Summer Food : ఎండాకాలంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి ?

0
ఏ కాలానికి తగ్గట్లు ఆ కాలానికి తీసుకునే ఆహారపు అలవాట్ల విషయంలో మార్పులు చేసుకోవాలి. అందులో భాగంగానే వేసవి వచ్చేసింది. ఉష్ణోగ్రతలు రోజురోజుకి పెరుగుతున్నాయి. చాలా చోట్ల పెరిగిన ఉష్ణోగ్రతలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీంతో ఇప్పట్నుంచే సరైన ఆహార పదార్థాలు (Summer Food) తీసుకోవడం చాలా ముఖ్యం. వీటిని తీసుకోవడం చాలా వరకూ సమస్యలు దూరమవుతాయి. ఎండాకాలంలో శరీరంలో వేడి పెరుగుతుంది. ఈ సమయంలో అనేక సమస్యలు కూడా వస్తాయి. అలా కాకుండా శరీరాన్ని చల్లగా ఉంచుకోవాలంటే తీసుకునే ఫుడ్‌ (Summer Food) విషయంలో మార్పులు చేయాలి. ఫ్రై ఐటెమ్స్‌ తీసుకోవడం తగ్గించాలి. దీని వల్ల కడుపు సమస్యలు చాలా వరకూ తగ్గుతాయి. అదే విధంగా ఎప్పటికప్పుడు హైడ్రేటెడ్‌గా ఉండాలి. వీటితో పాటు బాడీని చల్లబరిచే ఫుడ్స్‌ లిస్ట్‌ తెలుసుకుందాం.

(Summer Food) పెరుగు & మజ్జిగ :

ప్రోబయోటిక్‌ రిచ్‌ ఫుడ్‌ అయిన పెరుగు కచ్చితంగా తీసుకోవాల్సిన ఐటెమ్‌. ఇది జీర్ణ క్రియను మెరుగ్గా చేయడమే కాకుండా కడుపులో మంటను తగ్గిస్తుంది. ఈ మిల్క్‌ ప్రోడక్ట్‌లో కాల్షియం కూడా ఎక్కువగానే ఉంటుంది. దీని వల్ల ఎముకలు, దంతాలు బలంగా మారతాయి. ఇందులోని ప్రోటీన్‌ బరువుని కంట్రోల్‌ చేసేందుకు సాయపడతాయి. శరీరాన్ని చల్లగా ఉంచే అద్భుతమైన పానీయం. ఇందులో క్యాల్షియం, ప్రొటీన్లు ఎక్కువ. మజ్జిగలోని ప్రొబయోటిక్స్‌ జీర్ణవ్యవస్థకు మేలుచేస్తాయి.

జావ:

జావ, అంబలి ఇలా వేటినైనా తీసుకోవచ్చు. వీటిని కూడా జొన్న పిండి, రాగి పిండితో చేసుకోవచ్చు. దీని వల్ల కడుపు నిండుగా అనిపించడమే కాకుండా చల్లగా ఉంటుంది. ఈ పిండిలో ప్రోటీన్‌, ఫైబర్‌, కాల్షియం, ఐరన్‌, మెగ్నీషియం వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని తినడం వల్ల శరీరానికి శక్తి అందుతుంది. ఈ డ్రిరక్‌ బాడీని చల్లగా ఉండేలా చేస్తుంది.

పనస పండు:

పనస పండు.. ఈ పండు రుచిగానే ఉందనుకుంటారు చాలామంది. కానీ.. దీనిని తినడం వల్ల శరీరం చల్లగా ఉంటుంది. ఎన్నో ఖనిజాలు, విటమిన్స్‌ ఉన్న ఈ జాక్‌ఫ్రూట్‌లో విటమిన్‌ సి పుష్కలంగా ఉంటుంది. అందుకే ఈ పండుని కచ్చితంగా తినాలి. ఇందులోని ఇమ్యూనిటీ పవర్‌ శరీరాన్ని బలంగా చేస్తుంది.

పుచ్చకాయ (Watermenlon):

సమ్మర్‌ ఫ్రూట్‌లో ముఖ్యంగా ఉండాల్సిన పండు పుచ్చకాయ. నీటి శాతం ఎక్కువగా ఉండే ఈ పుచ్చకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని తినడం వల్ల చాలా సేపటి వరకూ హైడ్రేట్‌గా ఉంటాం. శరీరం చల్లగా ఉంటుంది. ఇందులో లైకోపిన్‌ చర్మాన్ని సూర్యరశ్మి నుంచి కాపాడుతుంది. అంతేకాదు, దీనిని తిన్న వెంటనే ఆకలి అంతగా అవ్వదు.

దోసకాయ:

నీటితో పాటు పోషకాలు పుష్కలంగా ఉన్న ఫ్రూట్స్‌లో దోసకాయ ఒకటి. ఇందులో కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. దీనిని తినడం వల్ల శరీరం చల్లబడడమే కాదు, బరువు కూడా కంట్రోల్‌లోనే ఉంటుంది. ఫైబర్‌ ఎక్కువగా ఉన్న ఈ దోసకాయ తింటే జీర్ణ క్రియ మెరుగ్గా మారి మలబద్ధకం దూరమవుతుంది. ఈ దోసకాయను తినడం వల్ల బాడీ హైడ్రేట్‌గా ఉంటుంది. దీనిని తింటే ఎండల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు.

ఎండాకాలంలో ( Summer Food ) ఊరికే అలసిపోతాం. కాబట్టి, కచ్చితంగా రెండు, మూడు గంటలకి ఓ సారి లిక్విడ్స్‌ తీసుకోవడం, నీటి శాతం ఎక్కువగా ఉన్న పండ్లు తీసుకోవడం మంచిది. అదే విధంగా, వీలైనంత వరకూ ఎక్కువగా ఎండలో ఉండకుండా ప్రయత్నించండి. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల పెరిగిన ఎండల నుంచి మనల్ని మనం కాపాడుకుంటాం.

మొలకలు: 

ఇవి ప్రొటీన్స్‌, ఫైబర్‌ గనులు. తేలికగా జీర్ణమవుతాయి. వేడి వాతావరణంలో మంచి ఆహారం.

చిరుధాన్యాలు: గోధుమలు, బియ్యానికి బదులుగా రాగి, జొన్నలు, క్వినోవా తీసుకోవచ్చు. వీటిలో ఫైబర్‌ ఆరురెట్లు ఎక్కువ. రక్తంలో చక్కెర స్థాయులను పెంచే ట్కగ్లెసిమిక్‌ ఇండెక్స్‌ తక్కువ. యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. దీంతో ఎండల్లో నిస్సత్తువ ఆవరించదు. నిలకడైన శక్తి లభిస్తుంది.

సీజనల్‌ పండ్లు (Seasional Fruits): తర్బూజ, పీచ్‌, బెర్రీ, అంగూర్‌ పండ్లు శరీరాన్ని తేమగా ఉంచుతాయి. డీహైడ్రేషన్‌ దుష్ప్రభావాల నుంచి కాపాడతాయి.

కొబ్బరినీళ్లు (Coconut Water) :కొబ్బరినీళ్లలో ఎలెక్ట్రోలైట్స్‌ సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తినిస్తాయి. వడగాలులు, అధిక ఉష్ణోగ్రతల నుంచి రక్షిస్తాయి.

ఇవి వద్దు..

మాంసం (chicken & mutton) : మాంసాహారాలు వేడిని పెంచుతాయి. సాధ్యమైనంత వరకు నాన్‌వెజ్‌ తగ్గించాలి. వేడి వాతావరణంలో మాంసం త్వరగా కుళ్లిపోతుంది. విషతుల్యంగానూ మారవచ్చు.

కాఫీ, టీ ( Coffie and Tea) రెండిట్లోనూ కెఫీన్‌ అధికం. ఇది శరీరాన్ని డీహైడ్రేట్‌ చేస్తుంది. మోతాదుకు మించితే శరీరంలో వేడి పెరుగుతుంది. అది నిద్రకు చేటు చేస్తుంది. కడుపు ఉబ్బరాన్ని పెంచుతుంది. తేన్పులు ఎక్కువగా వస్తాయి.

వేయించిన ఆహారం (Fry Itams): నూనెలో వేయించిన పదార్థాలు ఓపట్టాన జీర్ణం కావు. దీంతో జీర్ణ సంబంధ సమస్యలు తలెత్తుతాయి. ఆరోగ్యం మీద దుష్ప్రభావం పడుతుంది. ఉప్పు, ప్రిజర్వేటివ్స్‌, ఫ్లేవర్స్‌ ఎక్కువగా ఉండే సాస్‌, చిప్స్‌ లాంటివి కూడా హానికరమే.

డ్రై ఫ్రూట్స్‌ ( Dry Fruits) : ఇవి ఒంట్లో వేడిని ఉత్పత్తి చేస్తాయి. ఫలితంగా మొటిమలు, దద్దుర్లు వస్తాయి. రాత్రంతా నీళ్లలో నానబెట్టి తింటే మాత్రం మంచిదే.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !