సాహితీ ఇన్‌ఫ్రా ప్రీలాంచ్‌ మోసం...ఎండీ లక్ష్మీనారాయణ అరెస్ట్‌ !

0

సాహితీ ఇన్‌ ఫ్రా గ్రూప్‌ ఎండీ, తిరుమల, తిరుపతి దేవస్థాన పాలక మండలి సభ్యుడు భూదాటి లక్ష్మీనారాయణని హైదరాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. స్థిరాస్థి రంగంలో కొత్త ప్రాజెక్టుల పేరుతో ఎలాంటి అనుమతులు లేకుండా ప్రీలాంచ్‌ పేరుతో 2500 మంది నుండి రూ.900 కోట్లు వసూలు చేశారు. కానీ సకాలంలో ప్రాజెక్టులను పూర్తి చేయకుండా కాలయాపన చేస్తూ వినియోగదారులను మోసం చేస్తున్నట్లు బాధితులు వివిధ పోలీస్‌ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు.  అమీన్‌పూర్‌లో సాహితీ శరవణి ఎలైట్‌ పేరుతో ప్రాజెక్టును ప్రారంభించారు. 23 ఎకరాల్లో 38 అంతస్థులతో 10 అపార్ట్‌మెంట్స్‌ నిర్మిస్తున్నట్లు ప్రకటనలు గుప్పించారు. అతితక్కువ ధరకే డబుల్‌ బెడ్‌రూమ్‌, ట్రిపుల్‌ బెడ్‌రూమ్‌ ప్లాట్స్‌ అందిస్తున్నట్లు చెప్పారు.  ఈ ఒక్క ప్రాజెక్టులోనే సుమారు 1700 మంది కస్టమర్ల దగ్గర నుండి రూ.539 కోట్ల రూపాయలు వసూలు చేసింది. మూడేళ్ళు పూర్తయినా ప్రాజెక్టు పూర్తి కాకపోవటంతో కొందరు బుకింగ్‌ రద్దు చేసుకుంటామని, డబ్బులు వెనక్కి ఇచ్చేయమని ఒత్తిడి పెంచారు. దీంతో సేకరించిన సొమ్ముకు 15` 18 శాతం వరకు వడ్డీ ఇస్తామని చెక్కులు అందించింది. అవి బౌన్స్‌ అవ్వటంతో మోసం పోయామని గుర్తించి కేసులు పెట్టారు బాధితులు. అలాగే మరో ప్రాజెక్టులో రూ.900 కోట్లు వసూలు చేశారని సాహితీ ఇన్‌ ఫ్రా సంస్థపై ఆరోపణలున్నాయి. ప్రీ లాంచ్‌ ఆఫర్ల పేరుతో సాహితీ ఇన్‌ ఫ్రా సంస్థ మోసాలకు పాల్పడిరదని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !