Hero Nani : నాని ఇమేజ్‌ను అమాంతం పెంచేసిన దసరా !

0
hero nani remuneration in dasara

నాచురల్‌ స్టార్‌ నాని (Hero Nani) నటించిన ‘దసరా’ (Dasara) సినిమా మార్చి 30 న విడుదల అయింది. కొత్త దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల ( Srikanth Odela) తో ‘దసరా’ అనే సినిమాకు దర్శకత్వం వహించారు. కీర్తి సురేష్‌ (Keerthy Suresh) హీరోయిన్‌గా నటించారు. విడుదలకు ముందే మంచి ఈ చిత్రంపై అందరూ నమ్మకంగా ఉన్నారు. శ్రీరామ నవమి సందర్భంగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర ఊచకోత కోసింది. దసరా సినిమా నాని (Hero Nani)  ఇమేజ్‌ను అమాంతం ఆకాశానికి చేరేలా చేసింది. ఎందుకంటే దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో ఒకేసారి రిలీజ్‌ చేయటమే కాకుండా, బడ్జెట్‌ పరంగా కూడా నాని సినిమాల్లో కెల్లా అతి పెద్ద బడ్జెట్‌ కూడా . గోదావరి ఖని (Godavarikhani) దగ్గర వున్న ఒక పల్లెలో జీవన శైలి ఏ విధంగా ఉంటుంది అన్న నేపధ్యం లో వచ్చిన ఒక ఫిక్షన్‌ కథ ఇది. అయితే ఈ సినిమాకి నాని (Hero Nani) చాలా బాగా ప్రచారం చేసాడు. ఒక్కడే ప్రచారాన్ని అంతా భుజం మీద వేసుకొని అన్ని పట్టణాలకు వెళ్లి, హిందీ మాట్లాడే ప్రదేశాలకు కూడా వెళ్లి మరీ ప్రచారం చేసేది. ఈ సినిమాని అంతగా నమ్మి చేసాడు. ఈ సినిమాకి నిర్మాత చెరుకూరి సుధాకర్‌ (Cherukuri Sudhakar). 

Hero Nani భారీగా రెమ్యూనరేషన్‌ ! 

దసరా సినిమాకి నాని రెమ్యూనరేషన్‌ కూడా భారీగానే తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒకసారి అన్ని భాషల్లో విడుదల చేయటం నానికి కలిసొచ్చే అంశంగా చెప్పాలి. ఈ కారణంగానే  నాని భారీగా రెమ్యూనరేషన్‌ (Hero Nani Remunaration in dasara) రూ.16 కోట్లు తీసుకున్నాడని పరిశ్రమలో చెపుతున్నారు. నాని తీసిన సినిమాల్లో ఇంతవరకు ఇదే అత్యధిక పారితోషికం అని కూడా చెపుతున్నారు. రూ.16 కోట్లు పారితోషికం అంటే నాని ఇప్పుడు ఫస్ట్‌ గ్రేడ్‌ యాక్టర్ల లిస్టు లోకి వచ్చేసినట్టే అని చెప్పాలి. ఈ సినిమాకి ఖర్చు కూడా చాలా తక్కువే అయిందని అంటున్నారు. ఎందుకంటే సినిమా మొత్తం ఒక గ్రామం సెట్‌ లో తీశారని చెప్పారు. ఆ గ్రామం సెట్‌ కి కూడా సినిమా నిర్వాహకులు చెప్పినంత అయి ఉండదని కూడా చెపుతున్నారు. 

hero nani remuneration in dasara

బిజినెస్‌ ఎంతంటే...

సినిమా ప్రపంచ వ్యాప్తంగా జరిగిన థియేట్రికల్‌ బిజినెస్‌ విషయానికొస్తే.. నైజాం (తెలంగాణ): రూ. 13.7 కోట్లు సీడెడ్‌ (రాయలసీమ): రూ. 6.5 కోట్లు.. ఉత్తరాంధ్ర: రూ. 3.9 కోట్లు.. ఈస్ట్‌: రూ. 2.35 కోట్లు.. వెస్ట్‌: రూ. 2 కోట్లు.. గుంటూరు: రూ. 3 కోట్లు.. కృష్ణా: రూ. 2 కోట్టు.. నెల్లూరు: రూ. 1.2 కోట్లు.. తెలంగాణ:ం ఆంధ్ర ప్రదేశ్‌ కలిపి రూ. 34.65 కోట్లు కర్ణాటక: రూ. 2.85 కోట్లు.. ఇతర భాషల్లో .. రూ. 1.5 కోట్లు.. నార్త్‌ భారత్‌లో .. రూ. 5 కోట్లు.. ఓవర్సీస్‌ : రూ. 6 కోట్లు.. వరల్డ్‌ వైడ్‌ గా రూ. 50 కోట్ల ప్రీ రిలీజ్‌ బిజనెస్‌ చేసింది. ఈ సినిమా హిట్‌ అనిపించుకోవాలంటే.. రూ. 51 కోట్లు రాబట్టాలి. మొత్తంగా నాని ముందు పెద్ద టార్గెట్‌ ఉంది.  అలా ఉంటే దసరా ఓటీటీ రైట్స్‌కు భారీ ధర పలికినట్లు తెలుస్తోంది. దసరా స్ట్రీమింగ్‌ రైట్స్‌ను రెండు సంస్థలు దక్కించుకున్నాయి. తెలుగు, తమిళ్‌, కన్నడ, మలయాళం భాషలకు చెందిన స్ట్రీమింగ్‌ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్‌ దక్కించుకోగా.. హిందీ స్ట్రీమీంగ్‌ రైట్స్‌ను హాట్‌ స్టార్‌ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా విడుదలైన ఎనిమిది వారాలకు ఈ రెండు ఓటీటీలో స్ట్రీమింగ్‌ రానున్నట్లు తెలుస్తోంది


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !