్ చేసాము. వారు అప్పుడు చెప్పిన దానికి ఇప్పుడు ఆర్ధిక శాఖ చేస్తున్నదానికి సంబంధము లేదు. మొన్ననే రైతు సంఘాల నేతలతో కలిసి PPAకి వినతిపత్రం కూడా ఇచ్చాము. అయితే రాష్ట్రంలో ఒక పార్టీని ఒకరు దూషించుకోవడం తప్ప ఉమ్మడిగా పోరాడలేకపోవడం దురదృష్టకరం. "పాత/కొత్త ప్రభుత్వం ఇలా చేసింది" అని ఒకళ్ళమీద మరొకరు బురద వేసుకుంటుంటే నష్టపోయేది రాష్ట్ర ప్రజలు. 2017-18 ssr ధరల ప్రకారం కేంద్ర జలశక్తి శాఖ ఆమోదించిన 55వేల కోట్ల అంచనాలను ఆమోదించాలి. లోపాలు జరిగితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలి, బాధ్యులను శిక్షించాలి. అది వేరే. బడ్జెట్ ఎంతైతేనేమి కేంద్రమే పూర్తి సామర్ధ్యంతో నిర్మించాలి. ఎన్నో బాధలు, అవమానాలు ఎదుర్కొన్నా పట్టుబట్టి బారేజ్ కట్టిన కాటన్ దొర స్ఫూర్తి నేటి పాలకులు గమనించాలి. నేడు అత్యంత ముఖ్యసమస్య వచ్చినప్పుడు కుల, మత, జిల్లాల తంపులు పెట్టడం, పోరాడేవారికి తోకలు కడితే ఎలా? తమిళనాడులో ఒక సంప్రదాయ క్రీడ జల్లికట్టు కోసం అందరూ ఏకమైతే, కేంద్రమే ఏకంగా చట్టాన్ని సవరించేయాల్సి వచ్చింది. ఏపీకి, ముఖ్యంగా భావితరాలకు జీవం లాంటి విభజన హామీలుకోసం, ఈ పోలవరం లాంటి వాటికోసం ఏకం అవ్వలేకపోవడం భావితరాల భవితమీద రాజకీయ పక్షాలు దెబ్బకొట్టడమే. నిర్వాసితులకు సంపూర్తిగా న్యాయం జరిగేటట్లు 150 అడుగుల ఎత్తులో నీళ్లు నిలబెట్టి నిజంగా ప్రాజెక్టు పూర్తిచేసేటట్లు AP ప్రభుత్వం లీడ్ తీసుకోవాలి, కేంద్రం, ఇతరుల కుట్రలకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలను, ప్రజాసంఘాలను కలుపుకుని గట్టి ఉద్యమం నిర్మించాలి. లేదా ప్రజలే ఏపీకి వరుసగా జరుగుతున్న మోసాలపై ఉద్యమానికి పూనుకోవాలి. ఆంధ్రప్రదేశ్ కు పోలవరం ప్రాజెక్టు ఒక జీవనాడి లాంటిది, దేశానికి ఒక ఆస్తి లాంటిది. దాని సంపూర్తిపై నేడు నీలినీడలు కమ్ముకోవడం దురదృష్టకరం. చరిత్ర చూస్తే 1941లో ₹ 6.5 కోట్లతో ప్రతిపాదించబడి 1946కల్లా ముందు 208’ (836) తరువాత 198 అడుగుల(692 tmc) ఎత్తులో డిజైన్స్ అన్ని ఆమోదించబడి, అనుమతులు పొందినా ఆగింది. మరలా 4 దశాబ్దాల క్రితమే కేవలం 150' ఎత్తుకి అన్ని రాష్ట్రాల అనుమతులు పొంది నాటి ప్రియతమ ముఖ్యమంత్రి అంజయ్య గారితో శంకుస్థాపన చేయబడిన ప్రాజెక్టు(195 TMC) అది. తరువాత ఎన్టీఆర్ గారి హయాంలో కొంత ప్రయత్నం జరిగినా ఆఖరికి డా.వైస్సార్ గారి హయాంలో మొదలైంది. యర్రా నారాయణస్వామి గారి అధ్యక్షతన, ఇతర పెద్దల నేతృత్వంలో 33 సం. క్రితం పోలవరం సాధనసమితి ఏర్పడి పోరాడింది. 2005లో ముఖ్యమంత్రికి ధన్యవాదాలు చెప్పివారి సమక్షంలో సమితిని రద్దు చేసిన సందర్భము నాకుగుర్తుంది . తరువాత కూడా అనేకమంది దాని సత్వరనిర్మాణం కోసం పోరాటం, పాదయాత్రల ద్వారా కృషిచేశారు. వాటిల్లో కూడా పాల్గొన్నాము. ఈ ప్రాజెక్టు కొత్తగా 7.2 లక్షల ఎకరాలకు కొత్తగా నీటిసాదుపాయం కల్పిస్తూ, 23 లక్షల ఎకరాలకు స్థిరీకరణ చేస్తూ, దారిలో 540 గ్రామాలకు త్రాగునీరు ఇచ్చే ప్రాజెక్టు. దీనిపై ఆధారపడి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మొదలగు వాటితో అదనంగా లక్షలాది ఎకరాలకు సాగునీరు త్రాగునీటి అందుతుంది. వైఎస్సార్ గారి హయాంలో ఆ ప్రాజెక్టు కొంతవరకు ముందడుగు వేసింది, అయితే ఎక్కువగా కాలువల నిర్మాణం మీద దృష్టి పెట్టడం జరిగింది. నాడు ఆ ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకోడానికి అనేకులు న్యాయస్థానాన్ని ఆశ్రయించి అదే సమయంలో ఇతర రాష్ట్రాలకు కూడా తెలుగునాటనుంచి సమాచారం మనుషుల్ని పంపించే ఆపు చేసే ప్రయత్నాలు చేశారు. సుప్రీంకోర్టులో ఒడిషా కేసు వేసింది. ఆ ప్రాజెక్టు నిర్మాణంపై స్థానికంగా గోదావరి జిల్లాల్లోనే నాడు అపోహలు రేకెత్తించడానికి కొంతమంది యత్నించారు. దాన్ని నివారించడానికి అనేక సమావేశాలు జరిగాయి, మావంతు కృషి చేసాము. అసలుగా తూ.గో జిల్లాకు చెందిన భద్రాచలం 8 మండలాలను తిరిగి ముందు ఆ జిల్లాకు కలపాలని 2003 నుంచే మాలాంటివారి డిమాండ్ ఉంది. అనేకమంది రాకీనాలతో నేను స్వయంగా మాట్లాడాను. ఆఖరికి విభజన సమయంలో APRA2014 బిల్లులోనే 8 మండలాలు, మొత్తం అన్ని ముంపు గ్రామాలు కలిపాలని వినతిపత్రాలు ఇచ్చాము, డిమాండ్ చేసాము. జెడి శీలంగారి కార్యాలయంలో వ్రాసినవి నాకు గుర్తున్నాయి. వాటి కోసం భాజపా పార్టీ అధ్యక్షుల సలహా ప్రకారం, అలాగే గౌ. వెంకయ్యనాయుడు గారు, ఆ పార్టీలో నిపుణులు ప్రొ శేషగిరిరావు గారిని కలిసాము. విభజన బిల్లులోనే మొత్తం అన్ని ముంపు గ్రామాలని ఏపీలో కలిపేశారు. ఇది వాస్తవం. తరువాత కేవలం అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కోసం మధ్యలో ఉండే మరికొన్ని గ్రామాలు ఏపీలో కలిపితే అప్పుడే ఏదో మొత్తం ముంపు గ్రామాలు- 7 మండలాలు కలిపేసినట్లు చెప్పుకోవడం సత్యదూరం. దుమ్ముగూడెం లాంటి మండలాల్లో కూడా పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ముందు ప్రణాళికల ప్రకారం పునరావాసం కల్పించాల్సి ఉంది. ఇంకా 4 నాటి తూ.గో జిల్లా మండలాలు ఏపీలో నేటికి కలపలేదు. అందువల్ల విభజన అనంతరం మరలా ప్రాజెక్టు R&Rలో కొన్ని మార్పులు జరిగాయి. అదే సమయంలో 2013 భూసేకరణ చట్టం 2014 నుంచి అమలులోకి వచ్చింది, అమలులో గణనీయంగా మార్పులు వచ్చాయి. కేంద్ర చట్టాన్ని తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాల్సిందే. విభజన బిల్లులో స్పష్టంగా పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు, పూర్తిచేయాల్సిన బాధ్యత కేంద్రందే. 