హయత్‌నగర్‌లో దారుణం - తోటి విద్యార్థినిపై సామూహిక అత్యాచారం !

0

ఆడపిల్లలకు భద్రత కరువైంది. అడుగు తీసి అడుగు బయటపెట్టాలంటే ఆడపిల్లలు హడలెత్తిపోతున్నారు. కొద్దికాలం క్రితం హైదరాబాద్‌లోని పాఠశాలలో పసిపిల్లపై జరిగిన ఘోరం మరువకముందే మరోచోట మరో దారుణం బయటపడిరది. హయత్‌నగర్‌లోని ఓ స్కూల్‌ విద్యార్థినిపై అత్యాచారం ఘటన కలకలం రేపుతోంది. పదవ తరగతి విద్యార్థినిపై తోటి విద్యార్థులే ఐదుగురు అత్యాచారానికి పాల్పడ్డారు. పదవ తరగతి విద్యార్థినిపై ఐదుగురు తోటి విద్యార్థులు అత్యాచారం చేశారు. ముందు నుంచి రెక్కి నిర్వహించిన నిందితులు ఇంట్లో ఎవరూ లేని సమయం గమనించి ఈ దారుణానికి పాల్పడ్డారు. తోటి విద్యార్థి అని కూడా ఆలోచించకుండా క్రూరమైన తోడేళ్ళుగా మారిపోయారు. ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు. తనను విడిచిపెట్టాలని ఎంత మొత్తుకున్నా కనికరం చూపించలేదు. అత్యాచారం సమయంలో నిందితులలో ఒకరు వీడియోను తీశారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే వీడియోను సోషల్‌ మీడియాలో పెడతామంటూ బెందిరించారు. అయితే పదిరోజుల తర్వాత ఇదే ఐదుగురు విద్యార్థులు మరోసారి బాలికపై  అత్యాచారం చేశారు. రేప్‌ చేస్తుండగా మరోసారి వీడియో తీశారు. ఈ వీడియోలను నిందితులు తోటి విద్యార్థులకు షేర్‌ చేశారు. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులపై పోలీసులు అత్యాచారం, పోక్సో కేసులు నమోదు చేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !