
అన్నీ తానై...
పార్టీ అధినేత చంద్రబాబు పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల కంటే అత్యధిక పంచాయితీల్లో గెలిపించటంలో కీలక పాత్ర వహించారు. ఆర్థికంగా బలమైన నేత కావటంతో ఇప్పటికీ ఏ కార్యకర్తకు ఎలాంటి కష్టం వచ్చినా చేతనైనంత ఆర్థిక సహాయం చేస్తూ వారికి నేనున్నాను అనే భరోసా ఇస్తున్నారు. మృదుస్వభావం, కల్మషం లేని వ్యక్తి కావటంతో అన్ని వర్గాల ప్రజలతో ఇట్టే కలిసి పోతున్నారు, అందరినీ గౌరవిస్తూ ముందుకు సాగుతున్నారు. అలాగే నియోజకవర్గంలో తిష్ట వేసిన ఇసుక, మట్టి మాఫియాలపై రాజీలేని పోరాటం చేస్తున్నారు. గంజాయి విక్రయాలపై గళం ఎత్తుతూ యువతను మత్తుకు బానిసలు కాకుండా నియంత్రించే దిశగా తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితిపై యం.ఆర్.ఓ, కలెక్టర్లకు వినతి పత్రాలు ఇస్తున్నారు. ఎన్నికల హామీగా ఇచ్చిన అమరావతి` బెల్లంకొండ డబుల్ లైన్ రహదారి పూర్తి చేయలేకపోవటంపై స్థానిక ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యాన్ని ప్రజల్లోకి తీసుకెళుతున్నారు. వైకుంఠపురం ` నకరికల్లు వరకు కృష్ణా, గోదావరి, పెన్నా నదుల అనుసంధాన ప్రాజెక్టుకు భూములు కోల్పోతున్న రైతుల కోసం పోరాడుతున్నారు. వారికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటానని మాట ఇచ్చారు. ఇలా ఒక్కొక్క కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళుతూ పాలకుల ప్రజావ్యతిరేక నిర్ణయాలను ఎండగడుతున్నారు. రోజురోజుకి తన బలాన్ని పెంచుకుంటున్నారు.
గెలుపు నల్లేరు మీద నడకే.
రాజధానికి అత్యంత సమీప ప్రాంతం కావటంతో అమరావతి, పెదకూరపాడు మండలాల్లో ఓట్లన్నీ ఏకపక్షంగా పడే సూచనలు కనిసిస్తున్నాయి. చంద్రబాబుకి నమ్మినబంటు కావటంతో ఈసారి ఈయన నాయకత్వానికి ఎలాంటి ఢోకా లేదని తెలుస్తోంది. పార్టీ పిలుపు మేరకు బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాలని గ్రామ గ్రామాన నిర్వహిస్తూ విజయవంతం చేస్తున్నారు. ఇటీవల క్లష్టర్ల వైజ్‌గా సమావేశాలు నిర్వహిస్తూ మండల స్థాయి నాయకులకు దిశానిర్థేశం చేస్తున్నారు. ఆత్మీయ సమ్మేళనాలతో నాయకులకు, ప్రజలకు చేరువ అవుతున్నారు. అన్నింటి కంటే ముఖ్యంగా ఆయనకు కలిసొచ్చే అంశం ఏమిటంటే నియోజకవర్గం స్థానిక (లోకల్) నాయకుడు కావటం ఆయనకు పెద్ద వరం అని చెప్పవచ్చు.