2014-2016వరకు కేంద్ర నిధులు రాలేదు. ముందుగా ఈ ప్రాజెక్టుకు కేంద్ర బడ్జెట్ నుంచి 100 కోట్ల చొప్పున మాత్రమే కేటాయించినప్పుడు అందరం ఉద్యమబాట పట్టాము. 2016 ఆఖరులో నీతిఅయోగ్ సలహాతో అది నాబార్డు ద్వారా లోనుగా ppaకి ఇప్పించి అక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం మొదలు పెట్టారు. మొదటగా జెట్లీ డిసెంబర్ 16లో అందజేశారు. PPAకి దానిని కేంద్ర ప్రభుత్వం తిరిగి చెల్లించే విధంగా కార్యక్రమం చేయడం జరిగింది. పాత కాంట్రాక్టర్ అసమర్ధత వల్ల క్యాన్సిల్ చేసి కొత్త టెండర్ పిలుద్దామనుకున్నా అది ఆలస్యం అవుతుందని గడ్కరీ గారి సూచన మేరకు వేరేవారికి హెడ్ వర్క్స్, పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారని నాడు ప్రభుత్వం చెప్పింది. ఆ తర్వాత 2016 నుంచి 19 వరకు కూడా ఈ ప్రాజెక్టు చంద్రబాబు గారి హయాంలో గణనీయంగా ముందుకు వెళ్ళింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రివర్స్ టెండరింగ్ విధానం, కోవిడ్19 వల్ల కొంత ఆగినా, ఆ ప్రాజెక్టు హెడ్ వర్క్స్ దగ్గర నేడు పని బాగానే నడుస్తూ ఉంది. అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన 4వేల కోట్ల రూపాయలలో ఇప్పుడు 2,234.77 కోట్లు విడుదల చేయడానికే ఇన్ని తిప్పలు కేంద్రం పెడుతూంది. ₹20,398.81 కోట్లకు ఒప్పుకుంటేనే అని నాటకాలు ఆడుతుంది. ఏ పార్టీకి చెందినా, ఏపీ అభివృద్ధి కాంక్షించే అందరూ దాన్ని వ్యతిరేకించాలి. కానీ కొందరు ఏపీ నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ వ్యతిరేకులనే కొందర్ని రంగంలోకి దింపి పోలవరం పూర్తి సామర్ధ్యం అవసరం లేదనే విష ప్రచారం చేస్తున్నారు. అనేకసార్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసినా, కేంద్ర ప్రభుత్వం పూర్తి చేస్తుందని హామీ ఇచ్చింది. ఒక గణతంత్ర రాజ్యం ఇచ్చిన సావరిన్ హామీ అది. తదుపరి కూడా పవర్ కంపోనెంట్ కాకుండా ఈ ప్రాజెక్టు పూర్తి చేయాల్సిన బాధ్యత పూర్తిగా తమదేనని కేంద్ర ప్రభుత్వమే స్పష్టం చేసింది. అంటే 5235.87 కోట్ల రూపాయలు అప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది. ప్రాజెక్టు ఖర్చులో 10% వాటా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలని భావంలో ఉండి ఉండొచ్చు. తాజాగా.. కేవలం 135/140 అడుగుల ఎత్తుకి గేట్లు ఆపరేట్ చేసే విధంగా నియంత్రిస్తూ కోర్టులకు వెళ్లే తెరవెనుక ప్రయత్నాలు సాగుతున్నట్లు, దానికి కొందరు కేంద్ర పెద్దల, కింద పెద్దల సహకారం కూడా ఉన్నట్లు అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే నేడు గోదావరి ప్రవాహం మేరకు 135' లోపు కాలువల్లోకి నీరుమళ్లింపు కొంత ఆయినా, పైన ఎగువ రాష్ట్రాలు ప్రాజెక్టులు పూర్తి చేస్తే అన్నిరోజులు నేటి స్థాయిలో ప్రవాహం ఉండదు. అప్పుడు ఇబ్బందులు మొదలౌతాయి. రెండు కాలువలలో పూర్తి సామర్థ్యంతో నీరు మళ్ళింపు జరగాలంటే 150'ఎత్తుతో నీరు ఉంటేనే సాధ్యం. డాం గోడలు ఆ ఎత్తుకు కట్టేస్తా0, ప్రాజెక్టు పూర్తైనట్లే, నీళ్లు మాత్రం పూర్తి స్థాయిలో నిలబెట్టడం మాపనికాదు అంటే ఎలా? కేవలం హెడ్ వర్క్స్ మరియు కాలువలు 2022కి అవ్వవచ్చు. నిర్వాసితులకు న్యాయం చేసి 150' పూర్తి సామర్థ్యంతో నీళ్లు నిలబెడితేనే ప్రాజెక్టు పూర్తి అయినట్లు. ఉట్టి ప్రాజెక్టు గోడలు కట్టి పూర్తిసామర్థ్యంతో నీరు నిలబెట్టకుండా పోలవరం ప్రాజెక్టు పూర్తి అయిపోయిందంటే అది హాస్యాస్పదంగా ఉంటుంది. ఆ బహుళార్ధకసాధక ప్రాజెక్టును, ఓ పెద్దబారేజ్ గా మార్చేసి తూతూ మంత్రంగా R&Rకి ఇంకో రూ.5000కోట్లు సరిపట్ట్టే కుట్రలు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇది ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశ్యానికే చాలా ప్రమాదం ఆ కాలువలద్వారా జరిగే సాగు, త్రాగు నీటి ప్రయోజనాలతో పాటు అదనంగా అ) ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి-అనుబంధ ప్రాజెక్టులు, ఆ) కుడికాలువ ద్వారా NSP కుడికాలువ ఆయకట్టుకు స్థిరత్వం, అలాగే బొల్లెపల్లి రిజర్వాయర్, ప్రకాశం జిల్లా ద్వారా సోమశిలకి నీటి తరలింపు ఇ) సాగర్ క్రింద ఆయకట్టుకు కొంత సంప్లిమెంటేషన్ ఇచ్చి ఆ నీటిని శ్రీశైలం నుంచి రాయలసీమకు వాడుకోవడం ఇలాంటి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇవన్నీ అదనపు ప్రయోజనాలు. 150'ఎత్తుతో ప్రాజెక్టులో నీళ్లు నిలబెట్టకపోతే, కంటూర్ తో నీళ్లు రాకపోతే ఇవన్నీ చాలావరకూ దెబ్బతింటాయి. ఎందుకంటే ప్రాజెక్టు 194 tmc సామర్ధ్యంలో ప్రాజెక్టు డెడ్ స్టోరేజి 119 TMC అది 135' లోపులో ఉంటుంది. అదే లైవ్ 75 TMC 135-150 మధ్యలో ఉంటుంది. డెడ్ స్టోరేజ్ నుంచి కూడా నీటి మళ్ళింపు జరిగితే గోదావరి డెల్టా ప్రయోజనాలు దెబ్బతింటాయి. ప్రాజెక్టు ఎత్తు తగ్గినా ఫర్వాలేదు అని సన్నాయినొక్కులు నొక్కే ఇతరులు తెలివిగా కోస్తాజిల్లాల మధ్యనే ఉత్తరోత్తరా విద్వేషాలు రెచ్చగొట్టేటానికి పన్నే మరో కుట్ర ఇది కాదా? అలా జరిగితే 960 MW విద్యుత్ స్థాపిత సామర్ధ్యం కూడా బాగా దెబ్బతింటుంది. ఇక ఎత్తిపోతలకు ఎదురు విద్యుత్ బిల్లులు కట్టాల్సి ఉంటుంది. ఎందుకనో ఆంధ్రులకు పోరాడకుండా ఏమీ రాలేదు. 40 సం. పోరాటం, అమరజీవి ఆత్మ త్యాగం, అనేకమంది బలిదానం వల్ల ఆంధ్రరాష్ట్రము వచ్చింది. విశాఖ ఉక్కుకోసం కూడా పోరాటాలు తప్పలేదు. అలాగే ప్రత్యేకఆంధ్ర కావాలని వందలాదిమంది 1971-72లో బలిదానం చేస్తే ఉమ్మడి రాజధానిపై కొన్ని హక్కులు వచ్చాయి. సమైక్యాంధ్ర కోసం ఉద్యమిస్తే, అలాగే విభజన జరిగితే ఏమి కావాలో జస్టిస్ శ్రీకృష్ణ కమిటీనుంచి GOMల వరకూ డిమాండ్ చేస్తే కొన్ని హక్కులు వచ్చాయి, విభజన హామీల కోసం ఉద్యమిస్తే ఆ వచ్చిన 15% అన్నా అమలు అవుతున్నాయి. కోవిడ్19 వల్ల విభజన హామీల సాధనా ఉద్యమం కుంటుపడింది తప్ప ఉద్యమం ఆగే సమస్యే లేదు. కోవిడ్ ముందు కూడా ఈ ప్రాజెక్టు నిధులు, విభజన హామీలకోసం నిర్మలా సీతారామన్ గారిని ఇతర మంత్రులను కలిసి డిమాండ్ చేసాము. వారు అప్పుడు చెప్పిన దానికి ఇప్పుడు ఆర్ధిక శాఖ చేస్తున్నదానికి సంబంధము లేదు. మొన్ననే రైతు సంఘాల నేతలతో కలిసి PPAకి వినతిపత్రం కూడా ఇచ్చాము. అయితే రాష్ట్రంలో ఒక పార్టీని ఒకరు దూషించుకోవడం తప్ప ఉమ్మడిగా పోరాడలేకపోవడం దురదృష్టకరం. "పాత/కొత్త ప్రభుత్వం ఇలా చేసింది" అని ఒకళ్ళమీద మరొకరు బురద వేసుకుంటుంటే నష్టపోయేది రాష్ట్ర ప్రజలు. 2017-18 ssr ధరల ప్రకారం కేంద్ర జలశక్తి శాఖ ఆమోదించిన 55వేల కోట్ల అంచనాలను ఆమోదించాలి. లోపాలు జరిగితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలి, బాధ్యులను శిక్షించాలి. అది వేరే. బడ్జెట్ ఎంతైతేనేమి కేంద్రమే పూర్తి సామర్ధ్యంతో నిర్మించాలి. ఎన్నో బాధలు, అవమానాలు ఎదుర్కొన్నా పట్టుబట్టి బారేజ్ కట్టిన కాటన్ దొర స్ఫూర్తి నేటి పాలకులు గమనించాలి. నేడు అత్యంత ముఖ్యసమస్య వచ్చినప్పుడు కుల, మత, జిల్లాల తంపులు పెట్టడం, పోరాడేవారికి తోకలు కడితే ఎలా? తమిళనాడులో ఒక సంప్రదాయ క్రీడ జల్లికట్టు కోసం అందరూ ఏకమైతే, కేంద్రమే ఏకంగా చట్టాన్ని సవరించేయాల్సి వచ్చింది. ఏపీకి, ముఖ్యంగా భావితరాలకు జీవం లాంటి విభజన హామీలుకోసం, ఈ పోలవరం లాంటి వాటికోసం ఏకం అవ్వలేకపోవడం భావితరాల భవితమీద రాజకీయ పక్షాలు దెబ్బకొట్టడమే. నిర్వాసితులకు సంపూర్తిగా న్యాయం జరిగేటట్లు 150 అడుగుల ఎత్తులో నీళ్లు నిలబెట్టి నిజంగా ప్రాజెక్టు పూర్తిచేసేటట్లు AP ప్రభుత్వం లీడ్ తీసుకోవాలి, కేంద్రం, ఇతరుల కుట్రలకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలను, ప్రజాసంఘాలను కలుపుకుని గట్టి ఉద్యమం నిర్మించాలి. లేదా ప్రజలే ఏపీకి వరుసగా జరుగుతున్న మోసాలపై ఉద్యమానికి పూనుకోవాలి. 

సేకరణ : చలసాని శ్రీనివాస్‌

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !